AletheiAnveshana: పునఃరుత్థాన యేసుతో కొత్త జీవితానికి నడుద్దాం

Sunday, 20 April 2025

పునఃరుత్థాన యేసుతో కొత్త జీవితానికి నడుద్దాం

 

పునఃరుత్థాన యేసుతో కొత్త జీవితానికి నడుద్దాం

యూదు సంప్రదాయం ప్రకారం, ఒక రబ్బీ తన విద్యార్థులను తెల్లవారుఝామున చీకటిగా ఉండగానే ఒకచోట చేర్చి, ఈ ప్రశ్న అడిగాడు: రాత్రి ముగిసినదనీ, పగలు ప్రారంభమైనదనీ ఎలా తెలుస్తుంది? అందుకు ఒక విద్యార్థి ఇలా సమాధానమిచ్చాడు: ‘బహుశః మీరు ఒక జంతువును చూసినప్పుడు అది గొర్రెనా లేక కుక్కనా అని మీరు గుర్తించగలరు.’ ‘లేదు,’ అని రబ్బీ అన్నాడు. రెండవ విద్యార్థి ఇలా సమాధానమిచ్చాడు: ‘బహుశః మీరు దూరంలో ఉన్న చెట్టును చూస్తున్నప్పుడు అది అంజూరపు చెట్టునా లేక పీచ్ చెట్టునా అని మీరు చెప్పగలరు.’ ‘లేదు,’ అని రబ్బీ అన్నాడు. మరికొన్ని అంచనాత్మక జవాబుల తర్వాత విద్యార్థులు గురువును తమ సమాధానం ఇవ్వమని అడిగారు. రబ్బీ ఇలా సమాధానమిచ్చాడు: ‘మీరు ఏ స్త్రీ లేదా ఏ పురుషుడి ముఖం చూసినప్పుడు ఆమె మీ సోదరి అని మరియు అతను మీ సోదరుడు అని చెప్ప గలిగినప్పుడే! మీరు దీన్ని చేయలేకపోతే, అది ఎంత సమయం అయినా, అది ఇంకా నిశి రాత్రియే.’

పునీత యోహాను సువార్త కథనం ప్రకారం, ఈస్టర్ చరిత్ర  - వారంలోని మొదటి రోజు తెల్లవారుఝాము 'ఇంకా చీకటిగా' ఉండగానే ప్రారంభమవుతుంది. అదే గ్రంథ కర్త తన మొదటి లేఖలో, 'చీకటి గడిచిపోతోంది మరియు నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది' అని నొక్కి చెప్పాడు. కానీ ఇది ఖచ్చితంగా ఒక షరతుపై ఉంది. దానిని అతను స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: తన సహోదర సహోదరీలను ప్రేమించేవాడు అని స్పష్టం చేశాడు. మరియు  వెలుగులో నివసిస్తాడు మరోవైపు, 'ద్వేషించడానికి ఇష్టపడేవాడు ... చీకటిలోనే ఉన్నాడు (1 యోహాను 2:8-11).

కేవలం రెండు రోజుల క్రితమే, మన మానవ లోకం ఇప్పటివరకు కని విని ఎరుగని బాధామయ సేవకుని అత్యంత అద్భుతమైన బాధల మరణాన్ని మనం స్మరించుకున్నాము. మానవ స్వభావపు చీకటి వైపున, యేసు శత్రువులు ఆయనను హింసించడానికి, అవమానించడానికి చివరకు సిలువపై హత్య చేయడానికి దారితీసిన చీకటిని జీర్ణించుకోలేనంతగా మనం ధ్యానించుకున్నాము. ఆ చీకటి రోజున, ఒకరినొకరు ద్వేషించే, బాధపెట్టే హాని చేసే మానవుల సామర్థ్యం యేరూషలేంలో పూర్తిగా అదుపు తప్పేసింది. కాబట్టె సమయకాలాతీతునికి జరిగిన అన్యాయానికి కాలం మధ్యాహ్నం మూడు గంటల వరకు సిగ్గుతో తలదించుకొని బోరున విలపిస్తూ చీకటితో ముసుగు వేసుకున్నది. బిడియంతో సూర్యుడు కాంతి హీనుడయ్యాడు’. గజగజ వణుకుతూ దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది’ (లూకా 23:24). తమ సృష్టి కర్తకు జరిగిన అవమానానికి సృష్టి తలదించుకోవడం అనేది ఆశ్చర్యం కలిగించదు మరీ!!

