శ్రేయస్సుకు మార్గం శ్రద్ధ
ఆది 18:1-10a; కొలస్సి 1:24-28; లూకా 10:38-42 (16 / C)
“మనం చదివిన దాని గురించి ధ్యానం చేయడం వల్ల దానిని మన
స్వంతం చేసుకోవడానికి సహాయపడుతుంది”
(CCC 2706)
మార్త మరియల ఇంట్లో యేసు కథ మంచి
సమరయుని కథను పూర్తి చేస్తుంది. సమరయుని కథ “ఒక నిర్దిష్ట మనుష్యుడు” అనే పదాలతో
ప్రారంభమవుతుంది. నేటి పఠనం “ఒక నిర్దిష్ట స్త్రీ” అనే పదాలతో ప్రారంభమవుతుంది.
మరియ అనే స్త్రీ, సమరయుని వలే సమాజంలో అణగదొక్కబడిన
వ్యక్తి. ఇద్దరి జీవితాల్లో, యేసు తన కాలంలోని
సామాజిక సంప్రదాయాలను ఉల్లంఘిన చేసాడు. ఒక సమరయుడు యూదు పొరుగువారికి మాతృక
కానట్లే, ఒక స్త్రీ పురుషులతో కలిసి అందునా
గురువు పాదాల చెంత కూర్చోనలేదు. అయినప్పటికీ, రెండు కథలు ఒక శిష్యుడు దేవుని ప్రేమ (మరియ) మరియు
పొరుగువారి (సమరయుని) ఎడల ప్రేమ అనే ద్వంద్వ ఆజ్ఞను ఎలా నెరవేర్చాలో ఉదాహరణగా
చూపిస్తాయి.
కానీ శిష్యరికపు విలువను నొక్కి
చెప్పే నేటి సువార్త స్వరంలో స్వల్ప వ్యత్యాసాన్ని మనం మర్చి పోకూడదు. యేసు
బేతనియలోని మార్త మరియల ఇంటికి వెళ్లడానికి ఇష్టపడ్డాడు మరియు వారి సహృదయ ఆతిథ్యాన్ని ఆస్వాదించాడు. ఈ క్లుప్త సమావేశంలో, మార్త మరియు మరియలలో రెండు
వేర్వేరు స్వభావాలను మనం చూస్తున్నాము. మార్త సేవ చేయడానికి ఇష్టపడింది. యేసు కోసం
ఆమె ఆత్రుతగా చేసే పరిచర్య విధానంలో, ఆమె ఓర్పును నెమ్మదిని కోల్పోయింది. మరియ, తన సరళమైన మరియు నమ్మకమైన
పద్ధతిలో, యేసు పాదాల వద్ద శ్రద్ధగా కూర్చోని
అతని వాక్కు కొరకు వేచి ఉంది. మార్త భోజనం సిద్ధం చేయడంలో ఎక్కువ ప్రయత్నం
చేసినప్పటికీ, మరియ తన నుండి ఆయన ఏమి
ఆశిస్తున్నాడో బాగా తెలుసుకున్నది. ఆమె తన మౌన ధ్యానపరంపర లేదా అంతఃదృష్టి యేసు
సందర్శనకు కలిగిన ప్రధాన కారణాన్ని సహజంగానే గ్రహించింది. తనను వినేవారిని
వెతుక్కున్నాడు యేసు. తన గోడును ఆలకించేవారి హృదయాలను కోరుకున్నాడు కృపామయుడు. ఆయన అక్కడ ఉండడానికి కాదు, ఇవ్వడానికి, సేవలందుకోవడానికి కాదు, సేవ చేయడానికి వచ్చాడు. కొన్ని
కొన్ని సందర్భాలలో మనం ఎదుటివారి గోడును పెడచెవిన పెట్టి మన ఇష్టాఇష్టాలను వారిపై
రుద్ది క్రీస్తు కోరుకొనే మరియ వ్యక్తిత్వాన్ని కోల్పోతాం.
