దేవుని రాజ్యంలో
ఆవగింజంత శక్తి
హబక్కూకు 1:2-3; 2:2-4; 2 తిమోతి 1:6-8,13-14; లూకా 17:5-10
(27 /C)
ప్రభువు తన మాటలన్నిటిలో నమ్మకమైనవాడు మరియు తన
క్రియలన్నిటిలో ప్రేమగలవాడు. అల్లెలూయా.
ఈరోజు
మొదటి పఠనం ప్రవక్త హబక్కూకు గ్రంథం నుండి చదువుకున్నాము. హబక్కూకు ప్రభువుకు
దాదాపు 650 సంవత్సరాల
ముందు జీవించాడు. అది ఒక భయంకర హింస కాలం. బాబిలోనియన్లు అస్సీరియన్లను జయించారు
మరియు యూదా రాజ్యంతో సహా మిగిలిన ప్రపంచాన్ని బెదిరించి దాడి చేశారు. యూదులు
నిరంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. ద్వేషం మరియు హింసను జీవితంలో ఒక భాగంగా
చూశారు. దానిని అంగీకరించారు కూడా. హబక్కూకు సమాజం మన నేటి సమాజం కంటే
పెద్ద భిన్నంగా లేదు. ఇక్కడ
హింస మరియు శక్తి అనేవి శ్లాఘింపబడి బలహీనులను అణగ ద్రోక్కాయి. అందుకే అతని సమాజం, “ఓ ప్రభూ, ఎంతకాలం? నేను సహాయం కోసం అంగలారుస్తున్నాను, కానీ నువ్వు వినవు!
నేను నీకు మొరపెట్టుకుoటున్నాను.
“హింస!”
కానీ నీవు జోక్యం చేసుకోవు..." అని ప్రార్దించారు.
నేటి
సువార్త పఠనం అపొస్తలుల విన్నపం - “ప్రభువా, మా విశ్వాసాన్ని పెంచుము!” మరియు ఆవగింజ గురించి యేసు
ఇచ్చిన అద్భుతమైన సమాధానంతో ప్రారంభమవుతుంది. ఈ విన్నపం మన అంతర్గత జీవితాన్ని
మాత్రమే కాకుండా, న్యాయం, సంఘీభావం మరియు ప్రేమ
ద్వారా సమాజంలో మనం ఎలా విశ్వాసాన్ని జీవిస్తున్నామో కూడా మాట్లాడుతుంది. విశ్వాసం
అనేది పరిమాణంలో కాదు,
జీవన శక్తి
శైలిలో కొలవబడుతుంది. ఆవగింజ లాంటి కొంచెం విశ్వాసం, నిజాయితీగా జీవిస్తే జీవితాలను మార్చగలదు. ఆధ్యాత్మికంగా, మనం ప్రతిరోజూ
అపొస్తలుల వలె “మా విశ్వాసాన్ని పెంచుము!” అని ప్రార్థించమని ఆహ్వానించబడ్డాము.
అది మనకోసం అద్భుతాలు చేయడానికి కాదు. కానీ క్షమించడంలో, ప్రేమించడంలో మరియు పట్టుదల
కలిగిన ఆశలో ఉండటంలో నమ్మకంగా ఉండటానికి మాత్రమె. విశ్వాసం అనేది దేవుని బహుమతి
మరియు మన ప్రతిస్పందన కలబోసుకొనిన రెండు ప్రతిమలు. ప్రతి వ్యక్తిని దేవుని
స్వరూపంలో సృష్టింపబడినట్లు చూడమని విశ్వాసం మనల్ని పిలుస్తుంది. మన సేవ కేవలం
విధి కాదు, ఇతరులలో
క్రీస్తును గుర్తించడం (మత్త 25:40).
విశ్వాసం
పర్వతాలను కదిలించగలిగినట్లే,
ఇతరుల
బాధలలో వారి సహవాసంలోకి మనల్ని కదిలించాలి (CCC 2448). అదే ప్రవక్త ఆమోసుని ప్రవచనం (ఆమో 7).
