AletheiAnveshana

Friday, 24 October 2025

వినయంలో పుట్టిన నివేదన సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

 

వినయంలో పుట్టిన నివేదన

 

సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

 

వినయవంతుల ప్రార్థన మేఘాలను చీల్చుతుంది. దాని గమ్యాన్ని చేరుకునే వరకు అది విశ్రాంతి తీసుకోదు.” (సిరాకు 35:17)

 

భక్తుడైన యూదుడు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మరియ 3 గంటలకు మూడుసార్లు ప్రార్థన చేసేవాడు. అదే ప్రార్థన ఆలయంలో చేస్తే అది చాలా ప్రభావవంతంగా ఉంటుందని భావించేవారు. దీని ప్రకారంగా, ఆయా సమయాల్లో, చాలామంది ప్రార్థన చేయడానికి ఆలయ ప్రాంగణాలకు వెళ్లేవారు. యేసు ఇద్దరు వ్యక్తులు పైకి వెళ్ళిన దాని గురించి మరియు వారు ప్రార్థించిన విధానం గురించి ప్రస్తావించడం సువార్తికుడు లూకా మనకు వివరిస్తున్న్నాడు. మనకు కథ తెలుసు. మన ప్రార్థన దేవునికి ప్రీతికరమైనదా కాదా అని మనం ఎలా తెలుసుకోగలం? దేవుని నామంలో మాట్లాడిన ప్రవక్త హోషేయ: “నేను త్యాగాన్ని కాదు, స్థిరమైన ప్రేమను కోరుకుంటున్నాను” (హోషే 6:6) అని దైవ అభీష్టాన్ని  ప్రవచించాడు. దేవుని పట్ల మరియు పొరుగువారి పట్ల ప్రేమతో కూడిన హృదయం నుండి ప్రార్ధన ఉద్భవించకపోతే, మనం దేవునికి చేసే ప్రార్థనలు మరియు త్యాగాలు ఆయనకు అర్థరహితంగా ఉంటాయి.

 

మనం వినయంతోనూ, దయ మరియు క్షమాపణ కోరుకునే పశ్చాత్తాప హృదయంతోనూ దేవుని వద్దకు రాకపోతే, ఆయన మన ప్రార్థనలను వింటాడని మనం ఎలా ఆశించగలం? మనకు దేవుని కృప మరియు సహాయం నిరంతరం అవసరం. అందుకే లేఖనం "దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు కృపను అనుగ్రహిస్తాడు" అని మనకు చెబుతుంది (యాకో 4:6; సామె 3:34). యేసు ఉపమానం ప్రార్థనా స్వభావం మరియు దేవునితో మనకు వున్న సంబంధం గురించి మాట్లాడుతుంది. ప్రార్థన పట్ల రెండు విభిన్న వైఖరులను ఇది విభేదిస్తుంది. పరిసయ్యుడు మతపరమైన ఆచారాలలో గర్వాన్ని సూచిస్తాడు మరియు పన్ను వసూలు చేసే సుంకరి వినయాన్ని సూచించినప్పటికీ మత చ్చాoదస్తపరమైన మనస్సు గలవారు అతన్ని తృణీకరిస్తారు. మనం గర్వంతో కాకుండా వినయంతో దేవుణ్ణి వెతుకుతున్నందున దేవుడు అలాంటి ప్రార్థనను వింటాడు. షిలోహులోని హన్నా మొదలుకొని ఆలయంలో సొలొమోను ప్రార్ధాన వరకు, కార్మేలు పర్వతంపై  ఏలీయా నుండి యేసు కథలోని పన్ను వసూలు చేసే సుకంరి వరకు, నిజమైన ప్రార్థన ఎల్లప్పుడూ వినయం మరియు దేవునిపై ఆధారపడటం నుండే పుట్టింది. హన్నా, “ఓ సైన్యములకధిపతియగు ప్రభువా! నీ దాసి దుఃఖాన్ని నీవు చూస్తే...” (1 సమూ 1:11) అని ప్రార్థించింది. సొలొమోను రాజు, “నీ సేవకునికి నీ ప్రజలను పరిపాలించడానికి వివేకవంతమైన హృదయాన్ని ఇవ్వు” అని ప్రార్థించాడు (1 రాజు 3:9). ఏలీయా , "ఓ ప్రభువా, నాకు ఉత్తరమిమ్ము, ఈ ప్రజలు నీవే దేవుడవని తెలుసుకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము" అని ప్రార్థించాడు.