అలాగని "కష్టపడి చేసే ప్రతి పని లాభాన్ని
తెస్తుంది, కానీ కేవలం మాటలు
పేదరికానికి దారితీస్తాయి" (సామెతలు 14:23) అనే లేఖనాత్మక ప్రకటనను యేసు
తిరస్కరించనూ లేదు. నేటి వ్యాపార వాణిజ్య సమాజం పోటీతత్వ సాధనకు భారీ ప్రాధాన్యత
ఇస్తుంది. ఇది గుర్తించదగిన ఫలితాలకే ప్రాముఖ్యమైనది. ఉత్పత్తి మరియు అమ్మకాల
లక్ష్యాలు నిర్ణయించబడ్డాయి మరియు వాటిని చేరుకున్న వారికి మాత్రమే ప్రతిఫలం
లభిస్తుంది. ఆ గందరగోళ ఆందోళనలో మనల్ని శ్రద్ధగా
వాక్యాన్ని వినకుండా మరియు ప్రభువుకు మన అవిభక్త శ్రద్ధ ఇవ్వకుండా నిరోధిస్తుంది.
తన కొద్ది పాటి నిర్ణీత సమయంలో ఏదో ఒకటి చెప్పాలని తనకు ఉంది అందుకు వారు మనం ఆయన
మాటను వినాలి. ఆయన నమ్మదగినవాడు మరియు మనకు ఉన్న ఏ అవసరాన్నైనా సరే తీర్చగలడు.
కాబట్టి మన ఆందోళనలను ఆయనకు ఇవ్వాలని ప్రభువు మనలను ఆజ్ఞాపించాడు (మత్త 11:28). ఆయన కృప అనవసరమైన
చింతలు మరియు అశ్రద్ధల నుండి మనల్ని విడిపిస్తుంది. మార్త సహాయాన్ని ఆయన తిరస్కరిస్తునట్లు
మనకు కనిపించినప్పటికీ, మనం మరియ వలే ఉండాలని, మన హృదయాలలో మాత్రమే కాకుండా, మన దైనందిన పరిస్థితులలో కూడా
ఆయనకు స్థానం ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు (ప్రకటన 3:19-20). మనం చేసే ప్రతిదానిలోనూ ఆయనను
గౌరవిస్తాము, అది మనకు ఆయన ఇచ్చిన
బహుమతి (1 దినవృత్తా 29:14). మనం ఏమి చేసినా, మాటలో లేదా క్రియలో దేవుణ్ణి
మహిమపరచమని భక్త పౌలుడు మనల్ని కోరుతున్నాడు (కొల 3:17). పనిని ప్రార్థనగా మార్చాలి (పునీత
బెనెడిక్టు). ప్రార్ధననుండి పని చేయడానికి శక్తిని పొందుకోవాలి.
అబ్రహాం తన ఇంటి గుమ్మాన్ని తెరిచి
ముగ్గురు తెలియని ప్రయాణికులను ఆహ్వానించినప్పుడు, అతను అదోనాయ్ ను స్వాగతించాడని లేఖనం మనకు చెబుతుంది. తన దయగల ఆతిథ్యానికి అనుకూలంగా ఆశీర్వాదం పొందుకున్నాడు
(ఆది 18:1-10; హెబ్రీ 13:2). దివ్య సత్ర్పసాదంలో క్రీస్తు
నిజమైన ఉనికిని మనం ఆస్వాదిద్దాం. దివ్యమందసం అనేది కథోలికులకు ఉన్న గొప్ప నిధి. పునీత
జాన్ పాల్ II, తన ఒక నిర్దిస్థ ప్రకటన (ఎన్సైక్లికల్)
“సంఘం తన జీవితాన్ని యూకరిస్ట్ నుండి తీసుకుంటుంది” అనే బోధనలో, “మన ప్రభువు మనకు చెప్పడానికి తనకు
చాలా విషయాలు ఉన్నాయి. మనం అనుకున్న
దానికంటే చాలా ఎక్కువే! కాబట్టి, యేసును మళ్ళీ
కనుగొనడంలో మరియు ఆయనలో మరోసారి మనల్ని మనం
కనుగొనడంలో సహాయపడటానికి మనం నిశ్శబ్దం మరియు శాంతి క్షణాలను వెతుకుదాం.
యేసుక్రీస్తు ఈ రోజు మనల్ని మన “ఉత్తమ భాగాన్ని” ఎంచుకోవడానికి (లూకా 10:42) ఎంపికచేసుకోవాలని
ఆహ్వానిస్తున్నాడు” అని వ్రాశాడు.
“ప్రభువు మాటను వినడం
అంటే శాశ్వతమైన మరియు మన దైనందిన చర్యలకు అర్థాన్నిచ్చే శక్తిని వినడం” (బెనెడిక్టు 16 వ)
No comments:
Post a Comment