AletheiAnveshana: ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది ఆది 18:20-32; కొలొ 2:12-14; లూకా 11:1-13 (17/C)

Saturday, 26 July 2025

ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది ఆది 18:20-32; కొలొ 2:12-14; లూకా 11:1-13 (17/C)

 

ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది

ఆది 18:20-32; కొలొ 2:12-14; లూకా 11:1-13 (17/C)

నేటి చివరి ఆలోచన మరుసటి రోజులోని మొదటి ఆలోచన అవుతుంది.”

 

లూకా నేటి సువార్తలో ప్రార్థనపై యేసు ప్రధాన బోధనను ప్రస్తావించాడు. పొరుగువాని పట్టుదల అనే ఉపమానం దేవుడు మన ప్రార్థనలను తప్పక వింటాడని హామీ ఇస్తుంది. గత వారం, మనము బెనెడిక్టైన్ , "ప్రార్థన మరియు సేవ" అనే ప్రార్ధన నియమాన్ని అర్ధం చేసుకున్నాము. పనిని ప్రార్థనలోనికి మరియు ప్రార్ధనను పనిలోకి అనువదించాల్సిన అవసరం ఉందని మనం అర్థం చేసుకున్నాము. క్రైస్తవ ప్రార్థన ఒకే ఒక్క  డైమెన్షనల్ లేదా పరిమాణాన్ని కలిగి లేదు. ఇది మన ఆత్మలు సంభావించ గలేగే,  శరీరాలు స్పందింగలిగే మరియు మనస్సులు స్వస్థత పొందగలిగే సమగ్రమైన మరియు సంపూర్ణమైన అనుభవమే ప్రార్ధన. తరచుగా ఆధ్యాత్మికతను శారీరక మరియు భావోద్వేగాల నుండి విభజించి వేర్పాటు చేయగలిగే ప్రపంచంలో,  మనిషిలోని అన్ని భాగాలను దేవునితో సంబంధంలోనికి తిరిగి పునఃనిర్మాణం చేయగలిగినదే ప్రార్థన. మనం సొలొమోనులా మోకరిల్లి ప్రార్థించినప్పుడు (1 రాజులు 8:54), మన భయాలను చెప్పినప్పుడు, ఆరాధనలో మన చేతులను ఎత్తినప్పుడు లేదా నిశ్శబ్దంగా విలపించి నపుడు,  ఏడ్చినప్పుడు, మనల్ని పూర్తిగా చూసే, వినే మరియు స్వాగతించే దేవుని ముందు మనల్ని మనం పూర్తిగా అర్పించు కుంటాము (కీర్తన 33:9). అలాంటి ప్రార్థనలో, దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా కలుస్తాడు మరియు భావోద్వేగపరంగా మనల్ని తన స్వరూపం మరియు పోలికలోకి మారుస్తాడు. అది అంతటితో పరిపూర్ణ మవ్వదు. అది భక్తిలో భాగం.

భక్తి ప్రార్థన అనేది తరచుగా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి దశను చేరుకోవడానికి సహాయపడుతుంది. భక్తి లేదా ఆచార సంప్రదాయ లేదా త్యాగ క్రియల కంటే  ఆ తదుపరి దశనే ఎక్కువగా పరిగణించబడుతుంది మన క్రైస్తవ సంప్రదాయ చింతన. ప్రార్థన అనేది ఆత్మను మాత్రమే కాకుండా, శరీరాన్ని మరియు మనస్సును కూడా నిమగ్నం చేయాలి. ఎందుకంటే ఇది మనందరినీ సజీవ దేవుని సన్నిధిలోకి తీసుకువస్తుంది (కీర్తన 95:6). ధ్యాన ప్రార్థన అనేది నిజాయితీ, స్వస్థత మరియు పునరుద్ధరణ స్థలం. పరిశుద్ధగ్రంధ కీర్తనలు - ఆనందం, భయం, కోపం, దుఃఖం, వాంఛ మరియు కృతజ్ఞతల వంటి మానవ భావోద్వేగాలతో ముడిపడి నిండుగా కన్పిస్తాయి. దావీదు, “ఓ ప్రభూ, ఎంతకాలం?” (కీర్తన 13), మరియు యేసు స్వయంగా, “నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” (లూకా 22:41; కీర్తన 22) అని ప్రార్థించారు. ప్రార్థనలో, దేవుని నుండి మన భావోద్వేగాలను దాచడానికి స్థలం లేదు. మన హృదయాలను ఆయనకు కుమ్మరించమని మనం ఆహ్వానం పొందుకున్నాము. పౌలు ఇలా అంటున్నాడు, “దేనిని గూర్చియు చింతించకండి... మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మరియు దేవుని శాంతి... క్రీస్తుయేసునందు మీ హృదయాలను మరియు మనస్సులను కాపాడుతుంది” (ఫిలి 4:6-7). ఈ ధ్యాన ప్రార్ధనలో మనం మన చింతలను ప్రభువుపై వెస్తే ఆయన మన ఆందోళనను తన శాంతితో భర్తీ చేస్తాడు (1 పేతురు 5:7). ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, “మీ మనస్సు నూతనమగుట వలన రూపాంతరం చెందుడి” (రోమా 12:2). దేవుని సన్నిధిలో, ధ్యాన ప్రార్థన ద్వారా మన ఆలోచనా విధానాలు తిరిగి రూపుదిద్దుకుంటాయి. మన దృక్పథం సరిదిద్దబడుతుంది మరియు దేవుని బిడ్డలుగా మన గుర్తింపు ఆయన ఆందోళనలతో తిరిగి ధృవీకరించబడుతుంది.

