ద్వితీ 8:2-3,14-16; 1 కొరింథీ 10:16-17; యోహా 6:51-58 (క్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగ
/A)
“మిమ్మును ఆయనతో ఐక్యపరచు
బంధము;
దానిని
భుజించుడి,
లేనియెడల
ఆయనయందు మీకు భాగముండదు”.
ఈనాడు క్రీస్తు సంఘము తన అతి పరిశుద్ధ శరీర రక్తముల పండుగను, అనగా దివ్య సత్ప్రసాదమనే గొప్ప గర్భితార్ధ
పండుగను జరుపుకుంటుంది. ఈ పవిత్రమైన దినమున,
కడరాత్రి భోజనమునందు
యేసు నెలకొల్పిన నూతన నిబంధనను మనము కేవలం జ్ఞాపకము చేసుకొనడమే కాదు; లోక రక్షణ కొరకు మన మధ్య నెలకొని యున్న ఆయన
సజీవ సన్నిధి అయిన ఆ నూతన నిబంధనను మనం జరుపుకుంటున్నాము. “పరలోకము నుండి
దిగివచ్చిన జీవపు రొట్టెను నేనే” (యోహా 6:51) అని యేసు
ప్రకటిస్తున్నాడు. దీని నుండి మనము రెండు ప్రధాన బోధనలను నేర్చుకుంటున్నాము. అవి
మొదటిగా,
అరణ్యములోని మన్నాతో ప్రారంభమైనది,
సమస్త
జనావళి నిత్యజీవమునకు కావలసిన ఆహారముగా
క్రీస్తునందు పరిపూర్ణతను పొందుతుంది. రెండవదిగా, ప్రతి
దివ్యబలిపూజ కల్వరి బలిలో భాగస్వామ్యము మరియు పరలోక విందు ముందస్తు రుచి అని
గ్రహిద్దాం.
దివ్య
సత్ప్రసాదం మానవుని గురించిన అత్యంత లోతైన సత్యాన్ని వెల్లడిస్తుంది. పోప్ లియో XIV, గడచిన
నెల ఆఖరి వారపు దినములలో తన మొదటి విశ్వ లేఖను ఈ లోకానికి
అందించాడు. దీనిని లతీను భాషనందు “Magnifica Humanitas” (మహోన్నతమైన మానవాళి) అని పిలిచాడు. మన నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI/ కృత్రిమ మేధస్సు)
గురించిన విషయ ప్రస్తావం ఇది. “కృత్రిమ మేధస్సు యుగంలో మానవుడిని రక్షించడం” అనేది
ఈ మహా బోధనా లేఖ సారంశం. సర్వ ప్రజలు చదువ వలిసిన అంశం. ప్రతి మానవుడు దేవుని
స్వరూపంలో సృష్టించబడి, ఆయనతోను మరియు ఇతరులతోను సహవాసం చేయడానికి పిలువబడినందున, భగవంతునికి
మానవునికి మధ్య విడదీయరాని గౌరవం ఉందని
మనకు గుర్తుచేస్తున్నాడు పోపుగారు. మానవాళి తన నిజమైన గొప్పతనాన్ని సాంకేతికతలోనూ, అధికారంలోనూ, లేదా విజయాలలోనూ
కాకుండా, దేవునితో ఉన్న సంబంధంలో, ఆత్మార్పణ ప్రేమలో కనుగొంటుందని పవిత్ర జ్ఞాన
తండ్రి బోధిస్తున్నాడు. దివ్య సత్ప్రసాదం ఈ సత్యానికి అత్యున్నత వ్యక్తీకరణగా
వుంది. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడంలో, మనం క్రీస్తుతో మాత్రమే కాకుండా ఒకరితో
ఒకరం ఐక్యమవుతున్నామని "ఒకే రొట్టె
ఉన్నందున, మనమందరం ఒకే శరీరంగా ఉన్నాము" (1 కొరింథీ 10:17) అన్న భక్త
పౌలుని మాట తెలిసినదే!!
