AletheiAnveshana

Saturday, 2 August 2025

కష్టమైనను ఉత్తమమైనదానిని సంపాదించు ప్రసంగి 1:2; 2:21-23; కొలొ 3:1-5,9-11; లూకా 12:13-21 (18/ C)

 

కష్టమైనను ఉత్తమమైనదానిని సంపాదించు

ప్రసంగి 1:2; 2:21-23; కొలొ 3:1-5,9-11; లూకా 12:13-21 (18/ C)

మనం... సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన వాటిని పూజించి సేవ చేయగలమా? (రోమా 1:25)

కీర్తనకారుడు, నీవు సృజించిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రతారకలను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీ కంటెను వానిని కొంచెము తక్కువ వానిగా మాత్రమె చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ సృష్టియంతటి మీద వానికి అధికారమిచ్చి యున్నావు” (కీర్తన 8: 4-6) అని ప్రార్థించాడు. పోపు ఫ్రాన్సిసు మనలను ఇలా ఆదేశించాడు, “మీరు చాలా ప్రాముఖ్యమైనవారు! మీరు ఏమి కలిగి ఉన్నారో దానిని కాదు, మీరు ఏమిటో అన్నదానిని మాత్రమె  దేవుడు లెక్కిస్తాడు. అతని దృష్టిలో, మీరు ధరించే బట్టలు లేదా మీరు ఉపయోగించే సెల్ ఫోన్లు ఖచ్చితంగా పట్టింపు కాదు అతనికి. మీరు స్టైలిష్‌గా ఉన్నారా లేదా అనేది ఆయనకు పట్టింపు కాదు. ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు! ఆయన దృష్టిలో మీరు చాలా విలువైనవారు, మీ విలువ అమూల్యమైనది." ఇదే విషయం యిర్మీయా 1:5; యెషయా 49:16; కీర్తన 8:4; కీర్తన 139:18-19 లలో మనకు వాగ్దానం చేయబడినది. మనం చిత్తశుద్ధితో జీవించడం ద్వారా మాత్రమె పరలోకంలో మన నిధిని నిల్వ చేసుకుంటాము. పునీత జాన్ మేరీ వియాన్నీ గారు, మనిషికి ప్రార్థించడం మరియు ప్రేమించడం అనేది ఒక అందమైన విధి మరియు బాధ్యత. మీరు ప్రార్థించి ప్రేమించినట్లయితే, మీరు ఈ లోకంలో ఆనందాన్ని పొందుతారు” అని తన బోధనలో వ్రాసాడు. “పేదల అవసరాలను మనం తీర్చ గలిగినపుడు, అది దయతో కూడిన పని కాదు. అది మనది కూడా కాదు. వారిది వారికే ఇచ్చెస్తున్నామనీ, మనం న్యాయపు రుణాన్ని చెల్లిస్తున్నాము" అని పునీత గ్రెగొరీ ది గ్రేట్ బోధించాడు. ఇది ఒక విప్లవాత్మకమైన బోధన.

క్రీస్తు విలువలు లోక విలువలకు విరుద్ధంగా వుంటాయి. పౌలు ఇలా అంటున్నాడు, మనం లోకం దృష్టిలో మూర్ఖులం, కానీ ఆయన దృష్టిలో జ్ఞానవంతులం. క్రీస్తు కోసం మనం మూర్ఖులం అవుతాము (1 కొరింథీ 3;19; 4:10). “లోకమంతటినీ సంపాదించి, మనల్ని మనం పోగొట్టుకోవడం వల్ల లేదా నాశనం చేసుకోవడం వల్ల మనకు ఏమి లాభం?” (లూకా 9:25). “మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పటికీ, అది మన ఆత్మలకు ఏమాత్రం భద్రత తీసుకు రాలేదు” (లూకా 12:15). అమూల్యమైన ఉద్దేశపూర్వక జీవితం అనేది కేవలం డబ్బు లేదా భౌతిక వారసత్వాన్ని కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టదు. నేటి సువార్తలోని ధనవంతుడు తన శక్తిని సమయాన్ని సంపదపై మరియు సంపదను పోగుచేయడంపై ఖర్చు చేశాడు. యేసు మన సంపద మరియు ఆరోగ్యానికి వ్యతిరేకమా? “ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపుతాడు. పేదవారిని బూడిద కుప్ప నుండి పైకి లేపుతాడు. వారిని రాజులతో కూర్చోబెడతాడు. వారిని గౌరవ సింహాసనాన్ని వారసత్వంగా పొందేలా చేస్తాడు” (1 సమూ 2:8) అనే లేఖనాన్ని ఆయన తిరస్కరించడు. ఆయన సౌకర్యాలకు సంపదలకు వ్యతిరేకి కానే కాదు, కానీ ఆయనకు ఒక సాధారణ ప్రశ్న ఉంది, “మూర్ఖుడా! ఈ రాత్రి, నీ ప్రాణం నీ నుండి కోరబడితే, నీవు సిద్ధం చేసుకున్న సంపదలు ఎవరివి అవుతాయి?" ఈ ప్రశ్న పునీత లయోలా పురి ఇగ్నేషియస్‌తో మాట్లాడింది. తన సమాధానం చాలా మందికి నేటికీ స్ఫూర్తినిస్తుంది.

