AletheiAnveshana

Saturday, 26 April 2025

“నా ప్రభువా, నా దేవా!” అపొ 5:12-16; ప్రక 1:9-11a,12-13,17-19; యోహాను 20:19-31 (2 / ఈస్టర్/ సి) కారుణ్య ఆదివారము)

 

నా ప్రభువా, నా దేవా!”

అపొ 5:12-16; ప్రక 1:9-11a,12-13,17-19; యోహాను 20:19-31 (2 / ఈస్టర్/ సి) కారుణ్య ఆదివారము)

నేను విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాను. నిద్రపోయాను. కానీ నేను మళ్ళీ లేచాను. ఎందుకంటే ప్రభువు నన్ను ఆదుకున్నాడు. అల్లెలుయ.

పునీత తోమాసు వారికి రెండు గొప్ప సద్గుణాలు ఉన్నాయి. తాను అర్థం చేసుకోని వాటిని తాను అర్థం చేసుకున్నానని లేదా తాను నమ్మని వాటిని తాను నమ్మానని చెప్పడానికి అతను పూర్తిగా నిరాకరించాడు. అతనిలో రాజీపడని నిజాయితీ ఉంది. అవి లేవని నటిస్తూ తన సందేహాలను ఎప్పుడూ నిగ్రహించుకోలేదు. తాను నమ్ముకున్న విశ్వాస సత్యాన్ని అర్థం చేసుకోకుండా దానిని కొట్టిపారవేసే వ్యక్తి  కాదు అతను. క్రీస్తు తనకు జ్ఞానోదయం చేసిన తరువాతి రోజుల్లో తోమాసు వారికి ఏమి జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ “ది యాక్ట్స్ ఆఫ్ థామస్” అనే అపోక్రిఫల్ పుస్తకం ఒకటి ఉంది. ఇది అతని చరిత్రను అందించ  ఉద్దేశించబడింది. ఇది కేవలం పురాణం మాత్రమే. కానీ పురాణం వెనుక కొంత చరిత్ర ఉంది. దానిలో ఖచ్చితంగా తోమాసు పాత్రకు చెందినవాడు నిజమైన తోమాసు వారే. ఆ గ్రంథం చెప్పే కథలో కొంత భాగాన్ని విందాం.

యేసు మరణానంతరం శిష్యులు ప్రపంచాన్ని తమలో తాము విభజించుకున్నారు, తద్వారా ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించడానికి ఏదో ఒక దేశానికి వెళ్ళాలి. భారతదేశం వెళ్ళడానికి తోమాసు వారికి చీట్లు పడింది. (దక్షిణ భారతదేశంలోని థామిస్ట్ చర్చి దాని మూలాన్ని అతని నుండి కనుగొంటుంది) మొదట అతను వెళ్ళడానికి నిరాకరించాడు. కారణం సుదీర్ఘ ప్రయాణానికి తగినంత బలం తనకు లేదని చెబుతూ ఇలా అన్నాడు: "నేను హీబ్రూ మనిషిని. నేను భారతీయుల మధ్యకు వెళ్లి సత్యాన్ని ఎలా ప్రకటించగలను?" అందుకు యేసు ఆ రాత్రి అతనికి కనిపించి ఇలా అన్నాడు: "తోమాసు, భయపడకు, భారతదేశానికి వెళ్లి అక్కడ వాక్యాన్ని ప్రకటించు, ఎందుకంటే నా కృప నీకు తోడుగా ఉంది." కానీ తోమాసు అప్పటికీ మొండిగా నిరాకరించాడు. "నీ  ఇష్టమైన ప్రాంతానికి నువ్వు నన్ను పంపు, నీ ఇష్టం. కానీ నేను భారతీయుల వద్దకు మాత్రం వెళ్ళను” అని చెప్పాడు.