వెలుగు చీకటిల మధ్య, మంచి చెడుల మధ్య, ఒక బలమైన పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. ఇది భౌతిక విశ్వంలో, మానవ సమాజాలలో మరియు మన స్వంత వ్యక్తిత్వాలలో జరుగుతోంది. కాంతి కంటే చీకటి తరచుగా బలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, అది ఎన్నటికి విజయం సాధించలేదు. వెలుగు అసాధారణంగా స్థితిస్థాపకంగా ఉంటుంది. తరచుగా ఆరిపోయే ప్రమాదంలో అది మనుగడ సాగించగలదు. అనేక విజయాలను కూడా గెలుచుకుంటుంది. అనేక సంవత్సరాల క్రితమే ఆధునిక భారతదేశ పితామహుడు మహాత్మా గాంధీ ఆనీ బీసెంటుతో చెప్పినట్లే అవి ఇప్పటికీ వాస్తవికతను సంతరించుకుంటున్నాయి. ఒక్క సారి ఆమేతో చెప్పిన మాటలను చూడండి! 'నేను నిరాశ చెందినప్పుడు చరిత్ర అంతటా సత్యం మరియు ప్రేమ మార్గం ఎల్లప్పుడూ గెలిచిందని నాకు గుర్తుంది. నిరంకుశులు మరియు హంతకులు ఉన్నారు. కొంతకాలం వారు అజేయులుగా  అనిపించవచ్చు, కానీ, చివరికి, వారు ఎల్లప్పుడూ పడిపోతారు. అసత్యం ఓడిపోతున్నట్లు కన్పిస్తున్నా, చివరకు గెలిచేది సత్యమే!” ఈస్టర్ జాగరణ ప్రార్థనా విధానపు మాటలు అదే సత్యాన్ని సమాంతరంగా ఆకర్షణీయమైన రీతిలో వ్యక్తపరుస్తున్నాయి. 'ఈ పవిత్ర [ఈస్టర్] రాత్రి ఆశక్తిని ప్రకటిస్తుంది. అన్ని చెడులను తొలగిస్తుంది. అపరాధభావాన్ని కడుగుతుంది. కోల్పోయిన అమాయకత్వాన్ని పునరుద్ధరిస్తుంది. దుఃఖితులకు ఆనందాన్ని తెస్తుంది. ఇది ద్వేషాన్ని పారద్రోలుతుంది. మనకు శాంతిని తెస్తుంది మరియు భూమిపై గర్వాన్ని అణచివేస్తుంది. మన ఈస్టర్ వేడుక చెడు మరియు ద్వేషపు చీకటి ఎప్పటికీ గెలిచే చివరి మాటగా ఒప్పదని మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే యేసు పునరుత్థానం మనలో మరియు మన ప్రపంచంలో చీకటిపై కాంతి చెడుపై మంచితనం అంతిమ విజయాన్ని ప్రకటిస్తుంది.

చీకటి మళ్ళీ భూమిపై ఎగపాకుతున్నప్పుడు, సూర్యాస్తమయ సమయంలో యేసు భౌతిక దేహాన్ని సమాధిలో భద్రపరిచారు. అతను ఒక బాధితుడనీ వైఫల్యుడని అందరికీ అనిపించింది. కానీ మూడవ రోజున భానుడు కేరింతలతో ఆతనితో పాటుగా తన కిరీటమై , సజీవంగా, శక్తివంతంగా ప్రభావవంతంగా చలి చీకటి తెరలను చీల్చుకొని అతని విజయోత్సాహ చిహ్నoగా వెలుగు సత్య పతాకాన్ని దేదీప్య మానంచేశాడు. మరోసారి, 'అందరినీ ప్రకాశవంతం చేసే నిజమైన వెలుగు, లోకంలోకి వచ్చేసింది' (యోహాను 1:9). కాబట్టి ఈ రోజు మనం చీకటి నుండి, మరణం నుండి లేవడం ద్వారా ఆయన పునరుత్థానాన్ని జరుపుకుంటున్నాము. మన మధ్యలో వెలిగించే ఈ అందమైన ఈస్టర్ కొవ్వొత్తి ద్వారా ప్రాతినిధ్యం వహించే పునరుత్థాన ప్రభువు స్వయంగా, చీకటి పనులను విడిచిపెట్టమని, మన జీవితాల్లో చీకటి, దుష్ట మరియు చెడుగా ఉన్న ప్రతిదాన్ని త్యజించి తిరస్కరించమని మరియు బాప్తిస్మము ద్వారా ఆయనతో అనుసంధానించబడిన వ్యక్తులుగా, 'ఎల్లప్పుడూ వెలుగు బిడ్డలుగా నడవాలని' ఆశిస్తున్నాడు మన మృత్యుంజయుడు యేసు. అల్లెలూయ.

No comments:

Post a Comment