మరో తీవ్రమైన విషయం ఏమిటంటే, జీవనోపాధి కోసం మరియు ప్రగతి కొరకు పనిచేయడంలో విలువను చూడకపోవడం. కొందరు ఇలా అంటారు, “జీవితం చాలా చిన్నది. మనం ప్రజా ఖర్చుతో ఆహారం పొందవచ్చు కాబట్టి భారమైన పనులతో ఎందుకు బాధపడాలి?” రాష్ట్ర ప్రయోజనాలతో జీవించడం అనేది చెల్లుబాటు అయ్యే వృత్తిపరమైన ఎంపిక కాకూడదు. క్రీస్తు రెండవ రాకడ చాలా దగ్గరగా ఉందని, పని అనవసరమని భావించిన ప్రారంభ తొలి క్రైస్తవ సంఘంలోని  కొంతమంది విశ్వాసుల్లో ఆ ధోరణి ఉండేది. స్తబ్దత మరియు సోమరితనం ఎటువంటి అభివృద్ధిని తీసుకురాలేదు. దేవుని నుండి మనం పొందుకున్న ప్రతిభకు మనం జవాబుదారులం (మత్తయి 25:14-30). పునీత పౌలుడు ఈ విషయంలో ఒక వ్యవహారికసత్తావాది: “ఎవరైనా పని చేయడానికి నిరాకరిస్తే, వారు తినకూడదు” (2 థెస్స 3:10) అని నిర్ధారించాడు.

ధర్మం అనేది సాధారణంగా విపరీత వైపరిత్యాల మధ్య మధ్యస్థాయిగా ఉంటుంది. మనం దీన్ని డబ్బు కోసం శ్రమించే కోరికలకు అన్వయించుకోవాలి. మనకు కొన్ని ప్రాపంచిక వస్తువులు, నివసించడానికి ఒక ఇల్లు మరియు మన జీవితాలను పోషించు కోవడానికి డబ్బు అవసరం. సంపదలు వాటంతటకు అవే విలువైనవి కావు అలాగని విలువ తక్కువవి కూడా కాదు. మనం చూస్తున్నట్లుగా  సృష్టించబడిన ప్రతీ జీవి పుడమిలో పురోగతిని తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తుందో అలాగునే  మనం కూడా మెరుగైన సమాజం కోసం పనిచేయడానికి పిలువబడ్డాము. సంపదలు మంచివే కానీ దేవునిలో ఐక్యత చెందడానికై మన ఆత్మలు కలిగియున్న వేదనను మాత్రం తీర్చలేవు. తత్ఫలితంగా, మనం వాటిని తాము ఉన్నవిధంగానే మరియు బాధ్యతాయుతమైన పురోగతికి ఒక మార్గంగా ఉపయోగించుకోవాలి. డబ్బును బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంధములో అగూర్ అనే అతను, “నాకు పేదరికం లేదా సంపద ఇవ్వకండి, కానీ నా రోజువారీ ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. లేకపోతే, నా దగ్గర చాలా ఉంటే  నిన్ను తిరస్కరించి, ‘ప్రభువు ఎవరు?’ అని అడగవచ్చు లేదా నేను పేదవాడిని అయి దొంగిలించి నా దేవుని నామాన్ని అవమానపరచవచ్చు” (సామెతలు 30: 8-9) అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. అదే విధంగా సొలొమోను రాజు, “కాబట్టి నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నీ సేవకుడికి వివేకవంతమైన హృదయాన్ని దయ చేయుము, తద్వారా నేను మంచి చెడుల మధ్య తేడాను వివేచించగలను” (1 రాజు 3:9) అని ప్రార్థించాడు. అలా మనము మన సంపదల వినియోగార్ధ జ్ఞానము కొరకు ప్రార్ధన చేద్దాం.

"నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తిపరచబడుదురు" (మత్త 5:6)

 

 

Saturday, 26 July 2025

Prayer Brings Wholistic Change Gen 18:20-32; Col 2:12-14; Lk 11:1-13 (17/ C)

 

Prayer Brings Wholistic Change

Gen 18:20-32; Col 2:12-14; Lk 11:1-13 (17/ C)

The last thought of the day will be the first thought of the day.”

 

Luke presents the core teaching of Jesus on prayer in today’s Gospel. The persistence of the neighbor assures that God hears our prayers. Last week, we reflected on the Benedictine rule, emphasizing “prayer and service.” We understood that it needs to be translated into work and work needs to be translated into prayer. Christian prayer is not one-dimensional. It is a holistic and wholistic experience in which our spirit communes, our bodies respond, and our minds are healed. In a world that often divides the spiritual from the physical and the emotional, prayer reintegrates all parts of the human person into a relationship with God. When we kneel to pray like Solomon (1 Kng 8:54), speak our fears, lift our hands in worship, or weep in silence, we bring our whole selves before a God who sees, hears, and welcomes us completely (Ps 33:9). In such prayer, God meets us spiritually, physically, and emotionally transforming us into His image and likeness.

Prayer is often considered more than just a Devotional or ritualistic action or sacrifice that helps us reach the next step in our spiritual journey. Prayer needs to engage not only the spirit, but also the body and the mind, since it brings our entire selves into the presence of the living God (Ps 95:6). Meditative prayer is a space of honesty, healing, and renewal. The Psalms are filled with raw human emotion—joy, fear, anger, grief, longing, and gratitude. David cried, “How long, O Lord?” (Ps 13), and Jesus himself prayed, “My God, My God, why have You forsaken me?” (Lk 22:41; Ps 22). In prayer, there is no space to hide our emotions from God. We are invited to pour out our hearts to him. Paul says, “Do not be anxious about anything… let your requests be made known to God. And the peace of God… will guard your hearts and minds in Christ Jesus” (Phil 4:6-7). When we pray in this meditation, we cast our cares upon the Lord, and he replaces our anxiety with his peace (1 Pet 5:7).  He continues to say, “Be transformed by the renewing of your mind” (Rom 12:2). In God’s presence, through the meditative prayer our thought patterns are reshaped, our perspective is corrected, and our identity as God’s children is reaffirmed with his concerns.

Contemplative or unitive prayer would be culminative. It helps us listen to our emotions, the sufferings of the body, and disciplines the mind with its varied thoughts, transforming the whole person. It builds and strengthens our whole being day by day. From the step of listening to the body-mind, it helps us to listen to the voice of God and experience a mystical union with Him. The Holy Spirit empowers this divine act. Paul writes, “The Spirit helps us in our weakness…interceding for us with groanings too deep for words” (Rom 8:26). Even when we struggle to pray, the Holy Spirit bridges the gap between our frailty and God’s grace. Contemplative prayer brings wholistic change. The disciples asked Jesus, “Lord, teach us to pray” (Lk 11:1). In response, Jesus gave them his prayer—not just as a formula, but as a formation of the heart, mind, and body. Such prayer shapes our desires, plans, and aligns us with God’s will. It draws us into a deeper acceptance of who we are and how we are designed to be in His divine plan for salvation. Lastly, one word…..

“We should pray every day before going to sleep. The subconscious mind is influenced during sleep. That omniscient subconscious mind, which knows all the ways, completes our first thought as soon as we wake up in the morning”. Have a positive thought as you fall in sleep…

ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది ఆది 18:20-32; కొలొ 2:12-14; లూకా 11:1-13 (17/C)

 

ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది

ఆది 18:20-32; కొలొ 2:12-14; లూకా 11:1-13 (17/C)

నేటి చివరి ఆలోచన మరుసటి రోజులోని మొదటి ఆలోచన అవుతుంది.”

 