 

జాను క్రిసోస్టము అనే పితృపాదులు పరిసయ్యుడు దేవునికి కాదు ప్రార్ధించింది, తనకు తనకే ప్రార్థించుకున్నాడు. అతను తన సొంత వ్యర్థానికకే ధూపం వేసుకున్నాడు” అని అంటున్నాడు.  అంటే తన తగ్గింపు జీవితాన్ని తెలుసు కున్నాడు అని అర్ధం. పునీత జాను డమస్సీన్ అనే మరో పితృ పాదులు, “ప్రార్థన అంటే ఒకరి మనస్సు మరియు హృదయాన్ని దేవుని వైపు ఎత్తడం లేదా దేవుని నుండి మంచి విషయాలను అభ్యర్థించడం” అని  అంటున్నాడు. కానీ మనం ప్రార్థించేటప్పుడు, మనం మన గర్వ సంకల్పపు ఎత్తుల నుండి మాట్లాడుతున్నామా లేదా వినయపూర్వకమైన పశ్చాత్తాపపడిన హృదయపు 'లోతుల నుండి' మాట్లాడుతున్నామా? (కీర్తన 130:1). పునీత అగుస్టీను ఇటువంటి వినయ తత్త్వాన్ని  సువార్తపు హృదయంగా వివరిస్తూ, “తాను అనారోగ్యంతో ఉన్నానని తెలిసినవాడు వైద్యుడిని వెతుకుతాడు. పాపపు ఒప్పుకోలు అనేది స్వస్థతకు నాంది.” అని వ్యాఖ్యానించాడు. మనం దేవుని ముందు బిచ్చగాళ్లం. “మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదని” మనం వినయంగా అంగీకరించినప్పుడు మాత్రమే, ప్రార్థన బహుమతిని స్వేచ్ఛగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండగలం. దేవుని చెవి దీనుల వైపు వంగి ఉంటుంది. గర్విష్ఠులు గోపురాలు “దైవ శిఖరాలు”  నిర్మిస్తారు. వినయస్థులు జీవిత బలిపీఠాలను నిర్మిస్తారు. దేవుడు గోపురాలు లేదా “దైవ శిఖరాలు” పై కాకుండా, జీవిత బలిపీఠాలపై జీవిస్తాడు. దర్శనమిస్తాడు. నేడు మనం: “ఓ దేవా, పాపిని, నన్ను కరుణించు” అనే స్ఫూర్తితో ప్రార్థిద్దాం. మరియు మనం హృదయపూర్వకంగా, వినయంగా, నిజాయితీగా ప్రార్థిస్తే - అప్పుడు పన్ను వసూలు చేసే వ్యక్తివలే, మనం కూడా నీతిమంతులుగా ఇంటికి వెళ్ళగలము. అప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగల శాంతితో మన హృదయాలు నిండి ఉంటాయి.

 

"క్రీస్తులో మనం దేవునికి ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాము - ఎందుకంటే ఆయన మన కోసం, మనలో, మరియు మన ద్వారా ప్రార్థించాడు" (పునీత అంబ్రోసు)

 

Prayer Born in Humility Sirach 35:12-14,16-18; 2 Tim 4:6-8,16-18; Lk 18:9-14 (30/C)

 

Prayer Born in Humility

 

Sirach 35:12-14,16-18; 2 Tim 4:6-8,16-18; Lk 18:9-14 (30/C)

 

The prayer of the humble pierces the clouds; it will not rest until it reaches its goal.” (Sir 35:17)

 

The devout Jew observed prayer three times daily, 9 a.m., 12 p.m., and 3 p.m. Prayer was held to be especially efficacious if it was offered in the Temple. Accordingly, at these hours, many used to go up to the Temple courts to pray. Jesus told of two men who went up and the way they prayed. We know the story. How can we know if our prayer is pleasing to God or not? The prophet Hosea, who spoke in God's name, said: “I desire steadfast love and not sacrifice” (Hos 6:6). The prayers and sacrifices we make to God mean nothing to him if they do not spring from a heart of love for God and for one’s neighbor.

