దేవుని రాజ్యంలో “నిన్ను నీవుగా” మలచుకో
1 రాజులు 3:5, 7-12; రోమా 8:28-30; మత్తయి 13:44-52 (17 /A)
“మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే
మీకును కొలువబడును."
నేటి సువార్తలో, యేసు పరలోక
రాజ్యాన్ని పొలంలో దాచబడిన నిధితోను మరియు అమూల్యమైన ముత్యంతోను పోల్చాడు. ఈ రెండు
ఉపమానలలోనూ,
ప్రజలు
తమ అనంతమైన విలువైన దానిని సంపాదించుకోవడానికి
సంతోషంగా సమస్తమును త్యజించాలని పిలుపునుస్తున్నాడు. అందుకే నీ జీవితంలో గొప్ప
నిధి ఏది?
అని యేసు
మనల్ని ఒక లోతైన ప్రశ్న అడుగుతున్నాడు. “నిధి” అనే గ్రీకు పదం θησαυρός (థెసౌరోస్). దీని నుండే మనం
ఆంగ్లంలో ట్రెజరీ అనే పదాన్ని తీసుకున్నాము. దీని అర్థం కేవలం భౌతిక సంపద మాత్రమే
కాదు.
అది నువ్వు నీవే!! ఒకరు తన “వ్యక్తి” అనే దానికి అన్నిటికంటే ఎక్కువగా విలువ ఇచ్చేది. అది గొప్ప
నిధి అనే - అధికారం,
విజయం
లేదా ఆస్తులు కాదని, తనలో
ఉన్న “నీవు/నీవే” అని యేసు బోధిస్తున్నాడు. అప్పుడే ప్రతి మానవుడు తన
నిజమైన గౌరవాన్ని కనుగొంటాడు.
సొలొమోను రాజు
ఐశ్వర్యాన్ని గానీ దీర్ఘాయువును గానీ కోరుకోలేదు. కానీ “వినే
హృదయాన్ని” కోరుకున్నాడు (1 రాజులు 3:9). לֵב שֹׁמֵעַ (lēb shōmēaʿ) అనే హీబ్రూ పదబంధానికి అక్షరాలా “వినే
హృదయం” అని అర్థం. బైబిల్లో, హృదయం అనేది హేతువు, మనస్సాక్షి మరియు
నైతిక నిర్ణయాలకు కేంద్రం. వినే హృదయం ఎప్పుడూ తన జీవిత ఎంపికలు చేసుకునే ముందు
దేవుని జ్ఞానాన్ని కోరుకుంటుంది. ఫ్రెంచ్ తత్వవేత్త బ్లేజ్ పాస్కల్, “హృదయానికి తన కారణాలు
ఉన్నాయి.
అవి
హేతువుకు తెలియవు” అని వ్రాసాడు. ప్రేమ, న్యాయం, తనలోని “స్వయం”/“స్వయం
ప్రతిపత్తి” వంటి లోని లోతైన సత్యాలను డబ్బుతో గానీ సాంకేతికతతో గానీ కొలవలేమని
ఆయన మనకు గుర్తుచేస్తున్నాడు. దేవునికి మరియు ఇతరులకు తెరిచి ఉన్న హృదయం ద్వారా
అవి కనుగొనబడతాయి. అందుకే నీవు నీ ఆత్మను అమ్ముకోలేవు.
