ఆది 14:18-20; 1 కొరింథీ 11:23-26; లూకా 9:11-17 (12 /C)
"మన ప్రభువు ఈ సంస్కారమును కడరాత్రి భోజనంలో స్థాపించాడు" (పునీత థామసు అక్వినాసు)
ఈ రోజు యేసు క్రీస్తు పరమ పవిత్ర
శరీరరక్తముల అద్భుతమును మాతృ శ్రీసభతో కొనియాడుతున్నాము. ఒకప్పుడు, ఈ రోజును “కార్పస్ క్రిస్తి” అని పిలిచేవారు. ఇది లతీను భాష
మాట. దిని అర్ధం "క్రీస్తు శరీరం". బెల్జియం దేశంలో లీజు అను గ్రామానికి చెందిన ఒక నోర్బర్టైన్
మఠకన్యకకు కలిగిన భక్తిని ప్రస్పుటం చేస్తుంది ఈ పండుగ. ఆమె ధన్య జూలియాన గారు.
ఈ పండుగ ఆమెకు రుణపడి ఉంది. ఆమె 1230 వ సంవత్సరములో తొలిసారిగా దివ్య సత్ప్రసాద ఆరాధనా భక్తిని ప్రారంభించింది. ఆమె
పట్టుదల ద్వారా 1264 వ సంవత్సరములో పోపు అర్బన్ 4, కథోలిక సమాజమంతా ఈ
భక్తిని పాటించాలని ఆదేశించాడు. ఈ సత్ప్రసాదవిందు మన విశ్వాసం గురించి మూడు
కీలకమైన ఒప్పుదలలను సంగ్రహిస్తుంది. మొదటిగా, దేవుడు నిజమైన దేవుడు మరియు
నిజమైన మనిషి. అయిన క్రీస్తు వ్యక్తిలో భౌతికంగా ఉన్నాడు (1 కొరింథీ 11:27). రెండవదిగా, దేవుడు క్రీస్తు ఆధ్యాత్మిక శరీరమైన తన జనుల సంఘంలో భాగమై అంత్య
కాలం వరకు ఉంటాడు (మత్త 18:20).
మూడవదిగా, రొట్టె ద్రాక్షారస రూపంలో దేవుని సాన్నిథ్యం మనకొరకు బలిపీఠంపై సమర్పింపబడే దివ్య బలిపూజ ద్వారా
మనందరికీ అందుబాటులో వున్నాడు.
భూమిపై తన పరిచర్య దినములలో, యేసు ఇలా అన్నాడు, “నేనే పరలోకం నుండి దిగి వచ్చిన
జీవపు ఆహారమును. ఈ ఆహారమును భుజించువాడు శాశ్వతంగా జీవిస్తాడు. మరియు లోక జీవం కోసం నేను ఇచ్చే ఆహారం నా మాంసం” (యోహాను 6:51). ప్రతీ దివ్య సత్ప్రసాద/ పూజ వేడుకలో రొట్టె క్రీస్తు శరీరంగానూ, ద్రాక్షారసం క్రీస్తు
రక్తంగానూ మారుతుంది. దీనిని “ట్రాన్స్-సబ్-స్టాన్సీ-ఏయేషన్” అనే వేదాంత మరియు సిద్ధాంతపరమైన పదంగా ఇంగ్లిష్
భాషన పిలుస్తారు. బలి పూజలో ఒక అభిషిక్త గరువు పరిశుద్ధాత్మదేవుని ప్రార్ధించడం
ద్వారా ఈ పవిత్ర క్రియ జరుగుతుంది. రంగు రుచి కొలత మరియు రూపము మార్పుచెందకున్ననూ
వానియందు ఇమిడియున్న స్వభావము మాత్రము రూపాంతరం చెందుతుంది. ఇది విశ్వాస రహస్యం. ఇలా
చాలా ప్రదేశాలలో జరగిన అద్భుతములను – డి ఎన్ ఏ
పరీక్షల ద్వారా అవి నిజంగానే యేసు రక్తమాంసములని వాటికను నిరూపించింది.
ఇటలీలోని లాంచి యానోలో జరిగిన అద్భుతం సమయం (730-750) నుండి భారతదేశంలోని కేరళలో జరిగిన
నేటి అద్భుతం వరకు (2013), సత్ప్రసాద స్వరూపుడు యేసు ప్రతిరోజూ తన భక్తులను కలుస్తున్నాడు. మాతృ తిరుసభ జరుపుకొనే ప్రతీ పూజా/
దివ్య సత్ప్రసాద ఆరాధనలలో యేసు లోక సంరక్షణ కొరకు ఒక ప్రత్యేక అర్పణగా తండ్రిదేవునకు తనను తాను సమర్పించుకుంటున్నాడు.
ప్రతీ దివ్య పూజలో మనము దివ్య
సత్ప్రసాదమును స్వీకరించే ముందు, గురువు పవిత్ర అతిధేయుడిని (అప్పమును)ఎత్తి పట్టుకొని, “ఇదిగో దేవుని గొర్రెపిల్ల! ఇదిగో
లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన
వారు ధన్యులు" (యోహాను 1: 29) అని చెబుతూ విశ్వాస ప్రకటన చేయమని మనల్ని ఆహ్వానిస్తాడు.
అపుడు మనం, "ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను అర్హుడిని కాదు, కానీ మీరు ఒక్క మాట మాత్రమే చెప్పండి, అప్పుడు నా ఆత్మ స్వస్థత పొందుతుంది" అని అంటాము. గురువు
“ఇది దేవుని గొర్రెపిల్ల చిహ్నం” అని చెప్పడు. కానీ “ఇది దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు.
ఈ దేవుని గొర్రెపిల్ల మన భారాలను మరియు బాధలను భరిస్తుంది, మన ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా సాన్నిద్గ్యం చేసుకొని ఉంటుంది.
కార్మెలు పర్వతంపై బాలు
ప్రవక్తలతో జరిగిన నాటకీయ ఘర్షణ తర్వాత, యేలియా ప్రవక్త శారీరకంగానూ, భావోద్వేగపరంగానూ, మరియు ఆధ్యాత్మికంగానూ అలసిపోయాడు. భయం మరియు నిరాశతో అతను అరణ్యంలోకి
పారిపోయాడు. చచ్చిపోదామనుకున్నాడు. ఈ దుర్బల స్థితిలో, దేవుడు యేలియాను తిట్టడు. తక్షణ చర్య కొరకు సంసిద్దకామన్నాడు. అందుకు ఆయన అతనికి రెండుసార్లు స్వర్గపు
రొట్టె మరియు నీటితో తృప్తి పరచి, ఆపై సున్నితంగా, "నువ్వు తినకపోతే ప్రయాణం నీకు
చాలా కష్టం" అని చెబుతాడు (1 రాజులు 19:7). నీవు యేలీయా వలే అలసిపోయావా? ముందున్న మార్గం చాలా భారం గానూ, కష్ట
తరంగానూ ఉందని నీవు భావిస్తున్నావా? అప్పుడు ఆగి, దేవుడు చెప్పేది వినుము: "తినండి. త్రాగండి. విశ్రాంతి
తీసుకోండి. నేను నిన్ను ఆదుకుంటాను."
“మరే ఇతర సంస్కారమునకు ఇంతకంటే గొప్ప స్వస్థత శక్తి
లేదు" (పునీత థామసు అక్వినాసు)
No comments:
Post a Comment