“నా
ప్రభువా,
నా దేవా!”
అపొ 5:12-16; ప్రక 1:9-11a,12-13,17-19; యోహాను 20:19-31 (2 / ఈస్టర్/
సి) కారుణ్య ఆదివారము)
నేను
విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాను. నిద్రపోయాను. కానీ
నేను మళ్ళీ లేచాను. ఎందుకంటే ప్రభువు
నన్ను ఆదుకున్నాడు. అల్లెలుయ.
పునీత తోమాసు
వారికి రెండు గొప్ప సద్గుణాలు ఉన్నాయి. తాను అర్థం చేసుకోని వాటిని తాను అర్థం
చేసుకున్నానని లేదా తాను నమ్మని వాటిని తాను నమ్మానని చెప్పడానికి అతను పూర్తిగా
నిరాకరించాడు. అతనిలో రాజీపడని నిజాయితీ ఉంది. అవి లేవని నటిస్తూ తన సందేహాలను
ఎప్పుడూ నిగ్రహించుకోలేదు. తాను నమ్ముకున్న విశ్వాస సత్యాన్ని అర్థం చేసుకోకుండా
దానిని కొట్టిపారవేసే వ్యక్తి కాదు అతను. క్రీస్తు
తనకు జ్ఞానోదయం చేసిన తరువాతి రోజుల్లో తోమాసు వారికి ఏమి జరిగిందో మనకు ఖచ్చితంగా
తెలియదు. కానీ “ది యాక్ట్స్ ఆఫ్ థామస్” అనే అపోక్రిఫల్ పుస్తకం ఒకటి ఉంది. ఇది అతని చరిత్రను అందించ ఉద్దేశించబడింది. ఇది కేవలం పురాణం మాత్రమే. కానీ పురాణం వెనుక కొంత చరిత్ర ఉంది. దానిలో ఖచ్చితంగా తోమాసు
పాత్రకు చెందినవాడు నిజమైన తోమాసు వారే. ఆ గ్రంథం చెప్పే కథలో కొంత భాగాన్ని
విందాం.
యేసు
మరణానంతరం శిష్యులు ప్రపంచాన్ని తమలో తాము విభజించుకున్నారు, తద్వారా ప్రతి ఒక్కరూ
సువార్త ప్రకటించడానికి ఏదో ఒక దేశానికి వెళ్ళాలి. భారతదేశం వెళ్ళడానికి తోమాసు
వారికి చీట్లు పడింది. (దక్షిణ భారతదేశంలోని థామిస్ట్ చర్చి దాని మూలాన్ని అతని
నుండి కనుగొంటుంది) మొదట అతను వెళ్ళడానికి నిరాకరించాడు. కారణం సుదీర్ఘ ప్రయాణానికి తగినంత బలం తనకు లేదని చెబుతూ ఇలా
అన్నాడు: "నేను హీబ్రూ మనిషిని. నేను భారతీయుల మధ్యకు
వెళ్లి సత్యాన్ని ఎలా ప్రకటించగలను?" అందుకు యేసు ఆ రాత్రి
అతనికి కనిపించి ఇలా అన్నాడు: "తోమాసు, భయపడకు,
భారతదేశానికి
వెళ్లి అక్కడ వాక్యాన్ని ప్రకటించు, ఎందుకంటే నా కృప నీకు తోడుగా ఉంది." కానీ తోమాసు అప్పటికీ
మొండిగా నిరాకరించాడు. "నీ ఇష్టమైన ప్రాంతానికి
నువ్వు నన్ను పంపు, నీ ఇష్టం. కానీ నేను భారతీయుల వద్దకు మాత్రం వెళ్ళను” అని చెప్పాడు.
భారతదేశం
నుండి అబ్బానెస్ అనే ఒక వ్యాపారి జెరూసలేంకు వచ్చాడు. గుండఫోరస్ అనే రాజు అతన్ని
నైపుణ్యం కలిగిన వడ్రంగిని కనుగొని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి పంపాడు. తోమాసు ఒక వడ్రంగి. యేసు మార్కెట్ స్థలంలో అబ్బానెస్ వద్దకు
వచ్చి అతనితో: "నువ్వు వడ్రంగిని కొంటావా?" అని అన్నాడు.
