నీడ నిచ్చు
పచ్చని ఆకుల నీతి సంపద
ఆమో 8:4-7;
1 తిమోతి 2:1-8; లూకా 16:1-13 (25/ సి)
“క్రైస్తవులు
నిత్యజీవం వైపు దూర దృష్టితో లౌకిక జీవిత వ్యవహారాలను నిర్వహించాలి.”
నేటి
సువార్తలోని గృహనిర్వాహకుడికి ధనవంతునితో కలిగి ఉన్న సంబంధం దేవునితో మన
సంబంధానికి అన్వయించాలని మాతృ శ్రీసభ కోరుతుంది. దేవుడు మనకు అప్పగించిన ప్రతిభలను
ఉపయోగించడంలో ఈ సంబధం అద్దం పడుతుంది. ఈ సంబంధాన్ని సూచించడానికే “గృహనిర్వాహకుడు”
అనే పదం ఇక్కడ వర్తించబడింది. మనలో ప్రతి ఒక్కరికి దేవుని ఆస్తిపై బాధ్యత ఉంది. అది
మన మానవ శారీరక, మానసిక, నైతికత అనేది భౌతికంగా
నిర్మాణం చేయబడిన ఒక ట్రస్ట్ లాంటిది. ప్రతిభ, డబ్బు,
సంబంధాలు, సామాజిక గౌరవ స్థానాలు
అనే మన ధనాలు రైతులకు కలిగిన పొలపు ఆస్తులు లాంటివి. రైతు తన పొలాన్ని ఎలా సాగు
చేస్తాడో అలాగునే మనం మన మానవాకృత ఆస్తులను సరైన పద్దతిలో సరిదిద్దుకోవాలి. మన
ఇష్టం వచ్చినట్లు మనం వాటిని ఉపయోగించుకోవచ్చు అనుకుంటే, అది మనలను సృష్టించిన
సృష్టికర్తను వమ్ము చేసినట్లవుతుంది మరియు మనలను మనమే వంచన చేసుకున్నట్లవుతుంది.
వాటిని సరైన మార్గంలో పరిపాలించడానికి దేవుడు మనకు ఆధిపత్య శక్తిని ఇచ్చాడు
(కీర్తన 8:4). మనం
దీనిని గ్రహిస్తున్నామా లేక విచారకరంగా “గృహనిర్వాహకత్వ” వాస్తవికతను మరచిపోతున్నామా? మనం అనేక విధాలుగా కొన్ని
కొన్ని సార్లు కౌలుదారుననుని యజమానునిగానూ, గృహనిర్వాహకుడిని యజమానిగానూ మార్చేస్తుం టాము కదా?
క్రైస్తవ
జీవితాన్ని నిర్వహించు కోవడం అంటే క్రైస్తవ విలువల జీవితపు నిర్వహణ అని అర్ధం. మనం
కఠినమైన, నిరుత్సాహపు
వ్యాపారం లేదా నిరాశా నిస్పృహలకు లోనైనపుడు, ప్రవక్త హగ్గయి ప్రవచనం, “కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ
ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. మీరు
విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను
దాహము తీరకయున్నది, బట్టలు
కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము
చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది” (హగ్గయి 1:5-6) అని ప్రతిబింబిస్తుంది.
పునీత అగుస్టీను , “మీకు పుష్కలంగా ఉన్నప్పటికీ, మీరు ఇంకా పేదవారే. మీరు తాత్కాలిక ఆస్తులలో సమృద్ధిగా
ఉంటారు, కానీ
మీకు శాశ్వతమైనవే అవసరం” (ప్రసంగం 56, 9) అని అంటున్నాడు. క్రైస్తవ విలువల లక్ష్య సాధన
విషయానికొస్తే, కార్పొరేటు
సంస్థల ప్రవర్తనలో “గృహనిర్వాహకుని” వివేకం ఎలా ఉండాలి? కొన్ని పరిమిత
ప్రాంతాలలో పోటీ దాని తత్త్వం ఆరోగ్యకరమైనదే! కాని దాని పిచ్చితనపు వ్యాప్తి
అనారోగ్యానికి మాత్రమే కాకుండా ఒక అపవాదపు స్థితికి కారణంగా మారవచ్చు.