భారతదేశం నుండి అబ్బానెస్ అనే ఒక వ్యాపారి జెరూసలేంకు వచ్చాడు. గుండఫోరస్ అనే రాజు అతన్ని నైపుణ్యం కలిగిన వడ్రంగిని కనుగొని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి పంపాడు. తోమాసు ఒక వడ్రంగి. యేసు మార్కెట్ స్థలంలో అబ్బానెస్ వద్దకు వచ్చి అతనితో: "నువ్వు వడ్రంగిని కొంటావా?" అని అన్నాడు. అందుకు అబ్బానెస్ "అవును" అని సమాధానం ఇచ్చాడు. అందుకు యేసు, "నా దగ్గర వడ్రంగి అయిన ఒక బానిస ఉన్నాడు, అతన్ని అమ్మాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పి దూరంలో ఉన్న తోమాసు వైపు చూపించాడు. అప్పుడు  వారు ఒక ధరకు అంగీకరించుకోవడంతో తోమాసు అమ్మబడ్డాడు. ఆ అమ్ముదల ఒప్పందం ఇలా ఉంది: "వడ్రంగి యోసేపు కొడుకు అయిన యేసు, నేను నా బానిస తోమాసు, గుండఫోరస్ ఇండియన్ల రాజు వ్యాపారి అయిన నీకు అమ్మేశానని అంగీకరిస్తున్నాను." దస్తావేజు వ్రాసినప్పుడు యేసు తోమాసును   అబ్బానెసు వద్దకు తీసుకెళ్లాడు. అబ్బానెస్ తోమాసును : "ఇతనే నీ యజమానినా?" అని అడిగాడు. అందుకు తోమాసు: "నిజమే అతనే."అని జవాబిచ్చాడు. అందుకు అబ్బానెసు: "నేను నిన్ను అతని నుండి కొన్నాను" అని చెబితే తోమాసు ఏమీ మాట్లాడలేదు. కానీ ఉదయాన్నే అతను లేచి ప్రార్థించాడు. తన ప్రార్థన తర్వాత అతను యేసుతో ఇలా అన్నాడు: "ప్రభువైన యేసు, నీ చిత్తం నెరవేరాలని నేను వెళ్తాను." ఇది అదే పాత తోమాసులో లొంగిపోవడానికి నిశ్చయత కొరతగా వున్నా అతను లొంగిపోవడం పూర్తయిన తర్వాత తన నిశ్చల నిశ్చయత పూర్తయింది.

గుండఫోరస్ రాజు తోమాసు వారిని ఒక రాజభవనం నిర్మించమని ఎలా ఆదేశించాడో, తోమాసువారు ఆ పనిని ఎలా చేయగలడని  చెప్పాడో ఈ కథనం చెబుతుంది.  అతనికి సామాగ్రిని కొనడానికి మరియు పనివారిని నియమించుకోవడానికి పుష్కలంగా డబ్బు ఇచ్చాడు రాజు, కానీ తోమాసు వారు ఆ ధనాన్ని పేదలకు పంచి పెట్టాడు. రాజభవనం క్రమంగా వృద్ధి చెందుతోందని అతను ఎప్పుడూ రాజుతో చెపుతూ వుండేవాడు. కాని రాజుకు ఒకసారి అనుమానం వచ్చింది. చివరికి అతను తోమాసు వారిని పిలిపించి,  "నువ్వు నాకు రాజభవనం నిర్మించావా?" అని అడిగాడు. అందుకు తోమాసు వారు : "అవును" అని జవాబిచ్చాడు". అయితే, మనం ఎప్పుడు వెళ్లి చూడాలి?" అని రాజు అడిగాడు. అప్పుడు తోమాసు వారు: "నువ్వు ఇప్పుడు దానిని చూడలేవు. కానీ నువ్వు ఈ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, నువ్వు దానిని సుస్పష్టంగా చూడగలవు" అని సమాధానమిచ్చాడు. మొదట రాజు చాలా కోపం చెందినప్పటికీ, తోమాసు వారు తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నప్పటికి, చివరికి రాజు కూడా క్రీస్తులోనే భాగ్య జీవితం పొందుకున్నాడు. అలా తోమాసు వారు క్రైస్తవ మతాన్ని భారతదేశానికి తీసుకువచ్చాడు.

తోమాసు వారిని గురించి మనం చాలా ప్రేమించదగినది మరియు చాలా ప్రశంసనీయమైనది ఒకటి ఉంది. విశ్వాసం అనేది అతనికి ఎప్పుడూ సులభమైన విషయం కాడు.  విధేయత అనేది అతనికి ఎప్పుడూ సులభంగానూ రాలేదు. అతను ఖచ్చితంగా ఉండే వ్యక్తి. అందుకు వ్యయ ఖర్చును లెక్కించాల్సిన వ్యక్తి. కానీ అతను ఖచ్చితంగా ఉన్న తర్వాత, ఖర్చును లెక్కించిన తర్వాత, విశ్వాస విధేయతలా అంతిమ పరిమితికి వెళ్ళిన వ్యక్తి అతను. తోమాసు వారి  లాంటి విశ్వాసం అనేది ఎలాంటి అబద్ధపు వాదన కన్నా మిన్ననై ది. మరియు అతని లాంటి విధేయత అనేది వ్యయ ఖర్చును లెక్కించకుండా ఒక పనిని చేయడానికి అంగీకరించి, ఆపై ఆ మాటను సులువుగా తిప్పిగొట్టే మనస్తత్వం కంటే మంచిది.