లూకా నేటి సువార్తలో ప్రార్థనపై యేసు ప్రధాన బోధనను ప్రస్తావించాడు. పొరుగువాని పట్టుదల అనే ఉపమానం దేవుడు మన ప్రార్థనలను తప్పక వింటాడని హామీ ఇస్తుంది. గత వారం, మనము బెనెడిక్టైన్ , "ప్రార్థన మరియు సేవ" అనే ప్రార్ధన నియమాన్ని అర్ధం చేసుకున్నాము. పనిని ప్రార్థనలోనికి మరియు ప్రార్ధనను పనిలోకి అనువదించాల్సిన అవసరం ఉందని మనం అర్థం చేసుకున్నాము. క్రైస్తవ ప్రార్థన ఒకే ఒక్క  డైమెన్షనల్ లేదా పరిమాణాన్ని కలిగి లేదు. ఇది మన ఆత్మలు సంభావించ గలేగే,  శరీరాలు స్పందింగలిగే మరియు మనస్సులు స్వస్థత పొందగలిగే సమగ్రమైన మరియు సంపూర్ణమైన అనుభవమే ప్రార్ధన. తరచుగా ఆధ్యాత్మికతను శారీరక మరియు భావోద్వేగాల నుండి విభజించి వేర్పాటు చేయగలిగే ప్రపంచంలో,  మనిషిలోని అన్ని భాగాలను దేవునితో సంబంధంలోనికి తిరిగి పునఃనిర్మాణం చేయగలిగినదే ప్రార్థన. మనం సొలొమోనులా మోకరిల్లి ప్రార్థించినప్పుడు (1 రాజులు 8:54), మన భయాలను చెప్పినప్పుడు, ఆరాధనలో మన చేతులను ఎత్తినప్పుడు లేదా నిశ్శబ్దంగా విలపించి నపుడు,  ఏడ్చినప్పుడు, మనల్ని పూర్తిగా చూసే, వినే మరియు స్వాగతించే దేవుని ముందు మనల్ని మనం పూర్తిగా అర్పించు కుంటాము (కీర్తన 33:9). అలాంటి ప్రార్థనలో, దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా కలుస్తాడు మరియు భావోద్వేగపరంగా మనల్ని తన స్వరూపం మరియు పోలికలోకి మారుస్తాడు. అది అంతటితో పరిపూర్ణ మవ్వదు. అది భక్తిలో భాగం.

భక్తి ప్రార్థన అనేది తరచుగా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి దశను చేరుకోవడానికి సహాయపడుతుంది. భక్తి లేదా ఆచార సంప్రదాయ లేదా త్యాగ క్రియల కంటే  ఆ తదుపరి దశనే ఎక్కువగా పరిగణించబడుతుంది మన క్రైస్తవ సంప్రదాయ చింతన. ప్రార్థన అనేది ఆత్మను మాత్రమే కాకుండా, శరీరాన్ని మరియు మనస్సును కూడా నిమగ్నం చేయాలి. ఎందుకంటే ఇది మనందరినీ సజీవ దేవుని సన్నిధిలోకి తీసుకువస్తుంది (కీర్తన 95:6). ధ్యాన ప్రార్థన అనేది నిజాయితీ, స్వస్థత మరియు పునరుద్ధరణ స్థలం. పరిశుద్ధగ్రంధ కీర్తనలు - ఆనందం, భయం, కోపం, దుఃఖం, వాంఛ మరియు కృతజ్ఞతల వంటి మానవ భావోద్వేగాలతో ముడిపడి నిండుగా కన్పిస్తాయి. దావీదు, “ఓ ప్రభూ, ఎంతకాలం?” (కీర్తన 13), మరియు యేసు స్వయంగా, “నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” (లూకా 22:41; కీర్తన 22) అని ప్రార్థించారు. ప్రార్థనలో, దేవుని నుండి మన భావోద్వేగాలను దాచడానికి స్థలం లేదు. మన హృదయాలను ఆయనకు కుమ్మరించమని మనం ఆహ్వానం పొందుకున్నాము. పౌలు ఇలా అంటున్నాడు, “దేనిని గూర్చియు చింతించకండి... మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మరియు దేవుని శాంతి... క్రీస్తుయేసునందు మీ హృదయాలను మరియు మనస్సులను కాపాడుతుంది” (ఫిలి 4:6-7). ఈ ధ్యాన ప్రార్ధనలో మనం మన చింతలను ప్రభువుపై వెస్తే ఆయన మన ఆందోళనను తన శాంతితో భర్తీ చేస్తాడు (1 పేతురు 5:7). ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, “మీ మనస్సు నూతనమగుట వలన రూపాంతరం చెందుడి” (రోమా 12:2). దేవుని సన్నిధిలో, ధ్యాన ప్రార్థన ద్వారా మన ఆలోచనా విధానాలు తిరిగి రూపుదిద్దుకుంటాయి. మన దృక్పథం సరిదిద్దబడుతుంది మరియు దేవుని బిడ్డలుగా మన గుర్తింపు ఆయన ఆందోళనలతో తిరిగి ధృవీకరించబడుతుంది.