అందుకు అబ్బానెస్ "అవును" అని సమాధానం ఇచ్చాడు. అందుకు యేసు, "నా దగ్గర వడ్రంగి
అయిన ఒక బానిస ఉన్నాడు,
అతన్ని
అమ్మాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పి దూరంలో ఉన్న తోమాసు వైపు
చూపించాడు. అప్పుడు వారు ఒక ధరకు అంగీకరించుకోవడంతో
తోమాసు అమ్మబడ్డాడు. ఆ అమ్ముదల ఒప్పందం
ఇలా ఉంది: "వడ్రంగి యోసేపు కొడుకు అయిన యేసు, నేను నా బానిస తోమాసు, గుండఫోరస్ ఇండియన్ల రాజు వ్యాపారి అయిన నీకు
అమ్మేశానని అంగీకరిస్తున్నాను." దస్తావేజు వ్రాసినప్పుడు యేసు తోమాసును అబ్బానెసు వద్దకు తీసుకెళ్లాడు. అబ్బానెస్ తోమాసును
: "ఇతనే నీ యజమానినా?"
అని
అడిగాడు. అందుకు తోమాసు: "నిజమే అతనే."అని జవాబిచ్చాడు. అందుకు అబ్బానెసు:
"నేను నిన్ను అతని నుండి కొన్నాను" అని చెబితే తోమాసు ఏమీ మాట్లాడలేదు.
కానీ ఉదయాన్నే అతను లేచి ప్రార్థించాడు. తన
ప్రార్థన తర్వాత అతను యేసుతో ఇలా అన్నాడు: "ప్రభువైన యేసు, నీ చిత్తం నెరవేరాలని
నేను వెళ్తాను." ఇది అదే పాత తోమాసులో లొంగిపోవడానికి నిశ్చయత కొరతగా వున్నా అతను లొంగిపోవడం పూర్తయిన తర్వాత తన నిశ్చల నిశ్చయత పూర్తయింది.
గుండఫోరస్
రాజు తోమాసు వారిని ఒక రాజభవనం నిర్మించమని ఎలా ఆదేశించాడో, తోమాసువారు ఆ పనిని
ఎలా చేయగలడని చెప్పాడో ఈ కథనం
చెబుతుంది. అతనికి సామాగ్రిని కొనడానికి
మరియు పనివారిని నియమించుకోవడానికి పుష్కలంగా డబ్బు ఇచ్చాడు రాజు, కానీ తోమాసు వారు ఆ
ధనాన్ని పేదలకు పంచి పెట్టాడు. రాజభవనం క్రమంగా వృద్ధి చెందుతోందని అతను ఎప్పుడూ
రాజుతో చెపుతూ వుండేవాడు. కాని రాజుకు ఒకసారి అనుమానం వచ్చింది. చివరికి అతను తోమాసు
వారిని పిలిపించి, "నువ్వు నాకు రాజభవనం నిర్మించావా?" అని అడిగాడు. అందుకు
తోమాసు వారు : "అవును" అని జవాబిచ్చాడు". అయితే, మనం ఎప్పుడు వెళ్లి
చూడాలి?" అని రాజు
అడిగాడు. అప్పుడు తోమాసు వారు: "నువ్వు ఇప్పుడు దానిని చూడలేవు. కానీ నువ్వు ఈ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, నువ్వు దానిని సుస్పష్టంగా
చూడగలవు" అని సమాధానమిచ్చాడు. మొదట రాజు చాలా కోపం చెందినప్పటికీ, తోమాసు
వారు తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నప్పటికి, చివరికి రాజు కూడా క్రీస్తులోనే
భాగ్య జీవితం పొందుకున్నాడు. అలా తోమాసు వారు క్రైస్తవ మతాన్ని భారతదేశానికి
తీసుకువచ్చాడు.
తోమాసు
వారిని గురించి మనం చాలా ప్రేమించదగినది మరియు చాలా ప్రశంసనీయమైనది ఒకటి ఉంది.
విశ్వాసం అనేది అతనికి ఎప్పుడూ సులభమైన విషయం కాడు. విధేయత అనేది అతనికి ఎప్పుడూ సులభంగానూ రాలేదు. అతను
ఖచ్చితంగా ఉండే వ్యక్తి. అందుకు వ్యయ ఖర్చును
లెక్కించాల్సిన వ్యక్తి. కానీ అతను ఖచ్చితంగా ఉన్న తర్వాత, ఖర్చును లెక్కించిన
తర్వాత, విశ్వాస
విధేయతలా అంతిమ పరిమితికి వెళ్ళిన వ్యక్తి అతను. తోమాసు వారి లాంటి విశ్వాసం అనేది ఎలాంటి అబద్ధపు వాదన కన్నా
మిన్ననై ది. మరియు అతని లాంటి
విధేయత అనేది వ్యయ ఖర్చును లెక్కించకుండా ఒక పనిని చేయడానికి అంగీకరించి, ఆపై ఆ మాటను సులువుగా
తిప్పిగొట్టే మనస్తత్వం కంటే మంచిది.
మీ
నిజమైన జీవితం క్రీస్తు
No comments:
Post a Comment