14 వ పోపు
లియో గారు, ఇటీవల ఒక
కాథలిక్ న్యూస్ సైటుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సమాజంలోని ధ్రువణతకు లేదా అనివార్య అసమాన వ్యాప్తి కొంతవరకు
"కార్మిక వర్గపు ఆదాయ స్థాయిలు మరియు అత్యంత ధనవంతులు పొందే డబ్బు మధ్య
విస్తృత అంతరమే కారణo” అని అన్నారు. మన
గృహనిర్వాహకత్వo అనేది సాధించుకున్న లేదా
దేవునినుండి పొందుకున్న సంపదను కాపాడే లేదా పరిరక్షించే ఒక సాధనంగా ఉండాలి. సంపద అనేది “గృహనిర్వాహత్వ”
లక్ష్య సాధనకు మాత్రమె వినియోగించాలి. లోక విషయాలు లేదా అన్యాయపు సంపద తప్పుడు ఆస్తి.
మనం రెండింటికి సమానమైన సేవ చేయలేమని క్రీస్తు నొక్కి చెబుతున్నాడు (లూకా 16: 13). లోకం ఒకరి స్వంత
కోరికల విషయమై ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తుంటే, దేవుడు మనల్ని అవసరతలో ఉన్నవారి కోసం ఖర్చు చేయాలని
కోరుతున్నాడు. ఈ రెండింటి సేవలను సమన్వయం చేయడం అసాధ్యం. అటువంటప్పుడు ఒకదానికి
విశ్వాసంగా ఉండటం మరొకదానితో విడిపోవడమే సమంజసం. తన యజమాని వస్తువులతో
గృహనిర్వాహకుడు శాశ్వత జీవిత సుఖాన్ని వారసత్వంగా పొందడానికి తన యజమాని ఋణస్తులను
తన స్నేహితులుగా చేసుకున్నట్లు, అధర్మపు అన్యాయపు సంపదను మనకు మనమే తయారు చేసుకోవాల్సిన
అవసరం ఉందా?
లూకా – యేసు
ఉపమానాన్ని ఒక ప్రశ్నగా, మన జీవితాలను నడిపించే యజమాని ఎవరు అని ముగిస్తాడు. మన ఆలోచనా జీవితాన్ని నియంత్రించేవాడు, మన ఆదర్శాలను
రూపొందించేవాడు, హృదయ కోరికలను మరియు మనం జీవించడానికి ఎంచుకున్న విలువలను
నియంత్రించేవాడే మన “యజమాని”. మనం, రైతులుగా, క్రీస్తు ఆత్మ-ఆధారిత విలువలను సాగుచేసుకోవాలి మరియు “గృహనిర్వాహకు”లుగా, మన పునరుత్థానంలో ఆయన
తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలిసినప్పుడు వాటిని తిరిగి అప్పగించాలి. మన డబ్బు, సమయం, ఆస్తులు,
విలువైన వనరులు, అందునా మన ఆరోగ్యం, అనేది భౌతికంగా నిర్మితమైన శారీరక, మానసిక, నైతికత
దేవుని నుండి వచ్చిన బహుమతులు. “తమ భౌతిక సంపదలను నమ్ముకునేవారు పడిపోతారు, కానీ నీతిమంతులు నీడనిచ్చే
పచ్చని ఆకులాగా వృద్ధి చెందుతారు (సామె 11:28) అనే దేవుని
వాక్యం బట్టి మనం వాటిని మన కోసం మాత్రమే అసూయతో కాపాడుకోవచ్చా లేదా యేసు రాజ్యంలోని
పేదవారి ప్రయోజనం కోసం వాటిని వినియోగించ వచ్చా అని నిర్ధారించుకొందాము.
“చిన్న విషయాలలో
నమ్మదగిన వారిని గొప్ప విషయాలలో కూడా నమ్మవచ్చు.”
No comments:
Post a Comment