అంతరంగిక మౌన ధ్యానం లేదా ఐక్య ప్రార్థన అనేది పరాకాష్టగా ఉంటుంది క్రైస్తవ ఆధ్యాత్మిక చింతనలో. ఇది మన భావోద్వేగాలను, శరీర బాధలను వినడానికి సహాయపడుతుంది. వైవిధ్యమైన ఆలోచనలతో నిండిన మనస్సును ఇది క్రమశిక్షణకు గురి చేస్తుంది. వ్యక్తిని మొత్తంగా మార్చివేస్తుంది. ఇది రోజురోజుకూ మన సమస్త ఉనికిని నిర్మించి బలపరుస్తుంది. శరీర-మనస్సును వినడం అనే దశ నుండి, ఇది అతి దురానవున్న దేవుని స్వరాన్ని వినడానికి, ఆయనలో లీనమైపోయిన ఆధ్యాత్మిక ఐక్యతను అనుభవించడానికి మనకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ ఈ దైవిక చర్యకు శక్తినిస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు, "ఆత్మ మన బలహీనతలో మనకు సహాయం చేస్తుంది... మాటల్లో చెప్పలేని మూలుగులతో మన కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది" (రోమా 8:26).  ప్రార్థన చేయడానికి మనం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా, పరిశుద్ధాత్మ మన బలహీనతకు మరియు దేవుని కృపకు మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. అంతరంగిక మౌన ధ్యాన ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది. శిష్యులు యేసును, "ప్రభువా, ప్రార్థన చేయడం మాకు నేర్పండి" అని అడిగారు (లూకా 11:1). ప్రతిస్పందనగా, యేసు వారికి తన ప్రార్థననే  ఇచ్చాడు—కేవలం ఒక సూత్రంగా కాకుండా, హృదయం, మనస్సు మరియు శరీరపు నిర్మాణంగా! అలాంటి ప్రార్థన మన కోరికలను, ప్రణాళికలను రూపొందిస్తుంది మరియు దేవుని చిత్తంతో మనల్ని సమలేఖనం చేస్తుంది. ఇది మన స్థితి గతులను మనకు ఎరుక పరచడమే  కాకుండా మోక్షానికి మరియు మన దైవిక ప్రణాళికలో మనం ఎలా రూపొందించబడ్డామో లోతుగా మనం అంగీకరించుకొనేలా చేస్తుంది. చివరిగా ఒక మాట ..........

మనం ప్రతిరోజూ నిద్రపోయే ముందు ప్రార్థన చేయాలి. నిద్రలో ఉపచేతన మనస్సు (sub conscious) ప్రభావితమవుతుంది. అన్ని విధాలుగా తెలిసిన ఆ సర్వజ్ఞి(జ్ఞుడైన) ఉపచేతన మనస్సు, మనం ఉదయం మేల్కొన్న వెంటనే మన మొదటి ఆలోచనను పరిపూర్తి చేస్తుంది”. నిద్రలోనికి జారుకొనే ముందు ఒక చక్కటి పాసిటివ్ ఆలోచనలో వుండండి.

Friday, 18 July 2025

శ్రేయస్సుకు మార్గం శ్రద్ధ ఆది 18:1-10a; కొలస్సి 1:24-28; లూకా 10:38-42 (16 / C)

 

శ్రేయస్సుకు మార్గం శ్రద్ధ

ఆది 18:1-10a; కొలస్సి 1:24-28; లూకా 10:38-42 (16 / C)

మనం చదివిన దాని గురించి ధ్యానం చేయడం వల్ల దానిని మన స్వంతం చేసుకోవడానికి సహాయపడుతుంది” (CCC 2706)

 

మార్త మరియల ఇంట్లో యేసు కథ మంచి సమరయుని కథను పూర్తి చేస్తుంది. సమరయుని కథ “ఒక నిర్దిష్ట మనుష్యుడు” అనే పదాలతో ప్రారంభమవుతుంది. నేటి పఠనం “ఒక నిర్దిష్ట స్త్రీ” అనే పదాలతో ప్రారంభమవుతుంది. మరియ అనే స్త్రీ, సమరయుని వలే సమాజంలో అణగదొక్కబడిన వ్యక్తి. ఇద్దరి జీవితాల్లో, యేసు తన కాలంలోని సామాజిక సంప్రదాయాలను ఉల్లంఘిన చేసాడు. ఒక సమరయుడు యూదు పొరుగువారికి మాతృక కానట్లే, ఒక స్త్రీ పురుషులతో కలిసి అందునా గురువు పాదాల చెంత కూర్చోనలేదు. అయినప్పటికీ, రెండు కథలు ఒక శిష్యుడు దేవుని ప్రేమ (మరియ) మరియు పొరుగువారి (సమరయుని) ఎడల ప్రేమ అనే ద్వంద్వ ఆజ్ఞను ఎలా నెరవేర్చాలో ఉదాహరణగా చూపిస్తాయి.