మీ నిజమైన జీవితం క్రీస్తు

“My Lord and my God!” Acts 5:12-16; Rev 1:9-11a,12-13,17-19; Jn 20:19-31 (2 / Easter/ C) Divine Mercy)

 

“My Lord and my God!”

Acts 5:12-16; Rev 1:9-11a,12-13,17-19; Jn 20:19-31 (2 / Easter/ C) Divine Mercy)

I lay down to rest and I slept; but I rose again, for the Lord upheld me. Alleluia.

 

The Apostle Thomas had two great virtues. They are that he refused to say that he understood what he did not understand, first, and second, that he believed what he did not believe. There is an uncompromising honesty about him. He would never still his doubts by pretending that they did not exist. He was not the kind of man who would rattle off a creed without understanding what it was all about. We do not know for sure what happened to Thomas in the after days, but there is an apocryphal book called “The Acts of Thomas” which purports to give his history. It is, of course, only a legend, but there may well be some history beneath the legend, and certainly in it Thomas is true to character. Here is part of the story that it tells.

After the death of Jesus, the disciples divided up the world among them, so that each might go to some country to preach the gospel. India fell a lot to Thomas. (The Thomist Church in South India does trace its origin to him) At first, he refused to go, saying that he was not strong enough for the long journey. He said: “I am a Hebrew man; how can I go amongst the Indians and preach the truth?” Jesus appeared to him by night and said: “Fear not, Thomas, go thou unto India and preach the word there, for my grace is with thee.” But Thomas still stubbornly refused. “Where you would send me, send me,” he said, “but elsewhere, for unto the Indians I will not go.”

It so happened that there had come a certain merchant from India to Jerusalem called Abbanes. He had been sent by King Gundaphorus to find a skilled carpenter and to bring him back to India, and Thomas was a carpenter. Jesus came up to Abbanes in the marketplace and said to him: “Would you buy a carpenter?” Abbanes said: “Yes.” Jesus said, “I have a slave that is a carpenter, and I desire to sell him,” and he pointed at Thomas in the distance. So, they agreed on a price and Thomas was sold, and the agreement ran: “I, Jesus, the son of Joseph the carpenter, acknowledge that I have sold my slave, Thomas by name, unto thee Abbanes, a merchant of Gundaphorus, king of the Indians.” When the deed was drawn up, Jesus found Thomas and took him to Abbanes.  Abbanes said: “Is this your master?” Thomas said: “Indeed, he is.” Abbanes said, “I have bought you from him.” And Thomas said nothing. But in the morning, he rose early and prayed, and after his prayer, he said to Jesus: “I will go wherever you send, Lord Jesus, your will be done.” It is the same old Thomas, slow to be sure, slow to surrender; but once his surrender is made, it is complete.

The story goes on to tell how Gundaphorus commanded Thomas to build a palace, and Thomas said that he was well able to do so. The king gave him plenty of money to buy materials and hire workmen, but Thomas gave it all away to the poor. He always told the king that the palace was rising steadily. The king was suspicious. In the end, he sent for Thomas: “Have you built me the palace?” he demanded. Thomas answered: “Yes.” “When shall we go and see it?” asked the king. Thomas answered: “You can not see it now, but when you depart this life, then you shall see it.” At first, the king was very angry and Thomas was in danger of his life; but in the end, the king too was won for Christ, and so Thomas brought Christianity to India.

There is something very lovable and very admirable about Thomas. Faith was never an easy thing for him. Obedience never came readily to him. He was the man who had to be sure. He was the man who had to count the cost. But once he was sure, and once he had counted the cost, he was the man who went to the ultimate limit of faith and obedience. A faith like Thomas' is better than any glib profession.  And obedience like his is better than an easy acquiescence which agrees to do a thing without counting the cost and then goes back upon its word.

“Your real life is Christ”

Sunday, 20 April 2025

పునఃరుత్థాన యేసుతో కొత్త జీవితానికి నడుద్దాం

 