 

How can we expect God to hear our prayers if we do not approach him with humility and with a contrite heart that seeks mercy and forgiveness? We stand in constant need of God’s grace and help. That is why Scripture tells us that “God opposes the proud but gives grace to the humble” (Jam 4:6; Prov 3:34). Jesus’ parable speaks about the nature of prayer and our relationship with God. It does this by contrasting two very different attitudes towards prayer. The Pharisee represents pride in religious practices, and the tax collector represents humility despised by the religious-minded. God hears such a prayer because we seek God with humility rather than with pride. From Hannah in Shiloh to Solomon in the temple, from Elijah on Mount Carmel to the tax collector in Jesus’ story, true prayer has always been born of humility and dependence on God. Hanna prayed, “O Lord of hosts, if you will look upon the misery of your handmaid…” (1 Sam 1:11). King Solomon prayed, “Give your servant an understanding heart to govern your people” (1 Kings 3:9). Elijah prayed, “Answer me, O Lord, answer me, so that this people may know that you are God.”

 

John Chrysostom says, “The Pharisee prayed not to God, but to himself; he offered incense to his own vanity.” St. John Damascene says, “Prayer is the raising of one’s mind and heart to God or the requesting of good things from God. But when we pray, do we speak from the height of our pride and will, or 'out of the depths' of a humble and contrite heart? (Ps 130:1). St Augustine interprets it as the very heart of the Gospel, saying, “He who knows he is sick will seek the physician; the confession of sin is the beginning of healing.” We are beggars before God. Only when we humbly acknowledge that “we do not know how to pray as we ought,” are we ready to receive freely the gift of prayer.  God’s ear bends toward the lowly. The proud build towers; the humble build altars. And God descends not on towers, but on altars. Let us pray today in that same spirit: “O God, be merciful to me, a sinner.” And if we pray sincerely, humbly, truthfully —then like the tax collector, we too will go home justified… our hearts filled with the peace that only God can give.

 

In Christ we learn how to pray — for He prayed for us, in us, and by us” (St Ambrose)

 

 

 

Saturday, 18 October 2025

నా అపవాదిని గద్దించువాడవు నీవే నిర్గమ 17:8-13; తిమోతి 3:14-4:2; లూకా 18:1-8 (29/C)

 

 


నా అపవాదిని గద్దించువాడవు నీవే

నిర్గమ 17:8-13; తిమోతి 3:14-4:2; లూకా 18:1-8 (29/C)

నా ప్రాణము నీకై దాహము గొని యున్నది, నా దేహము నీకొరకు ఆరాటపడుచున్నది” (కీర్త 62)

 

నేటి ప్రార్ధనా విధానం – ప్రార్థనలో చలించని పట్టుదలను పరిగణించమని మనల్ని ఆహ్వానిస్తుంది. సువార్తలో, "ఎల్లప్పుడూ అలసిపోకుండా ప్రార్థించవలసిన" ​​అవసరాన్ని యేసు మనకు గుర్తు చేస్తున్నాడు (లూకా 18:1). పాత నిబంధన కాలంలోని పేద విధవరాండ్రకు చాలా మంది విరోధులు వుండేవారు. వారు తమ బలహీనమైన నిస్సహాయ స్థితిని అనాగరికంగా ఉపయోగించుకుని వారి హక్కులపై దాడి చేసి, వారికి ఉన్న కొద్దిపాటిని కాచేసేవారు (యిర్మీ 21:3; యెష 1:17). లూకా నేడు ప్రస్తావించే  విధవరాలు ఒక అపరిచితురాలు మరియు తాను ఒంటరిగా అన్యాయమైన న్యాయమూర్తి వద్దకు వచ్చింది. ఆమెకు తన పక్షాన నిలబడటానికి ఏ స్నేహితులు లేదా ఏ న్యాయవాది లేరు. న్యాయమూర్తి స్పష్టంగా యూదు న్యాయమూర్తి మాత్రము కాదు. అతను హేరోదు లేదా రోమన్లు ​​నియమించిన జీతం పొందే న్యాయమూర్తులలో ఒకడు. అలాంటి న్యాయమూర్తులు అపఖ్యాతి పాలయ్యారు. ఒక బాధితుడు పలుకుబడి ప్రభావం లేదా డబ్బు ఉంటే తప్ప, తీర్పు వచ్చేది కాదు. లంచం ఇస్తేనే తప్ప తమ కేసు పరిష్కరించబడుతుందనే ఆశ వారికి ఉండేది కాదు. ఇటువంటి న్యాయమూర్తులను(DayyanehGezeroth) దోపిడీ న్యాయమూర్తులుగా పిలిచేవారు.