కానీ శిష్యరికపు విలువను నొక్కి చెప్పే నేటి సువార్త స్వరంలో స్వల్ప వ్యత్యాసాన్ని మనం మర్చి పోకూడదు. యేసు బేతనియలోని మార్త మరియల ఇంటికి వెళ్లడానికి ఇష్టపడ్డాడు మరియు వారి సహృదయ  ఆతిథ్యాన్ని ఆస్వాదించాడు. ఈ క్లుప్త సమావేశంలో, మార్త మరియు మరియలలో రెండు వేర్వేరు స్వభావాలను మనం చూస్తున్నాము. మార్త సేవ చేయడానికి ఇష్టపడింది. యేసు కోసం ఆమె ఆత్రుతగా చేసే పరిచర్య విధానంలో, ఆమె ఓర్పును నెమ్మదిని కోల్పోయింది. మరియ, తన సరళమైన మరియు నమ్మకమైన పద్ధతిలో, యేసు పాదాల వద్ద శ్రద్ధగా కూర్చోని అతని వాక్కు కొరకు వేచి ఉంది. మార్త భోజనం సిద్ధం చేయడంలో ఎక్కువ ప్రయత్నం చేసినప్పటికీ, మరియ తన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడో బాగా తెలుసుకున్నది. ఆమె తన మౌన ధ్యానపరంపర లేదా అంతఃదృష్టి యేసు సందర్శనకు కలిగిన ప్రధాన కారణాన్ని సహజంగానే గ్రహించింది. తనను వినేవారిని వెతుక్కున్నాడు యేసు. తన గోడును ఆలకించేవారి హృదయాలను కోరుకున్నాడు కృపామయుడు.  ఆయన అక్కడ ఉండడానికి కాదు, ఇవ్వడానికి, సేవలందుకోవడానికి కాదు, సేవ చేయడానికి వచ్చాడు. కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎదుటివారి గోడును పెడచెవిన పెట్టి మన ఇష్టాఇష్టాలను వారిపై రుద్ది క్రీస్తు కోరుకొనే మరియ వ్యక్తిత్వాన్ని కోల్పోతాం.

అలాగని "కష్టపడి చేసే ప్రతి పని లాభాన్ని తెస్తుంది, కానీ కేవలం మాటలు పేదరికానికి దారితీస్తాయి" (సామెతలు 14:23) అనే లేఖనాత్మక ప్రకటనను యేసు తిరస్కరించనూ లేదు. నేటి వ్యాపార వాణిజ్య సమాజం పోటీతత్వ సాధనకు భారీ ప్రాధాన్యత ఇస్తుంది. ఇది గుర్తించదగిన ఫలితాలకే ప్రాముఖ్యమైనది. ఉత్పత్తి మరియు అమ్మకాల లక్ష్యాలు నిర్ణయించబడ్డాయి మరియు వాటిని చేరుకున్న వారికి మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది. ఆ గందరగోళ ఆందోళనలో  మనల్ని శ్రద్ధగా వాక్యాన్ని వినకుండా మరియు ప్రభువుకు మన అవిభక్త శ్రద్ధ ఇవ్వకుండా నిరోధిస్తుంది. తన కొద్ది పాటి నిర్ణీత సమయంలో ఏదో ఒకటి చెప్పాలని తనకు ఉంది అందుకు వారు మనం ఆయన మాటను వినాలి. ఆయన నమ్మదగినవాడు మరియు మనకు ఉన్న ఏ అవసరాన్నైనా సరే తీర్చగలడు. కాబట్టి మన ఆందోళనలను ఆయనకు ఇవ్వాలని ప్రభువు మనలను  ఆజ్ఞాపించాడు (మత్త 11:28). ఆయన కృప అనవసరమైన చింతలు మరియు అశ్రద్ధల నుండి మనల్ని విడిపిస్తుంది. మార్త సహాయాన్ని ఆయన తిరస్కరిస్తునట్లు మనకు కనిపించినప్పటికీ, మనం మరియ వలే  ఉండాలని, మన హృదయాలలో మాత్రమే కాకుండా, మన దైనందిన పరిస్థితులలో కూడా ఆయనకు స్థానం ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు (ప్రకటన 3:19-20). మనం చేసే ప్రతిదానిలోనూ ఆయనను గౌరవిస్తాము, అది మనకు ఆయన ఇచ్చిన బహుమతి (1 దినవృత్తా 29:14). మనం ఏమి చేసినా, మాటలో లేదా క్రియలో దేవుణ్ణి మహిమపరచమని భక్త పౌలుడు మనల్ని కోరుతున్నాడు (కొల 3:17). పనిని ప్రార్థనగా మార్చాలి (పునీత బెనెడిక్టు). ప్రార్ధననుండి పని చేయడానికి శక్తిని పొందుకోవాలి.

