AletheiAnveshana: September 2025

Friday, 5 September 2025

శిష్యరికానికి అయ్యే ఖర్చు జ్ఞాన 9:13-18b; ఫిలే 9-10, 12-17; లూకా 14:25-33 (24/C)

 

శిష్యరికానికి అయ్యే ఖర్చు

జ్ఞాన 9:13-18b; ఫిలే 9-10, 12-17; లూకా 14:25-33 (24/C)

నేడు, కన్య మరియ దావీదు  వంశం నుండి జన్మించింది(DO)

 

క్రీస్తు శిష్యులు అంటే ఆధ్యాత్మిక సైనికులులా ఉండడానికి పిలువబడినారని అర్ధం. అందుకు దానిలో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన ఇబ్బందులను (లూకా 14:31, 32) పరిగణనలోకి తీసుకోవాలని కోరుతుంది. అంకితభావంతో కూడిన జీవితంలో ప్రతి క్రీస్తు అనుచరుడు విశ్వాసపు పోటీలో పోరాడటానికి మరియు దానిని నిర్మించ దలచిన ఖరీదైన విశ్వాసపు గోపురాన్ని లేదా ఒక తటస్థ యుద్ధాన్నే కలిగి ఉంటాడు. అలాగునే సువార్తను వ్యాప్తి చేసే రంగంలోనూ, దానికి అవసరమయ్యే గణాంకాలు, అంచనాలు చాలానే అవసరం. ఈ కాలంలో మనం ఒక పెద్ద సామాజిక-సాంస్కృతిక మార్పులోనూ, కృత్రిమ మేథా సంస్కృతిలో జీవిస్తున్నాము. ప్రపంచంలోని ఈ కొత్త దశలో పెనవేసుకుపోయిన విశ్వాసాన్ని బాగా తెలుసుకోకుండా, దాని అంతర్గికతను అర్థం చేసుకోకుండా మనం విశ్వాసాన్ని ఏమాత్రం వ్యాప్తి చేయలేము. మన ప్రస్తుత కాలపు ఆలోచనా విధానాన్ని, భావాలను మరియు వాటి భాషా విధానాలను మనం తృణీకరించినా లేదా వాటిని విస్మరించినా మనం సువార్తకు ఎలాంటి ప్రాప్యతను అందించలేము కదా? అలాగని మారుతున్న వివిధ సామాజిక విలువల భాషను జతపరచి దేవుని ప్రణాళికతో నడవకుండా నేటి సవాళ్లకు మనం ప్రతిస్పందించలేమా! “వాక్కు శరీరమును దాల్చి” నట్లు (యోహా 1:14) నానాడు మార్పుచెందే నేటి సంస్కృతులలో వేదము శరీరాన్ని దాల్చుకోవాలా?

అబ్రాము తన స్వంత దేశాన్ని వీడి అబ్రహాముగా తెలియని దూరాలకు బయలుదేరాడు. మోషే దేవుణ్ణి సేవించడానికి ఫరో ఆస్థానాన్ని విడిచిపెట్టాడు. పౌలు తన సంపద మరియు ధర్మశాస్త్ర వృత్తిని విడిచిపెట్టి “వాక్కు” వ్యాప్తి కోసం బయలుదేరాడు. అపొస్తలులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు దానిని బాహాటం చేయడానికి బయలుదేరారు. వారు తమ ప్రేరేపితుని కోసం తప్ప లోక ప్రమాణాలను  ఎప్పుడూ లెక్కించలేదు. కానీ ఆ జాడ తప్పనిసరి! యోబు విచారణలో, యోబు తన ప్రాణాన్ని కోల్పోకుండా తనకున్నదంతా వదులుకుంటాడని సాతాను ఊహించాడు (యోబు 2:4). పిల్లలు మరియు ఆస్తిని కోల్పోయినప్పుడు దేవుణ్ణి శపించని పితృస్వామ్యుడు కనీసం దేవుడు తన ఎముకను లేదా శరీరాన్ని తాకితే విచ్ఛిన్నమవుతాడని సాతాను ఊహించాడు. కానీ యోబు చాలా ఆధ్యాత్మికంగా ఆలోచించాడు. లోక తీరుకు భిన్నంగా ఆలోచించాడు. చంపబడినా సరే దేవుణ్ణి విశ్వసించడానికి వెనుకాడలేదు (యోబు 13:15).