 

ఇటువంటి నేపద్యంలో దేవుడు ప్రార్థనలు వింటాడనీ వాటికి సమాధానం ఇస్తాడనీ నమ్మకంగా, దేవునితోనే సంబంధం కలిగి, పట్టుదలగల విధవరాలిలా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. యేసు  తన క్రియలతోనూ, తన సజీవ వాక్కుతో బోధిస్తున్నాడు. హృదయం నుండి మాట్లాడటం అంటే  హృదయంతో మాట్లాడడం. దేవుడు మానవ హృదయాన్ని చదువు తున్నాడు (కీర్త 44:21).  ప్రార్ధనలో నేను ఉపయోగించే పదాలకన్నా నన్ను బాగా తెలుసుకొని నాతో మాట్లాడే వాడు నా దేవుడు (2 దినవృత్త 18:13). తదుపరి నిమిషం, గంట, వారం, నెల లేదా సంవత్సరంలో మనకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు మాత్రమే మన సమయాన్ని పూర్తిగా చూడగలడు. కాబట్టి   దీర్ఘకాలంలో మనకు ఏది మంచిదో అతనికి మాత్రమే తెలుసు (యిర్మీ 29:11). అందుకే మనం ప్రార్థనలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని యేసు చెప్తున్నాడు.

 

అహరోను, హోరుల సహాయంతో, మోషే కొండపై చేస్తున్న ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు.  అందుకే ఇశ్రాయేలు ప్రజలపై దాడి చేస్తున్న సైన్యాలను యెహోషువ ఓడించగలిగాడు. అమలేకీయులను ఓడించినది నిజంగా దేవుడే! యెహోషువ కాదు. మన శత్రువులను ఓడించేది నిజంగా దేవుడే! మనం కాదు కదా (నిర్గమ 14:14)! ప్రతీకారం మనది కాదు, ఆయనదే (ద్వితీ 32:35). మనం నమ్మకంగా ప్రార్థిస్తూ మంచి పోరాటం చేయడమే మన వంతు కృషిని మనం చేయాలి. ప్రార్ధనలో మనం బల హినులమైనపుడు మన క్రైస్తవ సమాజం తన ప్రార్థనలో మన చేతులను పైకెత్తి ప్రార్ధిస్తూ సహాయం చేస్తోంది. మన దేవుని ప్రేమ మరియు శ్రద్ధ మనతో ఉంటే, మనకు వ్యతిరేకంగా ఎవరు ఉండగలరు? (రోమా 8:31). నేటి మన సువార్త విధవరాలు మన సమాజంలోని పేదలు మరియు రక్షణ లేని వారందరికీ చిహ్నంగా వుంది. పట్టుదల అనే ఆయుధం ద్వారా తప్ప న్యాయమూర్తి నుండి తన న్యాయం పొందలేనన్న ఆశ తనలో లేదని ఆమెకు తెలుసు. ఇది సుస్పష్టం.

 

ఈ ఉపమానం రొట్టె కొరకు అర్ధరాత్రి స్నేహితుడి తలుపు తట్టిన ఉపమానం లాంటిది (లూకా 11 :5-13). ఇది అలాంటి వ్యక్తులతో భగవంతునుని విభేదిస్తుంది. అందుకే, విసిగి పోయిన న్యాయమూర్తి చివరికి ఒక విధవరాలికి న్యాయం చేయడంలో నిర్ణయం తీసుకొనగలిగితే, ప్రేమగల తండ్రి అయిన దేవుడు తన పిల్లలకు అవసరమైన దానిని ఎంత ఎక్కువగా ఇవ్వ గలడు?” అని యేసు అంటున్నాడు. మన ప్రార్ధనకు యేసు ప్రార్థన ఒక నమూనా. ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “నీ విశ్వాసం విఫలం కాకూడదని నేను ప్రార్థించాను” (లూకా 22:32). శిలువ వేయబడినప్పుడు,  తండ్రీ, వారిని క్షమించు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు” (లూకా 23:34) అని  ప్రార్ధంచాడు. మరియు ఆయన తన చివరి శ్వాసను విడిచి నప్పుడు, “తండ్రీ, నీ చేతుల్లో నా ఆత్మను అప్పగించుకుంటున్నాను” (లూకా 23:46) అని ప్రార్ధంచాడు.