పునఃరుత్థాన యేసుతో కొత్త జీవితానికి నడుద్దాం

యూదు సంప్రదాయం ప్రకారం, ఒక రబ్బీ తన విద్యార్థులను తెల్లవారుఝామున చీకటిగా ఉండగానే ఒకచోట చేర్చి, ఈ ప్రశ్న అడిగాడు: రాత్రి ముగిసినదనీ, పగలు ప్రారంభమైనదనీ ఎలా తెలుస్తుంది? అందుకు ఒక విద్యార్థి ఇలా సమాధానమిచ్చాడు: ‘బహుశః మీరు ఒక జంతువును చూసినప్పుడు అది గొర్రెనా లేక కుక్కనా అని మీరు గుర్తించగలరు.’ ‘లేదు,’ అని రబ్బీ అన్నాడు. రెండవ విద్యార్థి ఇలా సమాధానమిచ్చాడు: ‘బహుశః మీరు దూరంలో ఉన్న చెట్టును చూస్తున్నప్పుడు అది అంజూరపు చెట్టునా లేక పీచ్ చెట్టునా అని మీరు చెప్పగలరు.’ ‘లేదు,’ అని రబ్బీ అన్నాడు. మరికొన్ని అంచనాత్మక జవాబుల తర్వాత విద్యార్థులు గురువును తమ సమాధానం ఇవ్వమని అడిగారు. రబ్బీ ఇలా సమాధానమిచ్చాడు: ‘మీరు ఏ స్త్రీ లేదా ఏ పురుషుడి ముఖం చూసినప్పుడు ఆమె మీ సోదరి అని మరియు అతను మీ సోదరుడు అని చెప్ప గలిగినప్పుడే! మీరు దీన్ని చేయలేకపోతే, అది ఎంత సమయం అయినా, అది ఇంకా నిశి రాత్రియే.’

పునీత యోహాను సువార్త కథనం ప్రకారం, ఈస్టర్ చరిత్ర  - వారంలోని మొదటి రోజు తెల్లవారుఝాము 'ఇంకా చీకటిగా' ఉండగానే ప్రారంభమవుతుంది. అదే గ్రంథ కర్త తన మొదటి లేఖలో, 'చీకటి గడిచిపోతోంది మరియు నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది' అని నొక్కి చెప్పాడు. కానీ ఇది ఖచ్చితంగా ఒక షరతుపై ఉంది. దానిని అతను స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: తన సహోదర సహోదరీలను ప్రేమించేవాడు అని స్పష్టం చేశాడు. మరియు  వెలుగులో నివసిస్తాడు మరోవైపు, 'ద్వేషించడానికి ఇష్టపడేవాడు ... చీకటిలోనే ఉన్నాడు (1 యోహాను 2:8-11).

కేవలం రెండు రోజుల క్రితమే, మన మానవ లోకం ఇప్పటివరకు కని విని ఎరుగని బాధామయ సేవకుని అత్యంత అద్భుతమైన బాధల మరణాన్ని మనం స్మరించుకున్నాము. మానవ స్వభావపు చీకటి వైపున, యేసు శత్రువులు ఆయనను హింసించడానికి, అవమానించడానికి చివరకు సిలువపై హత్య చేయడానికి దారితీసిన చీకటిని జీర్ణించుకోలేనంతగా మనం ధ్యానించుకున్నాము. ఆ చీకటి రోజున, ఒకరినొకరు ద్వేషించే, బాధపెట్టే హాని చేసే మానవుల సామర్థ్యం యేరూషలేంలో పూర్తిగా అదుపు తప్పేసింది. కాబట్టె సమయకాలాతీతునికి జరిగిన అన్యాయానికి కాలం మధ్యాహ్నం మూడు గంటల వరకు సిగ్గుతో తలదించుకొని బోరున విలపిస్తూ చీకటితో ముసుగు వేసుకున్నది. బిడియంతో సూర్యుడు కాంతి హీనుడయ్యాడు’. గజగజ వణుకుతూ దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది’ (లూకా 23:24). తమ సృష్టి కర్తకు జరిగిన అవమానానికి సృష్టి తలదించుకోవడం అనేది ఆశ్చర్యం కలిగించదు మరీ!!

