నా అపవాదిని
గద్దించువాడవు నీవే
నిర్గమ 17:8-13; తిమోతి 3:14-4:2; లూకా 18:1-8 (29/C)
“నా ప్రాణము నీకై
దాహము గొని యున్నది,
నా
దేహము నీకొరకు ఆరాటపడుచున్నది”
(కీర్త 62)
నేటి ప్రార్ధనా విధానం – ప్రార్థనలో చలించని పట్టుదలను పరిగణించమని మనల్ని ఆహ్వానిస్తుంది. సువార్తలో, "ఎల్లప్పుడూ అలసిపోకుండా ప్రార్థించవలసిన" అవసరాన్ని యేసు మనకు గుర్తు చేస్తున్నాడు (లూకా 18:1). పాత నిబంధన కాలంలోని పేద విధవరాండ్రకు చాలా మంది విరోధులు వుండేవారు. వారు తమ బలహీనమైన నిస్సహాయ స్థితిని అనాగరికంగా ఉపయోగించుకుని వారి హక్కులపై దాడి చేసి, వారికి ఉన్న కొద్దిపాటిని కాచేసేవారు (యిర్మీ 21:3; యెష 1:17). లూకా నేడు ప్రస్తావించే విధవరాలు ఒక అపరిచితురాలు మరియు తాను ఒంటరిగా అన్యాయమైన న్యాయమూర్తి వద్దకు వచ్చింది. ఆమెకు తన పక్షాన నిలబడటానికి ఏ స్నేహితులు లేదా ఏ న్యాయవాది లేరు. న్యాయమూర్తి స్పష్టంగా యూదు న్యాయమూర్తి మాత్రము కాదు. అతను హేరోదు లేదా రోమన్లు నియమించిన జీతం పొందే న్యాయమూర్తులలో ఒకడు. అలాంటి న్యాయమూర్తులు అపఖ్యాతి పాలయ్యారు. ఒక బాధితుడు పలుకుబడి ప్రభావం లేదా డబ్బు ఉంటే తప్ప, తీర్పు వచ్చేది కాదు. లంచం ఇస్తేనే తప్ప తమ కేసు పరిష్కరించబడుతుందనే ఆశ వారికి ఉండేది కాదు. ఇటువంటి న్యాయమూర్తులను(DayyanehGezeroth) దోపిడీ న్యాయమూర్తులుగా పిలిచేవారు.
ఇటువంటి నేపద్యంలో దేవుడు ప్రార్థనలు
వింటాడనీ వాటికి సమాధానం ఇస్తాడనీ నమ్మకంగా,
దేవునితోనే సంబంధం
కలిగి, పట్టుదలగల విధవరాలిలా ఉండాలని యేసు
కోరుకుంటున్నాడు. యేసు తన క్రియలతోనూ, తన సజీవ
వాక్కుతో బోధిస్తున్నాడు. హృదయం నుండి మాట్లాడటం అంటే హృదయంతో మాట్లాడడం. దేవుడు మానవ హృదయాన్ని చదువు
తున్నాడు (కీర్త 44:21). ప్రార్ధనలో నేను
ఉపయోగించే పదాలకన్నా నన్ను బాగా తెలుసుకొని నాతో మాట్లాడే వాడు నా దేవుడు (2
దినవృత్త
18:13). తదుపరి
నిమిషం, గంట, వారం, నెల లేదా సంవత్సరంలో మనకు ఏమి
జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు మాత్రమే మన సమయాన్ని పూర్తిగా చూడగలడు. కాబట్టి దీర్ఘకాలంలో
మనకు ఏది మంచిదో అతనికి మాత్రమే తెలుసు (యిర్మీ 29:11). అందుకే
మనం ప్రార్థనలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని యేసు చెప్తున్నాడు.