"ఆవాలు గింజ" ఉపమానం
కూడా విశ్వాసం సేంద్రీయమైనదని,
సృష్టిలాగే
- నాటబడినది, పోషించబడినది
మరియు పెరుగుతున్నది అని మనకు గుర్తు చేస్తుంది. మనకు అప్పగింపబడిన జీవాధారిత భూమిని
జాగ్రత్తగా పరిరక్షించువడానికి మన విశ్వాసం మనలను నిర్బంధింస్తుంది. ఫ్రాన్సిసు
పోపు గారు తన "లౌదాతో మీ సిన్యోరే"
(“స్తుతింతును నిన్నే నా దేవా”) అనే తన ఉద్భోదనలో దేవుని సృష్టిని మనమే పరిరక్షించు
కోవాలని ప్రపంచానికి పిలుపు నిచ్చాడు. సేవకుడి ఉపమానం “విశ్వ జనుల కాంతి” (లూమెన్
జెంత్సియుం – నెం 31) లో ప్రతి
క్రైస్తవుడు - మతాధికారులు,
మతపరమైనవారు
మరియు సామాన్యులు - ప్రతిఫలాన్ని కోరుకోకుండా, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా వినయపూర్వకమైన సేవ ద్వారా
ప్రపంచాన్ని పవిత్రం చేయాలని పిలుపు నిచ్చింది మాతృ శ్రీసభ ఉల్లేఖనం. పునీత అగుస్తీను
విశ్వాసాన్ని దాతృత్వానికి పునాదిగా చూశాడు. ఎందుకంటే విశ్వాసం
లేకుండా ప్రేమ వృద్ధి చెందదు కాబట్టి. విశ్వాసం పూర్తిగా మేధోపరమైనది కాదు లేదా
పూర్తిగా భావోద్వేగ వైఖరి కాదు. దాని మేధోపరమైన వైపు నుండి, మనం నిజమని
నిర్ధారించే దానిని మాత్రమె ప్రకటిస్తుంది. ఇది మన:/స్పర్శ భావాలకు ప్రతిస్పందించే
విషయం. ఇవి దేవునికి మనల్ని మనం ఇచ్చుకోవడానికి మనల్ని ప్రేరేపించే ఆత్మ బహుమతి.
మనం మనకోసం మాత్రమే అనే భ్రమను వదిలేస్తే, అది మనకు అంతర్గత ఆధ్యాత్మిక వృద్ధి మార్గాన్ని తెస్తుంది. ఆ
విశ్వాసం మనలో లోతైన అవగాహనను తాకుతుంది. దేవుని
సన్నిధి మనకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు సహాయపడుతుంది. అది మన జీవితాంతం వరకు
మనతోనే ఉన్నప్పటికీ మన బాల్య విశ్వాసం మనల్ని యుక్తవయస్సులో నిలబెట్టలేదు. ఇది
నిరంతర అధ్యాత్మక శిక్షణా ప్రక్రియ. అబ్రహం జీవితంలో
ఉన్నట్లుగానే మనం పెరిగేకొద్దీ పెరుగుతుంది,
మారుతున్నకొద్దీ మారుతుంది,
పరిణతి చెందేకొద్దీ
మనం పరిణతి చెందుతుంది.
మన
ప్రపంచం సజీవమైన విశ్వాసం కోసం ఏడుస్తుంది. అర్ధం కాని మూలుగులతో మొరపెడుతుంది.
విశ్వాసం వ్యక్తిగత ప్రార్థనలో దాగి ఉండిపోదు. అది
శత్రువులను క్షమించడంలో చేతన కలిగి వుంటుంది. పేదలకు సేవ చేస్తుంది. సృష్టిని
రక్షిస్తుంది మరియు మానవ గౌరవాన్ని కాపాడుతుంది. అది ఒక దయగల చర్య అయినా, ఒక క్షమాపణ మాట అయినా, లేదా న్యాయం కోసం ఒక
నిర్ణయం వంటి చిన్న చిన్న ప్రారంభాలకు భయపడుతూ న్యూనతకు లోను కాకూడదు. ఆవగింజ వలే, ఈ చిన్న చిన్న క్రియలు
దేవుని రాజ్యానికి గొప్ప సంకేతాలుగా
పెరుగుతాయి. మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, మనం దేవునికి సహాయం చేయడం లేదని గుర్తుంచుకుందాం.
"మేము అనర్హమైన సేవకులం. మేము మా విధిని
మాత్రమే చేసాము" అని తెలిసిన శిష్యులుగా మనం మన క్రైస్తవ ధర్మాన్ని జీవించూదాము.
రాజకీయ, ఆర్థిక
కుటుంబం, వృత్తిపరమైన
మరియు సామాజిక జీవితమoతా ఈ స్ఫూర్తితో నిండి ఉండాలి. "మీరు దేవునికి ఉపయోగకరంగా
ఉండాలనుకుంటే, సేవ
చేయండి" అని పునీత జోస్ మరియ ఎస్క్రివా నొక్కిచెప్పారు. "ఉపయోగకరంగా
ఉండటం" అంటే మానవ గౌరవ పొగడ్తలు, కోరుకోకుండా ఉదారమైన సేవ జీవితాన్ని గడపాలని
ఆయన కోరుకున్నాడు. ప్రపంచానికి సేవ చేసే మరియు మార్పు తెచ్చే మన వినయపూర్వక
విశ్వాసాన్ని ప్రభువు పెంచుగాక! అప్పుడు మన హృదయాలలో నాటిన ఆవగింజ కుటుంబాలలో, సమాజంలో మరియు
సృష్టిలోనే ఫలాలను ఇస్తుంది.
“ప్రభూ, నీవు ఎప్పటికీ
స్తుతించబడాలి. స్తుతించబడాలి. అల్లెలూయ”.