వెలుగు చీకటిల మధ్య, మంచి చెడుల మధ్య, ఒక బలమైన పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. ఇది భౌతిక విశ్వంలో, మానవ సమాజాలలో మరియు మన స్వంత వ్యక్తిత్వాలలో జరుగుతోంది. కాంతి కంటే చీకటి తరచుగా బలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, అది ఎన్నటికి విజయం సాధించలేదు. వెలుగు అసాధారణంగా స్థితిస్థాపకంగా ఉంటుంది. తరచుగా ఆరిపోయే ప్రమాదంలో అది మనుగడ సాగించగలదు. అనేక విజయాలను కూడా గెలుచుకుంటుంది. అనేక సంవత్సరాల క్రితమే ఆధునిక భారతదేశ పితామహుడు మహాత్మా గాంధీ ఆనీ బీసెంటుతో చెప్పినట్లే అవి ఇప్పటికీ వాస్తవికతను సంతరించుకుంటున్నాయి. ఒక్క సారి ఆమేతో చెప్పిన మాటలను చూడండి! 'నేను నిరాశ చెందినప్పుడు చరిత్ర అంతటా సత్యం మరియు ప్రేమ మార్గం ఎల్లప్పుడూ గెలిచిందని నాకు గుర్తుంది. నిరంకుశులు మరియు హంతకులు ఉన్నారు. కొంతకాలం వారు అజేయులుగా  అనిపించవచ్చు, కానీ, చివరికి, వారు ఎల్లప్పుడూ పడిపోతారు. అసత్యం ఓడిపోతున్నట్లు కన్పిస్తున్నా, చివరకు గెలిచేది సత్యమే!” ఈస్టర్ జాగరణ ప్రార్థనా విధానపు మాటలు అదే సత్యాన్ని సమాంతరంగా ఆకర్షణీయమైన రీతిలో వ్యక్తపరుస్తున్నాయి. 'ఈ పవిత్ర [ఈస్టర్] రాత్రి ఆశక్తిని ప్రకటిస్తుంది. అన్ని చెడులను తొలగిస్తుంది. అపరాధభావాన్ని కడుగుతుంది. కోల్పోయిన అమాయకత్వాన్ని పునరుద్ధరిస్తుంది. దుఃఖితులకు ఆనందాన్ని తెస్తుంది. ఇది ద్వేషాన్ని పారద్రోలుతుంది. మనకు శాంతిని తెస్తుంది మరియు భూమిపై గర్వాన్ని అణచివేస్తుంది. మన ఈస్టర్ వేడుక చెడు మరియు ద్వేషపు చీకటి ఎప్పటికీ గెలిచే చివరి మాటగా ఒప్పదని మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే యేసు పునరుత్థానం మనలో మరియు మన ప్రపంచంలో చీకటిపై కాంతి చెడుపై మంచితనం అంతిమ విజయాన్ని ప్రకటిస్తుంది.

చీకటి మళ్ళీ భూమిపై ఎగపాకుతున్నప్పుడు, సూర్యాస్తమయ సమయంలో యేసు భౌతిక దేహాన్ని సమాధిలో భద్రపరిచారు. అతను ఒక బాధితుడనీ వైఫల్యుడని అందరికీ అనిపించింది. కానీ మూడవ రోజున భానుడు కేరింతలతో ఆతనితో పాటుగా తన కిరీటమై , సజీవంగా, శక్తివంతంగా ప్రభావవంతంగా చలి చీకటి తెరలను చీల్చుకొని అతని విజయోత్సాహ చిహ్నoగా వెలుగు సత్య పతాకాన్ని దేదీప్య మానంచేశాడు. మరోసారి, 'అందరినీ ప్రకాశవంతం చేసే నిజమైన వెలుగు, లోకంలోకి వచ్చేసింది' (యోహాను 1:9). కాబట్టి ఈ రోజు మనం చీకటి నుండి, మరణం నుండి లేవడం ద్వారా ఆయన పునరుత్థానాన్ని జరుపుకుంటున్నాము. మన మధ్యలో వెలిగించే ఈ అందమైన ఈస్టర్ కొవ్వొత్తి ద్వారా ప్రాతినిధ్యం వహించే పునరుత్థాన ప్రభువు స్వయంగా, చీకటి పనులను విడిచిపెట్టమని, మన జీవితాల్లో చీకటి, దుష్ట మరియు చెడుగా ఉన్న ప్రతిదాన్ని త్యజించి తిరస్కరించమని మరియు బాప్తిస్మము ద్వారా ఆయనతో అనుసంధానించబడిన వ్యక్తులుగా, 'ఎల్లప్పుడూ వెలుగు బిడ్డలుగా నడవాలని' ఆశిస్తున్నాడు మన మృత్యుంజయుడు యేసు. అల్లెలూయ.

Rising with him to a new life

 

Rising with him to a new life

Jewish tradition tells of a rabbi who gathered his students together very early in the morning while it was still dark, and asked them this question: ‘How can you tell when the night has ended, and the day has begun?’ One student answered: ‘Maybe it’s when you see an animal and you can distinguish if it’s a sheep or a dog.’ ‘No,’ the rabbi said. A second student answered: ‘Maybe it’s when you are looking at a tree in the distance and you can tell whether it’s a fig tree or a peach tree.’ ‘No,’ said the rabbi. After a few more guesses, the students demanded the answer. The rabbi replied: ‘It’s when you look on the face of any woman or man and see that she is your sister, and he is your brother. If you cannot do this, it is still night, no matter what time it is.