అబ్రహాం తన ఇంటి గుమ్మాన్ని తెరిచి ముగ్గురు తెలియని ప్రయాణికులను ఆహ్వానించినప్పుడు, అతను అదోనాయ్ ను   స్వాగతించాడని లేఖనం మనకు చెబుతుంది.  తన దయగల ఆతిథ్యానికి అనుకూలంగా ఆశీర్వాదం పొందుకున్నాడు (ఆది 18:1-10; హెబ్రీ 13:2). దివ్య సత్ర్పసాదంలో క్రీస్తు నిజమైన ఉనికిని మనం ఆస్వాదిద్దాం. దివ్యమందసం అనేది కథోలికులకు ఉన్న గొప్ప నిధి. పునీత జాన్ పాల్ II, తన ఒక నిర్దిస్థ ప్రకటన (ఎన్సైక్లికల్) “సంఘం తన జీవితాన్ని యూకరిస్ట్ నుండి తీసుకుంటుంది” అనే బోధనలో,మన ప్రభువు మనకు చెప్పడానికి తనకు చాలా విషయాలు ఉన్నాయి. మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువే! కాబట్టి, యేసును మళ్ళీ కనుగొనడంలో మరియు ఆయనలో మరోసారి మనల్ని మనం కనుగొనడంలో సహాయపడటానికి మనం నిశ్శబ్దం మరియు శాంతి క్షణాలను వెతుకుదాం. యేసుక్రీస్తు ఈ రోజు మనల్ని మన “ఉత్తమ భాగాన్ని” ఎంచుకోవడానికి (లూకా 10:42) ఎంపికచేసుకోవాలని ఆహ్వానిస్తున్నాడు” అని వ్రాశాడు.

ప్రభువు మాటను వినడం అంటే శాశ్వతమైన మరియు మన దైనందిన చర్యలకు అర్థాన్నిచ్చే శక్తిని వినడం” (బెనెడిక్టు 16 వ)

Diligence as a Pathway to Prosperity Gen 18:1-10a; Col 1:24-28; Lk 10:38-42 (16 / C)

 

Diligence as a Pathway to Prosperity

Gen 18:1-10a; Col 1:24-28; Lk 10:38-42 (16 / C)

To meditate on what we read helps us to make it our own by confronting it with ourselves” (CCC 2706)

 

The story of Jesus in the home of Martha and Mary complements the story of the Good Samaritan. The story of the Samaritan opens with the words “a certain man.” Today’s reading opens with the words “a certain woman.” Mary, a woman, is a marginalized person in society, like the Samaritan. In the lives of both, Jesus breaks with the social conventions of his time. Just as a Samaritan would not be a model for neighborliness, so a woman would not sit with the men around the feet of a teacher. Yet both stories exemplify how a disciple is to fulfill the dual command love of God (Mary) and love of neighbor (the Samaritan).

But there is a slight variation in the tone of the Gospel that highlights the value of discipleship. Jesus loved to visit the home of Martha and Mary at Bethany and enjoyed their gracious hospitality. In this brief encounter, we see two very different temperaments in Martha and Mary. Martha loved to serve, but in her anxious manner of waiting on Jesus, she caused unrest. Mary, in her simple and trusting manner, waited on Jesus by sitting attentively at his feet. While Martha made the greater effort at preparing food, Mary knew better what he expected of her. Does Jesus deny the importance of work in giving priority to prayer? Her contemplative intuition grasped the main reason for Jesus’ visit instinctively. He was there not to receive but to give, not to be served but to serve.

He does not deny Scriptural statement, “All hard work brings a profit, but mere talk leads only to poverty” (Pro 14:23). He had something to say, and they needed to listen to him. The commercial society of today places a huge premium on achievement. It is tangible results that count. Production and sales targets are set for and only those who meet them are rewarded. Anxiety and preoccupation keep us from listening and giving the Lord our undivided attention. The Lord bids us to give him our concerns and anxieties because he is trustworthy and able to meet any need we have. His grace frees us from needless concerns and preoccupation. Although he does not deny the help of Martha, the Lord wants us to be more like Mary, giving place for him, not only in our hearts, and in our daily circumstances (Rev 3:19-20). We honor him in everything we do, that is his gift for us (1 Chr 29:14). Paul urges us to give God glory in whatever we do, in word or deed (Col 3:17). Work needs to be translated into prayer (St Benedict).