మనం
క్రీస్తు శరీరాన్ని స్వీకరించినప్పుడు, మనం స్వీకరించిన దానిగా—అంటే క్రీస్తు
శరీరంగా—మారిపోతామని పునీత అగస్టిను బోధించాడు. అందువల్ల, దివ్య సత్ప్రసాదం
కేవలం ఆరాధించబడవలసిన ఒక సంస్కారం మాత్రమే కాదు; అది జీవించవలసిన ఒక కర్తవ్యం. దాతృత్వం, క్షమాపణ, త్యాగం మరియు సేవ
ద్వారా ఇతరుల కోసం విరవబడిన రొట్టెగా మారడానికి మనం పిలువబడ్డాము. సాంకేతికత, వ్యక్తివాదం మరియు
ఏకాంతం ద్వారా నానాటికీ రూపుదిద్దుకుంటున్న ప్రపంచంలో, మానవత లేదా మనిషి
తన ఆత్మను ఎన్నటికీ కోల్పోకూడదని “మాగ్నిఫికా హుమానితాస్” హెచ్చరిస్తుంది. మానవ
గౌరవాన్ని – ఉత్పాదకత, సామర్థ్యం లేదా డిజిటల్ గుర్తింపుకు కుదించలేము. త్రిత్వ దేవునికి
మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సహవాసాన్ని ప్రతిబింబించే "ప్రేమ
నాగరికత"ను నిర్మించాలని ఈ విశ్వ లేఖ క్రైస్తవ సంఘానికి, సమాజానికి
పిలుపునిస్తుంది.
మానవ
వికాసం ఆత్మస్థైర్యంలో కాకుండా ఆత్మత్యాగం మరియు త్యాగపూరిత ప్రేమలో ఉందని “మాగ్నిఫికా
హుమనితాస్” (మహోన్నతమైన మానవాళి) మనకు గుర్తు చేస్తుంది. అటువంటి ప్రేమకు దివ్య
సత్ప్రసాదం అత్యున్నత పాఠశాల. ఈ సంస్కారంలో, క్రీస్తు ప్రపంచ జీవనం కోసం తనను తాను
పూర్తిగా అర్పించుకుంటున్నాడు మరియు అదే ఆత్మత్యాగ నమూనాను అనుకరించమని మనల్ని
ఆహ్వానిస్తున్నాడు. దివ్య సత్ప్రసాద పీఠo చుట్టూ సమావేశమైన కుటుంబాలు సహవాసం, కృతజ్ఞత, క్షమాపణ మరియు
పరస్పర సేవా భాషను నేర్చుకోవాలి. ఈ విధంగా దివ్య సత్ప్రసాదం కుటుంబ ఐక్యతకు
పునాదిగానూ, ఇంటిలో జీవన, ప్రేమ సంస్కృతికి మూలంగానూ మారుతుంది.
ఆధిపత్యం, సాంకేతిక విజయం, ఆర్థిక విజయం లేదా
రాజకీయ అధికారం ద్వారా మాత్రమే కాకుండా, సత్యం, సంఘీభావం మరియు సహవాసంలో పాతుకుపోయిన
సంబంధాల ద్వారానే మానవాళి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని Magnifica Humanitas (మహోన్నతమైన మానవాళి) బోధిస్తుంది. నిజమైన గొప్పతనం ఒకరి వద్ద
ఉన్నదానిలో కాకుండా వారు ఇచ్చేదానిలో; పోటీ తత్త్వంలో కాకుండా సహవాసంలో; బహిష్కరణలో
కాకుండా భాగస్వామ్యంలో ఉందని మన మానవాళి కనుగొనాలి. మానవాళి భవిష్యత్తు దేవునిలో
ఐక్యమైన ఒకే కుటుంబంగా మారడంలోనే ఉందని దివ్య సత్ప్రసాద క్రీస్తు
వెల్లడిస్తున్నారు. అదే విధంగా నేటి పోపుగారి విశ్వ లేఖ పిలుపు నిస్తుంది.
“ప్రభువు మాకు శ్రేష్ఠమైన గోధుమలను తినిపించాడు; బండ నుండి వచ్చిన తేనెతో మమ్మల్ని త్రిప్తి పరిచాడు”
No comments:
Post a Comment