In St John’s account, the Easter story begins very early in the morning of the first day of the week while it is ‘still dark’. In one of his letters, the same writer insists that ‘the darkness is passing away and the true light is already shining. But this is strictly on one condition, which he spells out clearly: ‘Whoever loves his brothers and sisters, John says, ‘lives in the light.’ On the other hand, whoever prefers to hate . . . is in the darkness.’ (1 Jn 2:8-11). Just two days ago, as we remembered the sufferings and death of the most marvelous human being the world has ever known, we came face to face with the dark side of human nature. This darkness led the enemies of Jesus to torture, humiliate, and finally murder him on a cross. On that black day in Jerusalem, the capacity of human beings to hate, hurt, and harm one another went completely out of control. It’s no wonder, then, that ‘darkness came over the whole land until three in the afternoon that ‘the sun’s light failed', and that ‘the curtain of the temple was torn in two‘ (Lk 23:24).

Between light and darkness, between good and evil, one mighty struggle is still going on. It’s going on in the physical cosmos, in human societies, and within our personalities. Although darkness often appears to be stronger than light, it has not yet triumphed. The light is remarkably resilient. Often in danger of being extinguished, it manages to survive, and even to win many victories. The words of Mahatma Gandhi, the father of modern India, still ring as true as when he said to Annie Besant years ago: ‘When I despair, I remember that all through history the way of truth and love has always won. There have been tyrants and murderers, and for a time they can seem invincible, but, in the end, they always fall.’ The words of the Easter Vigil liturgy express the same truth in an equally appealing way: The power of this holy [Easter] night,’ it proclaims, dispels all evil, washes guilt away, restores lost innocence, brings mourners joy. It casts out hatred, brings us peace, and humbles earthly pride.’ Our celebration of Easter reminds us that the darkness of evil and hatred will never have the last say. The resurrection of Jesus proclaims the ultimate triumph of light over darkness and goodness over evil, both in us and in our world.

Jesus was buried at sunset, as darkness was once again creeping over the earth, to all appearances a victim and a failure. But on the third day afterwards, the sun came up on him victorious and triumphant, alive, powerful, and influential. Once again, ‘the true light, which enlightens everyone, was coming into the world” (Jn 1:9). So, we celebrate his resurrection today by rising from darkness and death ourselves. The Risen Lord himself, represented here by this beautiful Easter candle burning in our midst, is asking us to leave behind the works of darkness, to renounce and reject anything and everything in our lives which is dark, sinister and evil, and as persons connected to him by baptism, to ‘walk always as children of the light‘, following in his footsteps. 

 

Saturday, 19 April 2025

పవిత్ర శుక్రవారం దేవుని బాధ - మానవుని విముక్తి

 

పవిత్ర శుక్రవారం

దేవుని బాధ - మానవుని విముక్తి 

“దేవుడు తన సొంత కుమారుడిని విడిచిపెట్టలేదు.  కానీ మనందరి కోసం ఆయనను అప్పగించాడు”.

 

బాధ మరియు విముక్తి అనే రెండూ ఇశ్రాయేలీయుల పునః జననం. బానిసత్వం నుండి వారి విముక్తి గురించి చెప్పే నిర్గమ కథకు కేంద్రంగా ఈ రెండు ఉన్నాయి. స్వేచ్ఛ, భూవిస్తరణ మరియు విముక్తి అనే భావనలకు బాధ అనేది మొదటి విషయం కాకపోవచ్చు. ఈ అనుభవాలు తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని నిర్గమకాండ సంఘటన మనకు బోధిస్తుంది. “జోహార్” అనేది యూదుల ఒక ఆధ్యాత్మిక గ్రంథమయినటువంటి “కబ్బాలాహ్” అనే ముఖ్య గ్రంథపు  కేంద్ర రచన.  తోరా (పాత నిబంధన మొదటి ఐదు గ్రంథాలు) పై వ్యాఖ్యానం చేస్తున్నతువంటిది. దానిలోని ఆధ్యాత్మిక సంకేత అర్థాలను ఈ గ్రంథం పరిశీలిస్తుంది. ఈజిప్టు (హెబ్రీ భాషలో మిట్జ్రాయిము) మరియు “మి'త్సరిము" అంటే “ఇరుకైన జలసంధి” అనే పదాలు శారీరక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక బానిసత్వం అయినా సరే లేదా బాధ, సంకోచంలాంటి వ్యక్తిగత లేదా సామూహిక బాధలలాంటి అనుభవాలకు మారు రూపాలు ఈ పెర్లు అని మనం గ్రహించాలి. ఇశ్రాయేలీయులు మిజ్ట్రాయిము ("ఇరుకైన జలసంధి") నుండి బయటకు తీసుకురాబడ్డారు మరియు ఎర్ర (రీడ్స్) సముద్ర జలాల ద్వారా కొత్త ఉనికిలోకి తీసుకురాబడ్డారు. ఈ కోణంలో, ఈజిప్టు అనేది  ఒక తల్లి గర్భంలాగున  లేదా జనన కాలువగా కన్పిస్తుంది. దాని నుండి ఇశ్రాయేలీయులు మళ్ళి "పుట్టారు".  దేవుడు ఒక మంత్రసానిగా పురుడు పోసిన వాడయ్యాడు!