అదేవిధంగా, లియోన్స్‌కు చెందిన పునీత
ఐరేనియస్ మానవాళి గురించిన క్రైస్తవ దృక్పథాన్ని ఒక మరపురాని వాక్యం, “సంపూర్ణంగా
జీవించే మానవుడే దేవుని మహిమ” (అడ్వర్సస్ హేరేసెస్, IV, 20, 7) అని వ్యక్తపరిచాడు. సంపూర్ణంగా జీవించడం
అంటే దేవుడు మనల్ని ఎలా ఉండాలని సృష్టించాడో, అలా సత్యం, న్యాయం మరియు ప్రేమతో
జీవించడం. అందువల్ల దేవుని రాజ్యం కేవలం భవిష్యత్తు గమ్యం కాదు. మానవ గౌరవాన్ని
గౌరవించి,
పోషించినప్పుడల్లా
అది ప్రారంభమవుతుంది. క్యాథలిక్ సామాజిక బోధన ఖచ్చితంగా ఇదే ప్రకటిస్తుంది. ప్రతి
వ్యక్తి దేవుని స్వరూపంలో మరియు పోలికలో సృష్టించబడ్డాడు (ఆది 1:26–27). అందువల్ల, ప్రతి మానవుడు
ఉల్లంఘించలేని గౌరవాన్ని మరియు ప్రాథమిక హక్కులను కలిగి ఉంటాడు. జీవించే హక్కు, మనస్సాక్షి స్వేచ్ఛ
మరియు ఆలోచనా,
భావప్రకటనా
స్వేచ్ఛ హక్కు,
విద్యా
హక్కు,
అర్థవంతమైన
పని మరియు న్యాయమైన వేతనాలు పొందే హక్కు, మరియు సమాజంలో పాల్గొనే హక్కు. ఇవి
ప్రభుత్వాలు ప్రసాదించిన ప్రత్యేక హక్కులు కావు. అవి మనకు దేవుడిచ్చిన
గౌరవం నుండి ఉద్భవించాయి. ఈ హక్కు కోసమే ఢిల్లీలో నేడు ప్రపంచవ్యాప్తి
చెందుతున్న
యువత జంతర్ మంతర్(జెన్ జి) మండటం పోరాడుతున్నట్లే
ఉంది. సత్య తిరుసభ బోధించినట్లుగా, “మానవ ‘వ్యక్తి’ గౌరవం
దేవుని స్వరూపంలో మరియు పోలికలో అతని సృష్టిలో పాతుకుపోయింది” (CCC 1700).
మన లోకం తరచుగా
జ్ఞానం కంటే సంపదకు,
కరుణ
కంటే వినియోగానికి,
మరియు
సేవ కంటే విజయానికి విలువనిస్తుంది. యేసు ఈ ప్రాధాన్యతలను తలక్రిందలు చేస్తాడు.
సర్వస్వం త్యాగం చేయదగిన నిధి, మన దగ్గర ఉన్నది కాదు. కానీ మనం ఎలా
మారుతామో అదే. ఒక సమాజం ఎత్తైన భవనాలను కలిగి ఉన్నప్పుడు కాదు. కానీ నిజాయితీ, కరుణ, న్యాయం, గౌరవం గల, మరియు సామూహిక
శ్రేయస్సుకు కట్టుబడి ఉండే స్త్రీపురుషులను తీర్చిదిద్దినప్పుడు మాత్రమే నిజంగా
సంపన్నమవుతుంది. నీవు ఏ నిధిని
వెతుకుతున్నావు?
అది
తాత్కాలిక విజయమా,
లేక
క్రీస్తులో మీరుగా మారడమనే శాశ్వతమైన నిధియా? మనం మొదట దేవుని రాజ్యాన్ని
వెదకినప్పుడు,
మనం
మన స్వంత జీవితాలను మార్చుకోవడమే కాకుండా, ప్రతి వ్యక్తి యొక్క గౌరవం గౌరవించబడే
మరియు ప్రతి మానవ జీవితం ఆదరించబడే కుటుంబాలను, సంఘాలను మరియు దేశాలను కూడా
నిర్మిస్తాము. నిజమైన నిధిని వెదకడానికి, వినే హృదయాన్ని (lēb shōmēaʿ) పెంపొందించుకోవడానికి, మరియు దేవుని రాజ్యం
అనే నిధికి (thēsauros)
అన్నిటికంటే
ఎక్కువ విలువనివ్వడానికి దివ్య సత్ప్రసాదం మనలను బలపరచుగాక!!!
సంపూర్ణ జ్ఞానంతో
ఒకరికొకరు బోధించుడి,
ఉపదేశించుడి.
No comments:
Post a Comment