 

విశ్వాసం అనేది దేవుడు మనకు ఇచ్చే బహుమతి. పునీత అగుస్టీను ప్రార్థించినట్లుగా, దేవుడు మొదట మనల్నితన  దయగల ప్రేమతో తన వైపుకు ఆకర్షించకపోతే మనం తనలోనికి ఆశతో నమ్మి రాలేము. మొదట ఆయన మనలను తన కృప కొరకు పిలువకపోతే మనం ఆయన దగ్గరకు రాలేము. తాను మనలను మొదట కనుగోనకపోతే మనం అయనను ఎన్నటికీ కనుగోనలేము. జీవితాంతం వరకు విశ్వాసంలో ఎదగాలని మరియు పట్టుదలతో ఉండాలనుకుంటే, మనం దేవుని వాక్యంతో మన విశ్వాసాన్ని పోషించుకోవాలి. దానిని పెంపొందించమని ప్రభువును అడగాలి (లూకా 17:5). పరీక్షలు మరియు ఎదురుదెబ్బలు మనల్ని నిరాశపరిచినప్పుడు, మనం మన ఆశ మరియు విశ్వాసాన్ని ఎక్కడ ఉంచుదాము? దేవుడు మన కోసం తన దయగల సంరక్షణ మరియు ఏర్పాటును కలిగి యున్నాడు. అందుకు నిరీక్షణతో దృఢమైన ఆశతో ప్రార్థిoచ లేమా?

 

 

"నేను నా జీవితాంతం ప్రభువు ఇంట్లో నివసించడానికి కోరుకుంటున్నాను..."(కీర్త 27:4)

Avenge me of my Adversary Ex 17:8-13; Tim 3:14-4:2; Lk 18:1-8 (29/C)




Avenge me of my Adversary

 

Ex 17:8-13; Tim 3:14-4:2; Lk 18:1-8 (29/C)

 

My soul thirsts for you, my body longs for you” (Ps 62).

 

Today’s liturgy invites us to consider perseverance in prayer. In the Gospel, Jesus reminds us about the necessity “to pray always without becoming weary” (Lk 18:1). The poor widows in the times of OT had many adversaries, who barbarously took advantage of their weak and helpless state to invade their rights, and defraud them of what little they have (Jer. 21:3; Is 1:17). The widow presented by Luke was a stranger and alone by herself came to an unjust judge. She had neither friends nor an attorney to advocate her cause. The judge was clearly not a Jewish judge. He was one of the paid magistrates appointed either by Herod or by the Romans. Such judges were notorious. Unless a plaintiff had influence and money to bribe his/her way to a verdict, they had no hope of ever getting their case settled. These judges were known as Dayyaneh Gezeroth (robber judges).

 

Jesus wants us to be like the persistent widow, staying in a relationship with God, confident that God hears and answers prayers. He teaches with his deeds and with his words. To speak from the heart is also to the heart (Ps 44:21). God can read the human heart and knows me better than any words I might use. We do not know what will happen to us in the next minute, hour, week, month, or year. Only God sees time whole, and, therefore, only God knows what is good for us in the long run (Jer 29:11). That is why Jesus said we must never be discouraged in prayer.

 

With the help of Aaron and Hur, Moses persevered in prayer, and Joshua defeated the forces attacking the people of Israel. It was really God who defeated the Amalekites. It was not Joshua. It is really God who will defeat our enemies, not us (Ex 14:14).  Vengeance is his, not ours (Dt 32:35). We need to keep praying in trust and doing our part to put up a good fight. Our Christian Community helps us hold up our hands in prayer. If the love and concern of our God are with us, who can be against us? (Rom 8:31). The widow is the symbol of all our poor and defenseless. It was obvious that she, without recourse of any kind, had no hope of ever extracting justice from such a judge except through the weapon of persistence.

 

This parable is like the parable of the Friend at Midnight (Lk 11: 5-13). It contrasts God with such persons. Jesus says, “If, in the end, an unjust judge can be wearied into giving a widow justice, how much more will God, who is a loving Father, give his children what they need?” Jesus is a model of prayer. He said to Peter: “I have prayed that your own faith may not fail” (Lk 22:32). At the crucifixion, he said, ‘Father, forgive them, they know not what they do” (Lk 23:34), and when he breathed his last, “Father, into your hands I commend my spirit” (Lk 23:46).

