AletheiAnveshana: “నేను నిన్ను పంపుతున్నాను” యెషయా 66:10-14c; గల 6:14-18; లూకా 10:1-12,17-20 (14/ C)

Saturday, 5 July 2025

“నేను నిన్ను పంపుతున్నాను” యెషయా 66:10-14c; గల 6:14-18; లూకా 10:1-12,17-20 (14/ C)

 

నేను నిన్ను పంపుతున్నాను”

యెషయా 66:10-14c; గల 6:14-18; లూకా 10:1-12,17-20 (14/ C)

పశ్చాత్తాపము అనే ఔషధముతో నన్ను స్వస్థపరచుము” (Divine Office)

ఈ రోజు, మన శ్రీ సభ ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రతి ఒక్కరినీ ఎలా పిలిచాడో ధ్యానించమని మనలను ఆహ్వానిస్తుంది. యేసు తన పన్నెండు మంది అపొస్తలులతో పాటు, మరో డెబ్బై రెండు మంది శిష్యులను ఒక నిర్దిష్ట పరిచర్య కోసం ఎంచుకున్నాడు. ప్రభు తన అపొస్తలులతో పాటు డెబ్బై రెండు మందిని ఒకే ఒక్క ప్రేశిత పరిచర్య కొరకు నియమించాడు.

రెండవ వాటికను మహాసభలో "అపోస్తోలికాం ఆక్తువోసితాతెం”  (అపోస్తోలిక పరిచర్యలు) అనే ఆదేశంలో, జ్ఞానస్నాన దివ్య సంస్కారము ద్వారా ప్రతి క్రైస్తవ విశ్వాసి తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ద్వారా పిలుపు నందుకున్నారని మనకు గుర్తు చేస్తుంది ఈ ఆదేశం.  మన ప్రభువుకు చెందిన సమస్త జనావళి పవిత్రాత్మ ప్రేరణతో సంతోషంగా, ప్రశంసనీయంగా త్వరిత సమాధానం చెప్పమని హృదయపూర్వకంగా వేడుకుంటుంది తిరుసభ. యువకులు ఈ పిలుపు తమకు మరింతగా నిర్దేశించబడిందని అర్థం చేసుకోవాలి. అలాగునే దానికి ఆసక్తిగా మరియు ఉదారంగా స్పందించాలి. ఈ పవిత్ర సినడ్ పిలుపు ద్వారా, జ్ఞానస్నానం  పొందిన వారందరూ ప్రతిరోజూ ప్రభువు దగ్గరికి రావాలని ఆహ్వానిస్తుంది. అలాగునే ప్రభువు తన ఆహ్వానాన్ని పునరుద్ధరించు కుంటున్నాడు (ఫిలి 2:5). తన రక్షణ పరిచర్యతో మనలను మనం అనుబంధించుకోవడానికి ఆయన మనలను అన్ని  లోక మూలాలకు పంపుతాడు (లూకా 10:1). తిరుసభ ఏకైక అపోస్టోలేట్ నందు కలిగిన వివిధ రూపాలు మరియు పద్ధతులలో మనం సహవాస పరిచారకులమవుతాము. ఇది మన కాలపు కొత్త అవసరాలకు నిరంతరం అనుగుణంగా ఉండడాన్ని ఆశిస్తుంది. ప్రభువు పరిచర్యలో ఎల్లప్పుడూ ఉత్పాదకంగా ఉన్నప్పుడు  ఆయనలో మన శ్రమ వ్యర్థం కాదు” (1 కొరింథి 15:58).

క్రీస్తు తన శిష్యులమైన మనలో అపోస్తలుల ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన, “నేను నిన్ను పంపుతున్నాను” అని అన్నాడు. యేసు  ఇచ్చిన ఈ ఆజ్ఞపై పునీత  జాన్ క్రిసోస్టం వ్యాఖ్యానించాడు. ఆయన ఇలా వ్రాశాడు, “ఇది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీపై దాడి చేసేవారికి భయపడనివ్వదు.” అపొస్తలులైనా లేదా మనలాంటి శిష్యులైనా సరే మన ధైర్యం అనేది  దేవుడే ఎన్నుకొని, తన చేత పంపబడ్డారనే నిశ్చయత నుండి వచ్చింది. సన్హెడ్రినులో నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట పేతురు దృఢంగా ఖచ్చితత్త్వంతో ఉత్తాన క్రీస్తుకు “మరి ఎవనివలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము (అపొ 4:12) అని సాక్ష్యమిచ్చాడు.

చెడుపై సమస్త అధికారం ఉందని యేసు మనకు హామీ ఇస్తున్నాడు. అందులో సాతాను మరియు మనకు వ్యతిరేకంగా కుట్ర పన్నే దుష్టశక్తులపై కూడా అధికారం ఉంది. చీకటి చెడు పనులను అధిగమించడానికి మనకు ఆధ్యాత్మిక అధికారం మరియు శక్తి ఇవ్వబడింది (1 యోహా 2:13-14). ఆత్మదేవుడు మనలో పనిచేస్తూ ఇతరులకు ధైర్యంగా మరియు స్పష్టంగా తన శుభవార్తను ప్రకటించడానికి సహాయంగా వుంటాడు.

మా దుఃఖాన్నిమరచిపోయి, మా పాపాలు క్షమించబడ్డాయని గ్రహించడానికి సహాయం చేయండి” (Divine Office)

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment