అపొ 12:1-112 తిమోతి 4:6-8,17-18;
మత్త 16:13-19 (13/ C)
“వారు వేర్వేరు
రోజులలో బాధలు అనుభవించినప్పటికీ, వారు ఒక్కటిగా ఉన్నారు. పేతురు
ముందుగా వెళ్ళాడు, పౌలు అనుసరించాడు” (పునీత అగుస్టీను)
ఈ రోజు మనం పునీత పేతురు పౌలుల
వేడుకను జరుపుకుంటున్నాము. వారు ప్రారంభ తిరుసభకి మరియు మన
క్రైస్తవ విశ్వాసానికి పునాది వేశారు. తిరుసభ విస్తరణ ప్రారంభ క్షణాలలో అపొస్తలులు
జీవించి వారి రక్తంతో యేసు ఎడల మన విశ్వాసాన్నిస్థాపితం చేశారు. పునీత పేతురును పౌలును మనం స్మరించు కుంటున్నప్పుడు, వారి నిబద్ధతకు మనం తరచుగా ఆకర్షితులవుతాము. నీటిపై నడచి
వస్తున్న ప్రభువు దరికి చేరడానికి ప్రయత్నించిన విషయాన్ని, ఆపై అతను తన ప్రభువు తెలియదని మూడుసార్లు తిరస్కరించినవిధానాన్ని
మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గాని, లేదా క్రైస్తవులను హింసించి యూదు అధికారుల
ముందు వారిని విచారణకు గురిచేసిన తార్సుకు చెందిన సౌలును గాని మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు
వారి నిబద్ధత మనకు ప్రశ్నార్ధకంగా వున్నా, తదుపరి వారి త్యాగం వర్ణనాతీతం.
ప్రభు సువార్తను ప్రపంచ కేంద్రమైన రోమను సామ్రాజ్య రాజధానికి
తీసుకురావడానికి వీరిరువురు కట్టుబడి వున్నట్లు మనకు తెలుస్తుంది. గలిలయ నివాసి ఒక
సాధారణ జాలరి అయిన పునీత పేతురుడు రోము నగరానికి ప్రయాణించడం అనేది మనలను ఆశ్చర్యానికి గురి
చేస్తుంది. ఒక జాలరిగా తనకు తానుగా అంతటి దూరం ప్రయాణించడం అనేది కష్ట తరమైనది.
కానీ అతన్ని అక్కడికి పంపినది క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ అని మరచి పోకూడదు.
ఆయన అపొస్తలులందరికి అధిపతి. “పేత్ర”
అంటే బండ లేదా రాయి లేదా శిల అని అర్ధం. యేసు తన సంఘాన్ని ఆ శిలపై నిర్మించాడు. ఆయన రోము నగరంలో
మరణాన్ని స్వీకరించి, తన రక్తంతో ఆ సంఘ నేలను పోషించాడు. పునీత పౌలుడు ఒక యూదా
ధర్మ శాస్త్ర పండితుడు, తాత్వక న్యాయవాది మరియు దృఢనిశ్చయం కలిగిన పరిచారకుడు. ఆయన
సువార్తను ప్రకటించడానికి లేదా ఇతరులు చేసిన సువార్తా పరిచర్యను నిలబెట్టడానికి పరిచారక
స్థావరాలను సుస్థిరం చేసాడు. సువార్త కొరకు ఆయన నిరంతర హింసలు మరియు మరణ బాధలను
అనుభవించాడు (2 కొరింథీ 11:22-29). చివరికి ఆయన రోము నగర పౌరుడిగా శిరచ్ఛేదం చేయబడ్డాడు. రోము నగరాన్ని యేసు సంఘంగా తన
రక్తంతో ప్రోక్షించాడు.
ఈ “తిరుసభ మూల స్థంభాల” నుండి మనం
ఏమి నేర్చుకోగలము? బలిదాన తెగింపుకు నిశ్చలమైన నిర్ణయం తీసుకోవడం అనేది కేవలం
మన విశ్వాసం లేదా మానవ సామర్థ్యం నుండి రాదు. దేవుని కృపయే తన ప్రత్యక్షతను
వెల్లడిస్తుంది (మత్త 16:17). ప్రభు యేసును “తాను హింసించిన వ్యక్తిగా” సౌలుకు
జ్ఞానోదయ చేసింది ఆ కృపాకనికరమే. ఈ ఇద్దరి
విశ్వాస జీవిత సందర్భాల్లోని, తమ తమ విశ్వాస చర్యకు అవసరమైన మానవ
స్వేచ్ఛను పవిత్రాత్మ క్రియపైనే ఆధారపడి ఉంది. ఈ ఇద్దరు ప్రముఖ అపొస్తలులను ఈ ఒకే ఆరాధనలో
జరుపుకోవడం అనేది తిరుసభ తన స్ఫూర్తిదాయక నాయకత్వంను జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ పరి పాలన
నాయకత్వం అధికారిక, శాశ్వత, ఆదిపత్య, తిరుసభ
చట్టరీత్య నాయకత్వ లక్షణాలను
కలిగి యున్నది. అదే పూజ్య నాయకత్వం పాత మార్గాలను ప్రశ్నించి విశ్వాస మరియు లోక ప్రజల
జీవితాల్లోకి క్రీస్తును తీసుకురావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వున్న ఈ తిరుసభ మూల
స్థంభాలయిన పౌలు పేతురు వంటి పాత్రలు మరింతగా నేడు అవసరమని మాతృ శ్రీ సభ వారిని శ్లాఘిస్తూ మనకు
పాఠవం నేర్పుతుంది.
కార్డినల్స్‌ను ఉద్దేశించి పోపు
ఫ్రాన్సిసు తన మొదటి సమావేశంలో, “మనం నడవాలి, నిర్మించాలి మరియు ఒప్పుకోవాలి' అని వారిని ఉద్ఘాటించాడు. అంటే, మన తిరుసభను నిర్మించడం ద్వారా
మరియు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం ద్వారా మన జీవన విధానంలో ముందుకు సాగాలి. పోపు గారు ఇలా హెచ్చరించాడు: “మనం ఎంతగా
కావాలంటే అంతగా నడవవచ్చు, మనం చాలా సంస్థలను నిర్మించవచ్చు, కానీ మనం యేసుక్రీస్తును
ప్రకటించకపోతే, సంస్థలు సందర్భాలు తప్పు అవుతాయి. మనం ఒక NGOగానూ లేదా సంస్థకు CEOగానూ మారవచ్చు, కానీ తిరుసభలో ప్రభువు వధువుగా మాత్రం మారలేము.”
ఈ బోధన నేటి కథోలిక విశ్వాస జీవితానికి హెచ్చరిక!! విషపూరిత పరిస్థితుల్లో దేవుని
ప్రేమకు నమ్మకమైన సాక్షులుగా ఎలా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. నేటి మన అపోస్థలలును
గౌరవించి వారి ప్రార్ధానా సహాయాన్ని కోరుకోవడంలో ఉత్తమ మార్గం ఏమిటంటే, వారు బోధించిన విశ్వాసాన్ని
విలువైనదిగా భావించడం మరియు దానిని మనకు సాధ్యమైనంత ఉత్తమంగా ఇతరులకు అందించడం.
“మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో, అవి వారికి క్షమించబడతాయి; మీరు ఎవరి పాపాలను నిలుపుకుంటారో, అవి నిలుపబడతాయి.”
No comments:
Post a Comment