 

Faith is a gift that God gives us. We could not believe in God in hope if God did not first draw us to himself with merciful love, as St Augustine prayed. If we want to grow and persevere in faith until the end of our days, then we must nourish our faith with the word of God and ask the Lord to increase it (Lk 17:5). When trials and setbacks disappoint us, where do we place our hope and confidence? Do we pray with expectant faith and confident hope in God’s merciful care and provision for us?

 

 

I seek to dwell in the Lord’s house all the days of my life…(Ps 27:4)

 

 

 

 

 

 


Friday, 10 October 2025

Lord! Help my Unbelief 2 Kig 5:14-17; 2 Tim 2:8-13; Lk 17:11-19 (28/C)

 


Lord!  Help my Unbelief

 

2 Kig 5:14-17; 2 Tim 2:8-13; Lk 17:11-19 (28/C)

Who shall climb the mountain of the Lord? Who shall stand in his holy place?”

 

The central theme of today’s readings is gratitude. God expects gratitude from us for the many blessings we receive from him. So often, once one gets what they want, they never come back. Today’s stories of lepers in the Old Testament and the leper in the Gospel remind us that faith and healing are closely intertwined. It demonstrates an unconditional love of God for all people. In the world of Jesus, leprosy meant more than physical suffering. It meant exclusion — being cut off from worship, from community, and even from hope. The book of Leviticus tells us that lepers must live outside the camp and cry, “Unclean!” (Lev 13:45). Only a priest could declare a leper clean again. The 10 lepers in the Gospel stood at a distance and cried out: “Jesus, Master, pity us!” It is a cry from the margins, a plea that pierces the heart of God. And Jesus, full of compassion, tells them: “Go, show yourselves to the priests.” On their way, they are cleansed. But the story takes a surprising turn — only one of them, realizing he has been healed, returns. He falls at the feet of Jesus, praising God with a loud voice and thanking him. And Luke adds the remarkable detail: “He was a Samaritan.”

 

Why does the evangelist Luke tell us that the one who returned was a Samaritan? Because Samaritan was not expected to understand the ways of God. The Jews and Samaritans despised each other. Yet, in this story, the foreigner becomes the model of true faith. The Samaritan recognizes the grace he has received, and his gratitude becomes worship. Jesus said to them, “Your faith has saved you.” All ten were healed in body, but only one was healed in soul. The others received a gift, but Samaritan entered into a relationship. Gratitude is not just good manners — it is the response of a heart that truly believes, as St. Augustine said, “Nine rejoiced in their bodies, but only one rejoiced in the Lord.” We are called to rejoice only in the Lord (Ph 4:4).

 

The Fathers of the Church note three parallels between the Samaritan leper story and the story of Naaman, the Gentile who was healed of leprosy (2 kg 5:14-17). First, both Naaman and the Samaritan leper were foreigners who sought healing from a Divine Jew, Jesus. Second, both were ordered to perform a small, seemingly irrelevant action. Elisha told Naaman to bathe in the Jordan River seven times. Jesus told the ten lepers to show themselves to the priest, who could certify a healing. In both stories, healing took place only after they left the presence of the Divine Jew to obey. Third, both Naaman and the Samaritan returned, praising God, to the one who had commanded them to go.

 

How often do we, like the nine, receive God’s blessings and move on? We pray for help, and when help comes, we forget the giver. Yet true faith always leads back to thanksgiving. The very word “Eucharistia” means “thanksgiving” — it is our return to Jesus to fall at his feet and say, “Thank you, Lord.” Each Sunday, we are that healed Samaritan, coming to praise God for his mercy. The Gospel also reminds us that God’s grace knows no boundaries. His mercy extends to the outsider, the forgotten, the rejected. Jesus does not avoid the lepers or the Samaritans. He walks right into their world. The Church, following her Lord, is called to do the same — to reach out, to welcome, to heal, to include. As we continue our journey to heavenly Jerusalem with Christ in this Eucharist, may we recognize the countless ways he heals and restores us. May our hearts, like those of the grateful and healed lepers, overflow with gratitude every day. Our faith saves us.

 

Let everything that breathes give praise to the Lord! Alleluia”.

 

 

 

ప్రభువా! నా అల్ప విశ్వాసాన్ని మెరుగుపరచు: 2 రాజులు 5:14-17; 2 తిమోతి 2:8-13; లూకా 17:11-19 (28/C)

 



ప్రభువా! నా అల్ప విశ్వాసాన్ని మెరుగుపరచు


2 రాజులు 5:14-17; 2 తిమోతి 2:8-13; లూకా 17:11-19 (28/C)

ప్రభువు పర్వతాన్ని ఎవరు ఎక్కగలరు? ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడగలరు ?