అంతరంగిక మౌన ధ్యానం లేదా ఐక్య ప్రార్థన అనేది పరాకాష్టగా ఉంటుంది క్రైస్తవ ఆధ్యాత్మిక చింతనలో. ఇది మన భావోద్వేగాలను, శరీర బాధలను వినడానికి సహాయపడుతుంది. వైవిధ్యమైన ఆలోచనలతో నిండిన మనస్సును ఇది క్రమశిక్షణకు గురి చేస్తుంది. వ్యక్తిని మొత్తంగా మార్చివేస్తుంది. ఇది రోజురోజుకూ మన సమస్త ఉనికిని నిర్మించి బలపరుస్తుంది. శరీర-మనస్సును వినడం అనే దశ నుండి, ఇది అతి దురానవున్న దేవుని స్వరాన్ని వినడానికి, ఆయనలో లీనమైపోయిన ఆధ్యాత్మిక ఐక్యతను అనుభవించడానికి మనకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ ఈ దైవిక చర్యకు శక్తినిస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు, "ఆత్మ మన బలహీనతలో మనకు సహాయం చేస్తుంది... మాటల్లో చెప్పలేని మూలుగులతో మన కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది" (రోమా 8:26).  ప్రార్థన చేయడానికి మనం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా, పరిశుద్ధాత్మ మన బలహీనతకు మరియు దేవుని కృపకు మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. అంతరంగిక మౌన ధ్యాన ప్రార్థన సంపూర్ణ మార్పును తెస్తుంది. శిష్యులు యేసును, "ప్రభువా, ప్రార్థన చేయడం మాకు నేర్పండి" అని అడిగారు (లూకా 11:1). ప్రతిస్పందనగా, యేసు వారికి తన ప్రార్థననే  ఇచ్చాడు—కేవలం ఒక సూత్రంగా కాకుండా, హృదయం, మనస్సు మరియు శరీరపు నిర్మాణంగా! అలాంటి ప్రార్థన మన కోరికలను, ప్రణాళికలను రూపొందిస్తుంది మరియు దేవుని చిత్తంతో మనల్ని సమలేఖనం చేస్తుంది. ఇది మన స్థితి గతులను మనకు ఎరుక పరచడమే  కాకుండా మోక్షానికి మరియు మన దైవిక ప్రణాళికలో మనం ఎలా రూపొందించబడ్డామో లోతుగా మనం అంగీకరించుకొనేలా చేస్తుంది. చివరిగా ఒక మాట ..........

మనం ప్రతిరోజూ నిద్రపోయే ముందు ప్రార్థన చేయాలి. నిద్రలో ఉపచేతన మనస్సు (sub conscious) ప్రభావితమవుతుంది. అన్ని విధాలుగా తెలిసిన ఆ సర్వజ్ఞి(జ్ఞుడైన) ఉపచేతన మనస్సు, మనం ఉదయం మేల్కొన్న వెంటనే మన మొదటి ఆలోచనను పరిపూర్తి చేస్తుంది”. నిద్రలోనికి జారుకొనే ముందు ఒక చక్కటి పాసిటివ్ ఆలోచనలో వుండండి.

No comments:

Post a Comment