తన బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, బిడ్డ పుట్టడానికి ముందు ఎంత కష్ట తరమైన బాధను అనుభవిస్తుంది! అదేవిధంగా, ఇశ్రాయేలు విముక్తికి ముందు క్షణాలు అత్యంత భయంకరమైన మరియు చీకటి నిరాశలో మునిగిపోయాయి. చీకటి సంహారక దూత దాటిపోవడంతో, తన ప్రియమైన ప్రథమ కుమారుడిని కోల్పోయిన తర్వాత మాత్రమే ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాడు. అయినప్పటికీ తరువాత అతను తన మనసు మార్చుకుని వారిని వెంబడించాడు. నడి సముద్రంలో వెంబడిస్తున్న ఐగుప్తు సైన్యం ఒక ప్రక్క, మరో ప్రక్క సముద్ర జలాలో మరణంలాంటి భయనకాల మధ్య చిక్కుకున్నట్లు ఇశ్రాయేలీయ ప్రజలు గ్రహించారు. ఎర్ర సముద్రంను చూసి ఆశ్చర్యపోతూ, ఏ ఇశ్రాయేలీయుడు సముద్రపు నీటిలోనికి అడుగు పెట్టడానికి సాహసించలేదు. ఈ నిరాశాజనకమైన క్షణాల గురించి వివరిస్తూ మిడ్రాషిక్ అనే హిబ్రూ రచన ఒక చక్కటి సన్నివేశాన్ని అందిస్తుంది. అమ్మినాదాబు కుమారుడు నహ్షోను అనే ఒక వ్యక్తి ఆశ కోల్పోకుండా ముందుగా నీటిలోకి అడుగుపెట్టాడు. అయినప్పటికీ, అతని దృఢ విశ్వాసంలో మరో వైపున ఉన్న మానవ జనీనమైన బాధను మనం ఊహించవచ్చు! ఆ సమయంలో అతని ప్రార్థన ఇలా వుండివుండవచ్చు , "దేవా, నన్ను రక్షించు. నీళ్లు ప్రాణమువరకు పొంగిపొర్లుచున్నవి. నేను లోతైన బురదలోమునిగిపోయాను. అక్కడ నిలువ లేకపోయెను... నీటి వరదన నన్ను ముంచెత్తనియ్యకుము. అగాధము నన్ను మింగనియ్యకుము" (కీర్తన 69:2–3, 16). ఆ సమయంలో, మోషే ఇంకా తన ప్రార్థనలోనే నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు ఎల్ షడ్డాయ్ మోషేతో, “నా ప్రియమైనవారు సముద్రంలో మునిగిపోతున్నారు. నీవు ఇంకా ఎంతసేపు నీ ప్రార్ధనలు నాకు చేస్తావు? అని అంటే  అందుకు మోషే , “విశ్వ ప్రభూ! కానీ నేను ఏమి చేయగలను? అని జవాబిచ్చాడు. ఎలోహిమ్ అందుకు మోషేతో,  ఇశ్రాయేలు బిడ్డలతో ముందుకు సాగిపోవుడి అనిచెప్పు. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము” (నిర్గ 14:15–16; సోటా 37a) అని అజ్ఞాపించాడు. అన్ని ఆశలు కోల్పోయి నిరాశల పాలయినప్పుడు తలెత్తే భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ మిడ్రాష్ గ్రంథంలోని ఈ శక్తివంతమైన సన్నివేశం మనకు పాఠం చెపుతుంది.

బ్రెస్లోవ్‌కు చెందిన నాచ్‌మన్ అనే రబ్బీ ఒక యూదు బోధకుడు. అతని పదాల నుండి ప్రేరణ పొందిన ఒక ప్రసిద్ధ గీతం ఒకటి ఉంది. అది ఇలా చెబుతుంది, “ప్రపంచమంతా చాలా ఇరుకైన వంతెన కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దానిని దాటడానికి భయపడకూడదు.” నహ్షోను ఇరుకైన ప్రదేశంలో భయంతో స్తంభించిపోలేదు. అతను విశ్వాసంతో ముందుకు అడుగుపెట్టి ప్రార్థనలో పిలిచాడు. ఆ సాహసం  ముందుకు వెళ్ళే కొత్త మార్గాన్ని తెరిచింది. విముక్తి మరియు జీవితానికి మార్గం కల్పించింది. బాధల సముద్రంలో మనం మునిగిపోతున్న సమయంలో నహ్షోను చర్యలలో కలిగి వున్న విశ్వాసం మరియు దాని క్రియాత్మక చర్య రెండింటిలో ఉన్న శక్తిని మనకు బోధిస్తున్నాయి. అన్నీ అసాధ్యం అనిపించినప్పుడు విముక్తికి ప్రార్థన మరియు తెగింపు క్రియాత్మక చర్య అవసరం.

