AletheiAnveshana: నాకు నేను పొరుగువాడినా? ద్వితీ 30:10-14; కొల 1:15-20; లూకా 10:25-37 (15 / C)

Saturday, 12 July 2025

నాకు నేను పొరుగువాడినా? ద్వితీ 30:10-14; కొల 1:15-20; లూకా 10:25-37 (15 / C)

 

నాకు నేను  పొరుగువాడినా?

ద్వితీ 30:10-14; కొల 1:15-20; లూకా 10:25-37 (15 / C)

మనమందరం మన సహజ కోరికల ప్రకారం జీవించాము. సహజంగానే దేవుని కోపాన్ని అనుభవించవలసి వచ్చింది” (Divine Office)

 

యూదయకు ఉత్తరాన ఉన్న కొండ ప్రాంతంలోని సమరయులు మొదటి శతాబ్దపు పాలస్తీనాలో బహిష్కరించబడిన ఒక సమూహం. శతాబ్దాల క్రితం ఆక్రమించిన అస్సీరియన్లతో వివాహ సంబంధాలు పెట్టుకున్నందుకు యూదులు వారిని ఒక మతభ్రష్ట జాతిగా భావించారు. ఇంకా, గెరిజిము పర్వతంపై వారి స్వంత ఆలయాన్ని నిర్మించినందుకు (యోహాను 4:20-22) యూదు మత విశ్వాసాల రూపంగా  వెలియవేయబడిన వారు సమరియ ప్రాంత నివాస యూదులే! అటువంటి వారిని కూడా యేసు తన చెంతకు ఆహ్వానించాడు. మంచి సమరయుని ఉపమానం (లూకా 10:25–37) క్రైస్తవ సంప్రదాయం అంతటా వేదాంతపరమైన ప్రతిబింబంగానూ, ఆధ్యాత్మిక వివరణలను ప్రేరేపించిన సంకేత భాషతో నిండి ఉంది. ఈ ఉపమానం నుండి పాఠం నేర్చుకునే ముందు ఆధ్యాత్మిక వేదాంతపరమైన అర్థాలను గ్రహించుదాం.

దొంగల దారిలో యేరూసలేం నుండి యెరిఖోకు మనిషి ప్రయాణించడం అంటే దేవుని కృప నుండి జారి పడిపోయిన మానవతా జీవితం అనీ, ఆధ్యాత్మిక యెరూసలేం నుండి పాపపు పట్టణమైన యెరిఖోకు దిగజారి పడిపోవడం అని పునీత అగుస్టీను నొక్కిచెప్పాడు. యేరూసలేం అనేది పవిత్ర నగరం/స్వర్గం/దేవుని సాన్నిధ్యం. లోయలో ఉన్న యెరిఖో నగరం ప్రాపంచిక జీవితం/ఆధ్యాత్మిక క్షీణత. దొంగలు అంటే పాపం. సాతాను మరియు మానవాళి కృపను తొలగించే దుష్ట శక్తులు. గాయపడి సగం చనిపోయి పడివుండడం అనేది జన్మ పాపం. మానవతా జీవితం ఆధ్యాత్మికంగా సజీవంగా ఉంటుంది కానీ గాయపడి మరణానికి దగ్గరగా ఉంటుంది. యాజకుడు మరియు లేవీయుడు మానవాళిని పూర్తిగా రక్షించలేని ధర్మశాస్త్రం మరియు పాత నిబంధనను సూచిస్తున్నారు. యేసు ఉపమానములోని సమరీయుడు అనేది నిజమైన దయాకనికరములను చూపించ గలిగే బహిష్కరించబడిన లేదా వెలివేయబడిన ఒక వ్యక్తి. నూనె మరియు ద్రాక్షారసం అనేది దివ్య సంస్కారముల వైద్యం మరియు వైద్యం చేయగలిగే పదార్థాలు. మృగం లేదా గాడిద అనేది యేసు ద్వారా పాపిని స్వస్థపరచడానికి లేదా పునరుద్ధరించడానికి క్రీస్తు సంఘంలోనికి మోసుకెళుతున్న సూచనగా వుంది. సత్రం మరియు దాని నిర్వాహకుడు క్రీస్తు తిరిగి వచ్చే వరకు పరిశుద్ధాత్మ ద్వారా జనావళిని నడిపించడానికి ఎన్నుకోబడిన పరిచారకులు. సత్రం నిర్వాహకుడికి రెండు దినారాలు చెల్లించడం అనే అంశాన్ని క్రీస్తు దయగల వాక్యమనీ మరియు సమరియుడు తిరిగి రావడం అనేది క్రీస్తు రెండవ రాకడపు నిర్ణితమని పునీత ఆంబ్రోసు అర్థం చేసుకున్నాడు.