 

నేటి పఠనాల ముఖ్య ఇతివృత్తం కృతజ్ఞత. దేవుని నుండి మనం పొందే అనేక ఆశీర్వాదాలకు ఆయన మన నుండి కృతజ్ఞతను ఆశిస్తున్నాడు. చాలా తరచుగా, ఒకరు కోరుకున్నదానిని పొందిన వెంటనే, వారు ఎప్పటికీ తిరిగి రారు. నేటి పాత నిబంధనలోని కుష్ఠురోగి మరియు సువార్తలోని కుష్ఠురోగి  కథలు విశ్వాసం మరియు స్వస్థత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మనకు గుర్తు చేస్తున్నాయి. ఇది ప్రజలందరి పట్ల మరియు దేవుని పట్ల బేషరతు ప్రేమను ప్రదర్శిస్తుంది. యేసు నాటి ప్రపంచంలో, కుష్టు వ్యాధి అనేది శారీరక బాధ కంటే బహు తీవ్రమైనది. దీని అర్థం బహిష్కరణ. దేవాలయ ఆరాధన నుండి, సమాజం నుండి మరియు జీవితాశల నుండి సహితం వెలివేయ బడింది. కుష్టురోగులు సమాజం నుండి వెలివేయ బడి తమ తమ శిబిరాలలో నివసిస్తూ, "అపవిత్రులు!" అని కేకలు వేయాలని లేవీయకాండ గ్రంథం మనకు చెబుతుంది (లేవీ 13:45). ఒక దేవాలయ అర్చకుడు మాత్రమే కుష్టురోగిని మళ్ళీ పవిత్రంగా నయం చేయలేకపోయినా తన స్వస్థతను ప్రకటించగలడు. సువార్తలోని 10 మంది కుష్ఠురోగులు దూరంగా నిలబడి: “యేసు, ప్రభువా, మాపై జాలి చూపండి!” అని అరిచారు. అది రహదారి అంచుల నుండి వచ్చిన కేక. దేవుని హృదయాన్ని తాకిన విజ్ఞప్తి. కరుణతో నిండిన యేసు వారితో, “వెళ్లి, యాజకులకు మిమ్మల్ని మీరు చూపించుకోండి.” అని అభయమిచ్చాడు. ఆయన మాటలోనే స్వస్థత వున్నది. కాబట్టి వారి వారి మార్గంలోనే వారు శుద్ధి పొందారు. కానీ కథ ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటుంది.  వారిలో ఒకరు మాత్రమే తాను స్వస్థత పొందానని గ్రహించి తిరిగి వస్తాడు. అతను యేసు పాదాలపై పడి, బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడు. మరియు లూకా “అతను ఒక సమరయుడు” అని ఒక అద్భుతమైన వివరాన్ని జోడిస్తున్నాడు కదా!

 

తిరిగి వచ్చిన వ్యక్తి సమరయుడని సువార్తికుడు లూకా మనకు ఎందుకు చెబుతున్నాడు? ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మార్గాలను సమరయులు అర్థం చేసుకోవాలని ఆశించబడలేదు. యూదులు మరియు సమరయులు ఒకరినొకరు తృణీకరించుకున్నారు. అయినప్పటికీ, ఈ అద్భుత కథలో, పరదేశీయుడు నిజమైన విశ్వాసానికి నమూనా అవుతున్నాడు. సమరయుడు తాను పొందుకున్న కృపను గుర్తిoచాడు మరియు అతని కృతజ్ఞత సత్య ఆరాధనగా మారి మారింది. యేసు వారితో, "మీ విశ్వాసం మిమ్మల్ని రక్షించింది" అని అన్నాడు. పది మంది శరీరంలో స్వస్థత పొందారు, కానీ ఒకరు మాత్రమే ఆత్మలో స్వస్థత పొందుకున్నాడు. ఇతరులు బహుమతిని పొందారు. కానీ సమరయుడు ఒక పవిత్ర సంబంధంలోకి ప్రవేశించాడు. పునీత అగుస్టీను  “కృతజ్ఞత కేవలం మంచి మర్యాద కాదు - ఇది నిజంగా నమ్మే హృదయపు ప్రతిస్పందన” అని చెప్పినట్లుగా తొమ్మిది మంది తమ శరీర సుఖాలలో సంతోషించారు. కానీ ఒకరు మాత్రమే ప్రభువులో సంతోషించాడు. మనం ప్రభువునందు మాత్రమే ఆనందించాలి (ఫిలి 4:4).