అవిలాపురికి చెందిన థెరెసా తన జీవితమంతా శారీరక వ్యధతో బాధపడింది. తన కష్టాల వల్ల తాను ఎప్పుడూ బయటపడలేదు. తన  ఆధ్యాత్మిక సన్నిహిత సహచరుడు జాన్ అఫ్ ది క్రాస్, కార్మెలైట్ ఆర్డర్ నుండి లేచిన తిరుగుబాటుదారుడిగా జైలు పాలయ్యాడని మరియు శిక్షింపబడ్డాడని విన్నప్పుడు, ఆమె తనకు ఇలా వ్రాసింది, "దేవుడు తన స్నేహితులతో వ్యవహరించడానికి భయంకరమైన మార్గాన్ని కలిగి ఉన్నాడు మరియు వాస్తవానికి అతను వారికి ఎటువంటి తప్పు చేయడు. ఎందుకంటే అతను తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా అదేవిధంగా వ్యవహరించాడు." ఆటువంటప్పుడు, సర్వ పవిత్ర దేవుని కుమారుడైన క్రీస్తు – బాధ మరియు మరణానికి లోనైతే,  అతని సేవకులమైన మనం, మన గురువు నుండి భిన్నంగా వ్యవహరింపబడతామని ఆశించగలమా? భారతీయ జెస్యూట్ అయిన ఫాదర్ స్టాన్ స్వామి,  ఉత్తర భారత అటవి తెగలకు సామాజిక న్యాయం తీసుకురావడానికి కృషి చేసి పోరాడినందుకు బెయిలు రాకముందే కోవిడ్-19లో మరణించాడు. ఇందు నిమిత్తమే, "తన సిలువను మోసుకెళ్ళని మరియు నా తర్వాత రాని ఎవరైనా నా శిష్యుడు కాలేరని యేసు చాలా స్పష్టంగా పేర్కొన్నాడు." జీవితంలోని ప్రతి రంగంలో, ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ్యపు విలువ ఖర్చును లెక్కించమని మాతృశ్రీసభ మనలను ఆహ్వానిస్తుంది. బాప్తిస్మము, వివాహం, మఠవాస్యత మరియు ఆర్డినేషన్ వంటి దివ్య సంస్కారములను తేలికగా లేదా అనాలోచితంగా లెక్కించకూడదు. ఈ సంస్కారాల స్వికరణను ఆలోచనాత్మకంగా, భక్తితో మరియు దేవుని భయంతో పరిగణించాలి.

దేవుడు తన పిల్లలు బాధపడటం చూసి అపవిత్రంగా ఆనందించేవానిగా మనం ఊహించకూడదు. ఆదికాండము 1:31 లోని సృష్టి కథనం చివరలో, "దేవుడు తాను చేసినదంతా చూశాడు మరియు అది నిజంగా (తన) కంటికి ఇంపుగా ఉన్నది" అని మనకు చెపుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశ్యానికి ఉపయోగపడేంత వరకు ప్రతిదీ మంచిదే అని మనం చెప్పగలం. యేసు తన కోసమే బాధను కోరుకున్నాడని సువార్తలు ఎక్కడా సూచించలేదు. గెత్సేమనేలో, "తండ్రీ, సాధ్యమైతే, ఈ పాత్రను నా నుండి తొలగిపోనివ్వండి" (మత్త 26:39) అని ఆయన ప్రార్థన చేశాడు. ఇటువంటి యేసు ఉదాహరణ, అలాగే ఆతని పాపరహిత తల్లి మరియ ఉదాహరణ నీతిమంతులు, సద్గుణవంతులు తమ తమ బాధలను మరియు ప్రపంచంలోని పాప ప్రభావాలను నివారించడం అనేది అసాధ్యమని మనకు చూపిస్తుంది. పౌలు తన బాధలను నివృత్తి  చేయమని దేవుడిని వేడుకున్నప్పుడు, అతనికి లభించిన సమాధానం, "నా కృప నీకు చాలును" ​​(2 కొరింథీ 12:9). అందుకే పౌలు, “మీ కొరకు నేను సంతోషముగా బాధపడుచు, నా శరీరమందు క్రీస్తు ఇంకా అనుభవించవలసినదంతయు తన శరీరమైన సంఘము కొరకు తీర్చుకొనుటకు నేను చేయగలిగినదంతయు చేయుచున్నాను” (కొలొ 1:24) అని వ్రాశాడు. కాబట్టి మన సమస్తము ఆతని మహిమ కొరకే!