అహరోను, హోరుల సహాయంతో, మోషే
కొండపై చేస్తున్న ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలపై దాడి చేస్తున్న
సైన్యాలను యెహోషువ ఓడించగలిగాడు. అమలేకీయులను ఓడించినది నిజంగా దేవుడే! యెహోషువ
కాదు. మన శత్రువులను ఓడించేది నిజంగా దేవుడే! మనం కాదు కదా (నిర్గమ 14:14)! ప్రతీకారం మనది కాదు, ఆయనదే (ద్వితీ 32:35). మనం నమ్మకంగా ప్రార్థిస్తూ మంచి పోరాటం
చేయడమే మన వంతు కృషిని మనం చేయాలి. ప్రార్ధనలో మనం బల హినులమైనపుడు మన క్రైస్తవ
సమాజం తన ప్రార్థనలో మన చేతులను పైకెత్తి ప్రార్ధిస్తూ సహాయం చేస్తోంది. మన దేవుని
ప్రేమ మరియు శ్రద్ధ మనతో ఉంటే,
మనకు వ్యతిరేకంగా
ఎవరు ఉండగలరు? (రోమా 8:31). నేటి మన సువార్త
విధవరాలు మన
సమాజంలోని పేదలు మరియు రక్షణ లేని వారందరికీ చిహ్నంగా వుంది. పట్టుదల అనే ఆయుధం
ద్వారా తప్ప న్యాయమూర్తి నుండి తన న్యాయం పొందలేనన్న ఆశ తనలో లేదని ఆమెకు తెలుసు.
ఇది సుస్పష్టం.
ఈ ఉపమానం రొట్టె కొరకు అర్ధరాత్రి
స్నేహితుడి తలుపు తట్టిన ఉపమానం లాంటిది (లూకా 11 :5-13). ఇది అలాంటి వ్యక్తులతో భగవంతునుని
విభేదిస్తుంది. అందుకే,
“విసిగి
పోయిన
న్యాయమూర్తి చివరికి ఒక విధవరాలికి న్యాయం చేయడంలో నిర్ణయం తీసుకొనగలిగితే, ప్రేమగల తండ్రి అయిన దేవుడు తన పిల్లలకు
అవసరమైన దానిని ఎంత ఎక్కువగా ఇవ్వ గలడు?” అని
యేసు అంటున్నాడు. మన
ప్రార్ధనకు యేసు ప్రార్థన ఒక నమూనా. ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “నీ విశ్వాసం విఫలం
కాకూడదని నేను ప్రార్థించాను” (లూకా 22:32).
శిలువ వేయబడినప్పుడు,
‘తండ్రీ, వారిని క్షమించు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు”
(లూకా 23:34) అని ప్రార్ధంచాడు. మరియు ఆయన తన చివరి శ్వాసను
విడిచి నప్పుడు, “తండ్రీ, నీ
చేతుల్లో నా ఆత్మను అప్పగించుకుంటున్నాను” (లూకా 23:46) అని
ప్రార్ధంచాడు.
విశ్వాసం అనేది దేవుడు మనకు ఇచ్చే
బహుమతి. పునీత అగుస్టీను ప్రార్థించినట్లుగా,
దేవుడు మొదట మనల్నితన
దయగల ప్రేమతో తన వైపుకు ఆకర్షించకపోతే మనం
తనలోనికి ఆశతో నమ్మి రాలేము. మొదట ఆయన మనలను తన కృప కొరకు పిలువకపోతే మనం ఆయన
దగ్గరకు రాలేము. తాను మనలను మొదట కనుగోనకపోతే మనం అయనను ఎన్నటికీ కనుగోనలేము.
జీవితాంతం వరకు విశ్వాసంలో ఎదగాలని మరియు పట్టుదలతో ఉండాలనుకుంటే, మనం దేవుని వాక్యంతో మన విశ్వాసాన్ని
పోషించుకోవాలి. దానిని పెంపొందించమని ప్రభువును అడగాలి (లూకా 17:5). పరీక్షలు మరియు ఎదురుదెబ్బలు మనల్ని
నిరాశపరిచినప్పుడు, మనం మన ఆశ మరియు విశ్వాసాన్ని ఎక్కడ
ఉంచుదాము? దేవుడు మన కోసం తన దయగల సంరక్షణ మరియు
ఏర్పాటును కలిగి యున్నాడు. అందుకు నిరీక్షణతో దృఢమైన ఆశతో ప్రార్థిoచ లేమా?
"నేను నా జీవితాంతం ప్రభువు ఇంట్లో
నివసించడానికి కోరుకుంటున్నాను..."(కీర్త 27:4)
No comments:
Post a Comment