ఈ ఉపమానం మన పొరుగువారిని ప్రేమించాలనే పిలుపును మాత్రమే కాకుండా, పడిపోయిన మానవ జాతి పట్ల క్రీస్తు దయను కూడా గుర్తు చేస్తుంది. మంచి సమరయుని పనిని కొనసాగించమని, గాయపడిన వారిని ఆధ్యాత్మిక సంరక్షణతో స్వస్థపరచడం మరియు పోషించడం వంటి పరిచర్యలను కొనసాగించమని ఈ ఉపమానం ద్వారా తన సంఘాన్ని యేసు పిలుస్తున్నాడు. మంచి సమరయుని చర్యలు వ్రాతపూర్వక చట్టంపై ఆధారపడలేదు. అతను తన చర్యలను తన హృదయ చట్టం, ప్రేమ చట్టంపై ఆధారితం చేసుకున్నాడు. ఒక యువ గురువుగా, పునీత రెండవ జాన్ పౌలు గారు, ఒక మంచి పాప సంకిర్తనను అందించగలిగే  మరియు సలహాదారుడిగానూ  విశ్వాసులను తమలో తామునుతొంగి  చూసుకోవాలని మరియు దానిని సవాలు చేయగలిగే శైలిని అభివృద్ధి చేసుకోవాలని హెచ్చరించేవాడు. వారిలో సత్యం ఉంది. వారు దానిని గుర్తించి జీవించాలని వారించే వాడు. అలాగునే మనకు కూడా ఏది సరైనదో ఇపుడు తెలుసు. మనం మన మనస్సాక్షిపై కఠిన చర్య తీసుకోవాలి. మంచి సమరయుని ఉపమానంలో, దేవుణ్ణి సేవించాలని కోరుకునే ఒక యువకుడు మనకు కనిపిస్తున్నాడు. మన దేవుడైన ప్రభువును మన పూర్ణ మనస్సులతో, హృదయాలతో మరియు ఆత్మలతో ప్రేమించాలని మరియు మన పొరుగువారిని మనలాగే ప్రేమించాలని అతనికి తెలుసు, కానీ అతను యూదు మత  బోధలన్నింటికీ మిన్నగా జీవిస్తున్నాట్లు యేసు గ్రహించలాని “నా పొరుగువాడు ఎవడు?" అని అడుగుతున్నాడు.

పునీత రెండవ జాన్ పౌలు గారు ఇలా వ్రాశాడు: “వైవాహిక బంధంలోనైనా సరే మరొకరిని ఒక వస్తువువుగా వాడుకొనే  ప్రేమ తనను తాను సంతృప్తిపరచదు. ప్రేమ అంటే మరొకరి మంచి కోసం తనను తాను మరొకరికి ఇచ్చుకోవడం మరియు మరొకరిని బహుమతిగా స్వీకరించడం.” సమరియ ప్రయాణికుడు చేసినట్లుగా, (i) విశ్వాసులు తమ తమ కష్టాలను తమపైకి తెచ్చుకున్నప్పుడు కూడా మనం సహాయం చేయాలి. (ii) అవసరంలో ఉన్న ఏ వ్యక్తి అయినా మన పొరుగువాడే. మన సహాయం దేవుని ప్రేమ వలె విస్తృతంగా ఉండాలి. (iii) సహాయం ఆచరణాత్మకంగా ఉండాలి కానీ కేవలం జాలిపడటంలో మాత్రమే ఉండకూడదు. గాయపడిన వారి పట్ల యాజకుడు మరియు లేవీయుడు జాలిగా భావించినప్పటికీ ఏమీ చేయలేకపోయారు. నిజమైన కరుణ అనేది దయాకనికర పనులకు దారితీయాలి. ఇప్పుడు యేరూసలేం నుండి యెరిఖోకు; సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు; స్వర్గం నుండి నరకానికి ప్రయాణించే “నా పొరుగువాడు ఎవరు”?

 

ప్రభువు తన మాటలన్నిటిలో నమ్మకమైనవాడు. తన పనులన్నిటిలో ప్రేమగలవాడు. అల్లెలూయా” (Divine Office)

No comments:

Post a Comment