వెలుగు రాకముందు చీకటి వచ్చును మరియు కృప చట్టబద్ధతను స్వేచ్ఛకు బదులుగా మారుస్తుంది” ( St Andrew of Crete)

 

 

The Cost of Discipleship Wis 9:13-18b; Phile 9-10, 12-17Lk 14:25-33 (24/ C)

 

The Cost of Discipleship

Wis 9:13-18b; Phile 9-10, 12-17Lk 14:25-33 (24/ C)

Today, the Virgin Mary was born of the race of David (DO)

 

The disciples of Christ are called to be like soldiers who go to war, must consider the hazards of it, and the difficulties that are to be encountered (Lk 14:31, 32). Each follower would have a costly tower to build in the devoted life and a war to wage in the contest for the faith. Even in the field of spreading the Gospel, it calls for calculation and estimation. In our times, we are living through a major socio-cultural change. We cannot spread faith in this new phase of our world without knowing it well and understanding it from within. What access to the Gospel can we offer if we despise or ignore the thinking, feelings, and language of our own times? We cannot respond to today’s challenges without walking with the divine plan of God.

 

Abraham departed from his own country. Moses departed Pharaoh’s court to serve God. Paul departed from his wealth and profession of Law. Apostles departed to different parts of the world to proclaim him. They never calculated the measures of the world except for their motivator. But the trail is inevitable. Satan, in the trial of Job, imagined that Job would give up all that he had rather than lose his life (Job 2:4). He fancied that the patriarch, who would not curse God under the loss of children and property, would break down if God touched his bone or his flesh. But Job was so spiritually minded as to be ready to trust God, even should he be slain (Job 13:15).

Teresa of Avila suffered all her days, never allowing herself to be overcome by her troubles. When she heard that her close associate, John of the Cross, was imprisoned and being punished as a renegade from the Carmelite Order, she wrote, “God has a terrible way of treating his friends, and in truth he does them no wrong, since that was the way he treated his own Son, Jesus Christ.” If Christ, then, the all-holy Son of God, submitted to suffering and death, then we, his servants, cannot expect to be treated any differently from our Master. Fr. Stan Swamy, an Indian Jesuit, struggled and died in prison for working towards bringing social justice to the Northern tribes. And thus, he states quite categorically. “Anyone who does not carry his cross and come after me, cannot be my disciple.” In every sphere of life, a Christian is called upon to count the cost. The sacraments like Baptism, Marriage, and Ordination are not to be entered upon lightly or unadvisedly, but thoughtfully, reverently, and in the fear of God.

We should not picture God as being one who takes an unholy delight in seeing his children suffer. At the end of the creation story in Genesis 1:31, we are told, “God saw all he had made and indeed it was good.” We can therefore say that everything is good insofar as it serves God’s purpose. Nowhere do the gospels suggest that Jesus wanted suffering for its own sake. His prayer in Gethsemane was, “Father, if it be possible, let this chalice pass from me” (Mt 26:39). But the example of Jesus, as well as that of his sinless mother, shows us that it is impossible, even for just and virtuous people, to avoid suffering and the effects of sin in the world. When Paul begged God to cure him of his ailments the answer he got was, “My grace is all you need.” (2 Cor 12:9). Later he would write: “I gladly suffer for you, and in my body do what I can to make up all that has still to be undergone by Christ for the sake of his body, the Church” (Col 1:24).

“Darkness yields before the coming of the light, and grace exchanges legalism for freedom” (St Andrew of Crete)