Scripture tells us that when Abraham opened his home and welcomed three unknown travelers, he welcomed Adonai, who blessed him favorably for his gracious hospitality (Gen 18:1-10; Heb 13:2). Let us enjoy the real presence of Christ in the Eucharist. The Tabernacle is the greatest treasure we Catholics have. Saint John Paul II, in his encyclical “The Church draws her life from the Eucharist,” wrote, “Our Lord has many things to tell us, many more than we think. Let us, therefore, seek those moments of silence and peace to help us find Jesus again and, in Him, to find ourselves once more. Jesus Christ invites us today to take this option: to choose “the better part” (Lk 10:42). And we seek strength in prayer to produce fruitful work.

Listening to the word of the Lord, which is eternal, gives meaning to our daily actions.” (Benedict XVI)

 

Saturday, 12 July 2025

Am I a neighbor to myself? Dt 30:10-14; Col 1:15-20; Lk10:25-37 (15 / C)

 

Am I a neighbor to myself?

Dt 30:10-14; Col 1:15-20; Lk10:25-37 (15 / C)

“All of us lived according to our natural desires, and we were naturally bound to suffer God’s wrath” (Divine Office)

 

The Samaritans of the hilly region north of Judea were an outcast group in first-century Palestine. For intermarrying with the occupying Assyrians centuries before, the Jews considered them a mongrel breed. Further, for building their own temple on Mount Gerizim (Jn 4:20-22), they were considered a heretical form of Judaism. The Parable of the Good Samaritan (Lk 10:25-37) is rich in symbolic language that has inspired both theological reflection and spiritual interpretation throughout Christian tradition. Before drawing a lesson from this parable, let us understand the spiritual and theological meanings.  

St. Augustine emphasized that the story of the man attacked by robbers on the road from Jerusalem to Jericho illustrates humanity’s fall from grace, descending from spiritual Jerusalem to Jericho. Jerusalem is a Holy city/Heaven/, and the presence of God. Jericho city, in a valley, is worldly life/spiritual decline. Robbers are sin, Satan, and evil powers that strip humanity of grace. Wounded and left half-dead, injured is Original Sin. Humanity is spiritually alive but wounded and near death. Priest and Levite symbolize the Law and Old Covenant, unable to save humanity completely. Samaritan is an outcast, a rejected one who shows true mercy and compassion. Oil and wine are the healing substances in Sacramental healing and grace. A beast or donkey carrying the man symbolizes the Church carrying the sinner to healing or restoration by Jesus. The innkeeper entrusted with the wounded man is a pastor through the Holy Spirit until Christ returns. St Ambrose interpreted the point of the two denarii payment to the innkeeper as Christ’s gracious Word. And the return of the Samaritan is the second coming of Christ.

The parable reminds us not just of the call to love our neighbor but of Christ’s mercy toward the fallen human race. It calls the Church to continue the work of the Good Samaritan, healing and nurturing the wounded with spiritual care. The Good Samaritan did not base his actions on written law.  He based his actions on the law within his heart, the law of love.  As a young priest, Saint John Paul II developed a style as a confessor and counselor that challenged people to look within themselves.  They had the truth.  They had to recognize it and live it. We know what is right.  We must act on our conscience. In the parable of Good Samaritan, we are presented with a young man who is looking to serve God.  He knows that we need to love the Lord our God with our whole minds, hearts and souls, and love our neighbor as ourselves, but he wants to cover all bases and asks, “Who is my neighbor?”

Saint JP II wrote: “Love is not fulfilling oneself using another, even in a marital bond.  Love is giving oneself to another, for the good of the other, and receiving the other as a gift.” We must (i) help people even when they have brought their trouble to themselves, as the traveler has done. (ii) Any person who is in need is our neighbor. Our help must be as wide as the love of God. (iii) The help must be practical and not consist merely in feeling sorry. Although the Priest and the Levite felt a pang of pity for the wounded did nothing. True compassion must result in deeds. Now, who is my neighbor traveling from Jerusalem to Jericho, sunrise to sunset; heaven to hell?

 

“The Lord is faithful in all his words and loving in all his deeds. Alleluia” (Divine Office)