ఇతరుల బాధలను విస్మరించి మన స్వంత విముక్తి సాధించకూడదని కూడా ఇశ్రాయేలీయుల నిర్గమ కాండం మనకు గుర్తు చేస్తుంది. నిర్గమ చారిత్రాత్మక సంఘటన శూన్యంలో ఉండదు. ఒకరి బాధను మన బాధ నుండి వేరు చేయలేము. ఈజిప్టు అణచివేతదారులు  కూడా వేదనను అనుభవించారు. ఒక ప్రజకు స్వేచ్ఛను తెచ్చే శక్తి మరొకరికి బాధను కలిగిస్తుంది. దేవుడు బాధపడే వారందరితో కలసి బాధపడినట్లే, మనం కూడా మన బాధలను తిరిగి చూసుకుని ఇతరుల బాధను అంగీకరిండానికి ఆహ్వానించబడ్డాము. ఇశ్రాయేలు దేవుడు మానవ బాధలను పూర్తిగా అనుభవించాడు. దేవుడు ఇశ్రాయేలీయుల బాధలను చూశాడు. దానిని విన్నాడు. అది మూర్తీభవించిన అర్థంలో తెలుసుకున్నాడు. దేవుని సానుభూతి ఇశ్రాయేలీయులకే పరిమితం కాలేదు. మానవులకు మరియు మానవులు కాని ఆతని అన్ని రకాలైన సృష్టి జీవ రాశులకు విస్తరించింది, వర్తిస్తుంది (నిర్గమ 3:7). మన క్రైస్తవులు చదువుకోలేని యూదుల మరొక గ్రధం తాల్ముదు గ్రంథం. అందులో ఒక చక్కటి సన్నివేశం కన్పిస్తుంది. ఐగుప్తీయులు మునిగిపోతున్నప్పుడు దేవదూతలు ఆనందంగా పాడటం ప్రారంభించారట! అప్పుడు యెహోవా అందుకు సంతోషించలేదు. దేవుడు వారిని గద్దించాడని తాల్ముదు గ్రంథం మనకు ఇలా చెబుతుంది, "నా చేతుల సృష్టి  సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మీరు ఆనందం కోసం పాడటానికి ఎంత ధైర్యం?" (సేన్హేడ్రిన్ 39b). అంటే ఫరో చక్రవర్తి మరియు తన సైన్యం దేవుని సృష్టి భాగమే కదా!! అందుకే యెహోవా ఈ పరుష పదాలను తన దూతలతో పలికాడని  ఈ తాల్ముదు చెపుతుంది. కన్నీరు రప్పిస్తుంది కదా! కరుణా కనికర మూర్తి మన మాట్లాడే దేవుడు. మన శత్రువులు చేడిపోతుంటే సంతోషించేవాడు కాదు మన దేవుడు. మనం బాధ అనుభవించినప్పుడు మరియు విముక్తి పొందినప్పుడు కూడా ఇతరుల బాధలను గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తుంది ఈ గ్రంథం.

ఇతరుల బాధలను అంగీకరించడం కూడా క్రీస్తు పాస్కలో అంతర్లీనంగా ఉంది! నిర్గమకాండ సంఘటన మన కోసం మాత్రమే కాకుండా కుల, మత, వర్గ, సామాజిక, రాజకీయ, మానసిక, ఆధ్యాత్మిక విముక్తి కోసం బాధపడే వారందరికీ స్వేచ్చా వ్యయం గురించి ఆలోచించమని ఆహ్వానిస్తుంది. మనం ప్రేమించే వారి కోసం మాత్రమే కాకుండా, కల్వరిలో క్రీస్తు ప్రాణ త్యాగం చేసినట్లుగా మనకు వ్యతిరేకంగా నిలబడే వారి విముక్తి కోసం ప్రార్థించడం కూడా నేర్చుకుందాం. చివరికి, ఉమ్మడి లేదా ఐక్య సర్వమానవత్వం మాత్రమే మూలుగుతూ ఉన్న సమస్త విశ్వానికి నిజమైన విముక్తిని తీసుకురాగలదు.

 

“యేసుక్రీస్తు మన పట్ల తన ప్రేమను చూపించాడు మరియు తన జీవిత రక్తంతో మన పాపాల నుండి మనలను విడిపించాడు”.