 

సమరయ కుష్ఠురోగి కథకు మరియు కుష్ట వ్యాధి నుండి స్వస్థత పొందిన అన్యుడైన నయమాను కథకు (2 రాజులు 5:14-17) మధ్య మూడు సమాంతరాలను తిరుసభ పితృపాదులు గమనిస్తారు. మొదటిగా, నయమాను మరియు సమరయ కుష్టురోగి ఇద్దరూ పరిశుద్ధ యూదుడు అయిన యేసు నుండి స్వస్థత కోరిన విదేశీయులు. రెండవదిగా, ఇద్దరునూ ఒక చిన్న, అసంబద్ధమైన చర్యను చేయమని ఆదేశించబడ్డారు. ఎలీషా నయమానుతో జోర్దాను నదిలో ఏడుసార్లు స్నానం చేయమని చెప్పాడు. స్వస్థత ధృవీకరణ కొరకు యేసు పది మంది కుష్టురోగులను దేవాలయ అర్చకునికి తమను తాము చూపించుకోవాలని చెప్పాడు. రెండు కథలలో, వారు పరిశుద్ధ యూదుని సమక్షంలో నుండి విధేయత చూపిన తర్వాత మాత్రమే స్వస్థత జరిగింది. మూడవదిగా, నయమాను మరియు సమరయుడు ఇద్దరూ దేవుణ్ణి స్తుతిస్తూ, వారిని “వెళ్ళుము” అని ఆజ్ఞాపించిన పరిశుద్ధుని వద్దకు కృతజ్ఞతతో తిరిగి వచ్చారు.

 

ఎంత తరచుగా ఆ తొమ్మిది వలే మనం దేవుని ఆశీర్వాదాలను పొందుకొని ఆయనవైపు వెనుతిరుగకుండా ముందుకు వెళ్ళిపోతూ వుంటాము? మనం సహాయం కోసం ప్రార్థిస్తాము. సహాయం అందినప్పుడు, దాతను మరచిపోతాము. అయినప్పటికీ నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ కృతజ్ఞతకు దారితీస్తుంది. “యూకారిస్టియా” అంటే “కృతజ్ఞత” అని అర్థం. ఇది యేసు పాదాలపై పడి “ధన్యవాదాలు, ప్రభువా” అని చెప్పడం అనేది మనవంతు ఆయన  వద్దకు తిరిగి రావడం. ప్రతి ఆదివారం, మనం స్వస్థత పొందుకున్న సమరయులం. దేవుని దయాకనికరాన్ని స్తుతించడానికి వస్తున్నాము. దేవుని కృపకు హద్దులు లేవని నేటి సువార్త మనకు గుర్తు చేస్తుంది. ఆయన దయ గెంటివేయ బడినవారికి, మరుగున పడిపోయినవారికి, తిరస్కరించబడినవారికి విస్తరిస్తుంది. యేసు శారీరకమానసిక కుష్టురోగులను వదిలివేయాడు. ఆయన వారివారి అస్వస్థత లోకంలోకి నేరుగా నడుస్తాడు. తన ప్రభువును అనుసరిస్తున్న తిరుసభ, అదే మాతృకలో నడవడానికి, స్వాగతించడానికి, స్వస్థపరచడానికి, తనలో చేరుకోవడానికి పిలుపునందుకుంది. ఈ దివ్య బలి పూజ ద్వారా క్రీస్తుతో కలసి పరలోక జెరూసలేంకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆయన మనల్ని స్వస్థపరిచే మరియు పునరుద్ధరించే లెక్కలేనన్ని మార్గాలను మనం గుర్తించగలము. కృతజ్ఞతతో మరియు స్వస్థత పొందిన కుష్టురోగుల హృదయాల మాదిరిగానే మన హృదయాలు ప్రతిరోజూ కృతజ్ఞతతో పొంగిపోవాలి. మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది!!

 

"ఊపిరి పీల్చే ప్రతిదీ ప్రభువును స్తుతించనివ్వండి! అల్లెలుయ".