అపొ 13:14,43-52; ప్రక 7:9,14b-17; యోహాను 10:27-30 (ఈస్టర్ 4/C)
“ఎన్నుకోబడిన
వారి దృష్టి దేవుని వైపు చూస్తారు” (Divine
Office)
పాస్క
కాలపు నాల్గవ ఆదివారంను “గుడ్ షెపర్డ్” ఆదివారం అని కూడా పిలుస్తారు. యేసు తనను
తాను “మంచి కాపరి” అని పిలుచుకోవడం ద్వారా తన అధికారాన్ని సవాలు చేస్తున్నాడు (యోహా
10:11). సేవా జీవితానికి సంబంధించిన చాలా వృత్తులు ఒక కుటుంబం నుండి
మాతృ తిరుసభ వరకు, ఒక సామాన్య కుటుంబంలోని తండ్రి నుండి పొత్తు కథోలిక తిరుసభ
కుటుంబ పరిశుద్ధ పోప్ తండ్రి గారి వరకు పోషింప
బడుతున్నాయి. ఫ్రెంచ్ జెస్యూట్ గురువు, శాస్త్రవేత్త మరియు తత్వవేత్త అయిన
తెయిల్‌హార్డ్ దే షార్దిన్ ఒకసారి ఇలా అన్నాడు, “నేను ఇప్పుడు ఇలా
వున్నాను అంటే నా కుటుంబంవల్లనే. నా అభిప్రాయాలు, నా ఇష్టాలు మరియు
అయిష్టాలు, నా
విలువలు మరియు తీర్మానాలు చాలా వరకు నేను వచ్చిన కుటుంబం ద్వారానే నాలో రూపొందించబడ్డాయి.”
అదేవిధంగా ప్రతీ తల్లిదండ్రులు తమ తమ కుటుంబ విశ్వాసపు జీవితానికి ముఖ్యమైన
కాపరులుగా వుంటున్నారు. ఈ పాత్రను నెరవేర్చడంలో, తల్లిదండ్రులు లేదా
కాపరులు తరతరాలుగా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే యేసు పిలుపు అనే విత్తనాలను నాటాలి.
దేవుడు
తన నిబంధన సంబంధాన్ని మరియు తాను ఎన్నుకున్న ప్రజల పట్ల తాను కలిగియున్న శ్రద్ధను
వివరించడానికి “గొర్రెల కాపరి” అనే సారూప్య
ప్రతిరూప ఉదాహరణను ఉపయోగిస్తాడు (కీర్త 80:1; 100:3).
తన
యవ్వనంలో తన తండ్రి మందను కాచిన దావీదును దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు కాపరిగా
అభిషేకించబడిన రాజుగా పిలిచాడు (యెహె 37:24). దావీదు వంశానికి
చెంది దేవునిచే అభిషేకించబడిన రాజు అయిన
యేసు, తన సంరక్షణకు అప్పగించబడిన ప్రజలందరికీ తనను తాను “మంచి
కాపరిగా” పిలచుకున్నాడు (యోహా 10:29). ప్రభువైన యేసు మన
ఆత్మలకు మంచి కాపరి మరియు సంరక్షకుడు అని అపొస్తలుడైన పేతురు మనకు చెబుతున్నాడు (1 పేతు 2:25).
తనకు
అప్పగించబడిన తన ప్రతి గొర్రెను ఆయన నిశితంగా మరియు వ్యక్తిగతంగా కాపాడుతాడు. ఆయన
మనలోని ప్రతి ఒక్కరినీ తన శత్రువు అయిన సాతాను ఉచ్చుల నుండి కాపాడుతూ, తనను
అనుసరించమని వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు (యోహా 8:44). ప్రభువు మనలను మంచి
పచ్చిక బయళ్ళు అయిన పరిశుద్ధాత్మ
చెంతకు (యోహా 4:14; 7:38-39) నడిపిస్తున్నాడు. మనం ఆయన వాక్కును
భుజించి, పరిశుద్ధాత్మ జీవజలాన్ని సేవిస్తే, ఆయన మహిమ
మరియు గౌరవం కోసం ప్రతిరోజూ జీవించడానికి అవసరమైన పోషణ మరియు బలాన్ని మనం కనుగొనగలము.
అలెగ్జాండ్రియాకు
చెందిన సిరిల్ (క్రీ.శ. 376-444)
అనే పితృపాదుడు "వినుము" అనే పదం యేసు బోధించిన దానికి విధేయతను
సూచిస్తుందని చెప్పాడు. యేసు వాక్కును వినే వ్యక్తులు ఆయనకు చెందినవారు. యేసుకు
తెలియనివారు లేనే లేరు. కానీ తెలుసుకోవడం అంటే ఆయన కుటుంబంలో భాగం కావడం అని అర్ధం.
కాబట్టి, "నావాళ్ళు
నాకు తెలుసు" (యోహాను 10:27)
అని యేసు
చెప్పినప్పుడు, ఆయన
మనల్ని స్వీకరిస్తాడనీ, తనతో తన శాశ్వత ఆధ్యాత్మిక సంబంధాన్ని మనకు అందిస్తాడని
అర్థం. ఆయన మనలా మారినప్పటి నుండి, ఆయన మానవులందరినీ తన బంధువులుగా చేసుకున్నాడు. అదే మానవ స్వభావాన్ని తాను పంచుకున్నాడు. క్రీస్తులో ఏకీకృత
మానవ జాతి అనే భావన అన్ని రకాల మానవుల స్వాభావిక గౌరవాన్ని మరియు సామాజిక న్యాయం
ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది (రేరం నోవారం – పోపు లియో 13). ఆయన మనుష్యవతార
కారణంగా మనమందరం క్రీస్తుతో ఒకే ఆధ్యాత్మిక సంబంధంలో ఐక్యంగా ఉన్నాము. అయినప్పటికీ
ఆయన పవిత్రత పోలికను కాపాడుకోని వారు ఆయన నుండి దూరం చేయబడతారు... ". నా
గొర్రెలు నన్ను అనుసరిస్తాయి" అని క్రీస్తు చెప్పాడు. దేవుని కృప ద్వారా, మనం"దేవుని బిడ్డలము"
(మత్త 5:9) గానే
వుంటాము కానీ ఇకపై ఎన్నటికి అపవాది నీడలకు లోబడి ఉండలేము.
పునీత అగుస్టీను
ఇలా అంటాడు, “మీరు
ఆయనను విడిచిపెట్టకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు”. మనం ఆయనను
విడిచిపెట్టకపోతే ఆయన మనలను ఎన్నటికీ విడిచిపెట్టడు. దేవుడిని, తిరుసభను లేదా
ఇతరులను నిందించకూడదు. ఎందుకంటే మన విశ్వసనీయత సమస్య అనేది మన స్వయం కృతం. దేవుడు
ఎవరికీ తన కృపను తిరస్కరించడు. నిరాకరించడు. దేవుని కృపను దృడoగా పొందుకోవడానికి ఇది మనకు బలమై ఉన్నది. ఇది మన యోగ్యత
కాదు. కేవలం ఆయన “కృప” మాత్రమె. యేసు
సహవాసంలో ఉన్నవారు యేసుకు చెందినవారుగా శాశ్వత ఆనందాన్ని పొందుతారు.
“మన హృదయాలను
ఉత్తేజపరుద్దాం, మన
విశ్వాసాన్ని తిరిగి ఉత్తేజపరుద్దాం...” (Divine Office)
No comments:
Post a Comment