AletheiAnveshana: “దీని ద్వారా నీవు నావాడవని అందరూ తెలుసుకుంటారు” అపొ 14:21-27; ప్రక 21:1-5a; యోహా 13:31-33a,34-35 (ఈస్టర్ 5/C)

Friday, 16 May 2025

“దీని ద్వారా నీవు నావాడవని అందరూ తెలుసుకుంటారు” అపొ 14:21-27; ప్రక 21:1-5a; యోహా 13:31-33a,34-35 (ఈస్టర్ 5/C)

 


దీని ద్వారా నీవు నావాడవని అందరూ తెలుసుకుంటారు”

అపొ 14:21-27; ప్రక 21:1-5a; యోహా 13:31-33a,34-35 (ఈస్టర్ 5/C)

చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, మరియు చీకటి దానిని ఎన్నడూ అధిగమించలేకపోయింది”

 

పునీత మదర్ థెరిసా గ్యాంగ్రీను వ్యాధి ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం గమనించిన తర్వాత, ఒక అమెరికను జర్నలిస్టు నాకు మిలియను డాలర్లు ఇచ్చినా అలా చేయను” అని అన్నాడు. అందుకు పునీత మదర్ థెరిసా నేను కూడా చేయను... కానీ నేను దేవుని ప్రేమ కోసం అలా చేస్తున్నాను” అని సమాధానమిచ్చారు. స్వార్థం ఒక్కొక్కప్పుడు మనల్నిమానవ సంబంధాలలో బంధించి ఉంచుతుంది లేకపోతె సంబధాలను త్రెంచుతుంది. అయితే ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం,  ‘మంచి పొరుగు’ వారిగా ఉండటం అనే విలువలను పాటించడం వలన మాత్రమె మనలను ఈ భవబంధాలనుండి విడిపించగలదు.

మన రక్షకుడు ఈ లోకంనుండి నిష్క్రమించిన తర్వాత, భూమిపై మానవుల మధ్య తాను చేపట్టిన పని శాశ్వతంగా నిలిచి ఉండేలా ఏర్పాటు చేశాడు. తన ఆత్మ వహితులైన జనుల సమాజ ఏర్పాటుతో దానిని ప్రతిష్టాపన చేశాడు. తన నూతన ఉజ్జీవ సంస్కరణ శక్తితో ప్రభువు తన జనులను కలసి కట్టుగా వుంచేటటువంటి ఉద్దేశించిన బంధాలు మూడు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు! అందుకేనెమో యేసు మూడు పేటల బంధాన్నినిబంధనగా చేసాడు. అవి ప్రథమంగా క్రీస్తునందు విశ్వాసం. రెండు  ఒకరినందు మరొకరికి ప్రేమ. మూడవది లోక రక్షణ కోసం మన సర్వత్ర ప్రయత్నం. ఇవి క్రీస్తు శిష్యరికానికి కలిగిన మూడు ఆవిష్కరణలు. వీని ద్వారా సంఘం నిజమైన ఐక్యతలో స్థిరపడుతుంది. రక్షకుడు, నేటి సువార్త భాగంలో ఒకరియందు మరొకరికి  ప్రేమ" అనే అంశంపై ప్రత్యేకత చూపిస్తున్నాడు.

"మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” అని అపొస్తలుడైన పౌలు మనకు చెబుతున్నాడు (రోమ 5:5). యేసు క్రీస్తు ప్రతీ అనుచరుని లక్షణం ప్రేమ. ఈ ప్రేమ గత గాయాలను క్షమించి మరచిపోవడానికి,  ప్రతీకార గాయానికి బదులుగా స్వస్థపరచి పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటుంది. క్షమాపణ, శాంతి, క్షమాపణ మరియు సయోధ్యకు యేసు సిలువ మాత్రమే మార్గం. యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానముల ద్వారా మన కోసం గెలుచుకున్న మహిమా విజయం ప్రతీ సైతాను విధానాన్ని ఓడిస్తుంది. ఆయన తన శిష్యులను నిస్వార్థంగా ప్రేమించాడు. వారిని త్యాగపూరితంగా ప్రేమించాడు. వారిని అర్థం చేసుకొని ప్రేమించాడు. ఆయన వారిని క్షమించేలా ప్రేమించాడు. ఇది క్రైస్తవ శిష్యత్వానికి బాహ్య సంకేతం. అందుకే ఆయన స్పష్టంగా ఇలా అన్నాడు, “మీరు ఒకరినొకరు ప్రేమిస్తే, దీని ద్వారా మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారు" (యోహా 13:35). మనం ఆయన ప్రేమను, సత్యాన్ని స్వీకరించి, ఆయన ఆత్మను అనుమతిస్తే, ఆయన ఆత్మ మన హృదయాలను మరియు మనస్సులను శుద్ధి చేస్తుంది. పరివర్తన చెందిస్తుంది. ఇది కొలతలు, సరిహద్దులు లేదా స్థాయిలు లేకుండా ప్రేమించడానికి, వంతెనలు, పరిమితు లేకుండా క్షమించడానికి, ప్రతిఫలం లేకుండా సేవ చేయడానికి అవసరమైన అంతర్గత స్వేచ్ఛ, ఆనందం మరియు బలాన్ని కనుగొనడానికి మనకు వీలు కల్పిస్తుంది యేసు ప్రేమ. ఇటువంటి ప్రేమ సామాజిక న్యాయం మరియు ధర్మాన్ని ప్రతిబింబిoపచేస్తుంది.

19వ శతాబ్దపు అధికారిక పత్రం (ఎన్సైక్లికల్) "రేరుం నోవారుం" ద్వారా తిరుసభ "పొరుగువారి ప్రేమ" లోని భావాన్ని దాని పరమార్థాన్ని చక్కగా వివరించింది. ఇది వ్యక్తి గౌరవం, సాధారణ మానవ మంచితనం, అందునా పారిశ్రామిక మూలధనం  కూలీల కష్టార్జితాల మధ్య కలిగియున్న సంబంధం గురించి చెపుతుంది. అదేవిధంగా వారి మధ్య కలిగియుండవలసిన సంఘీభావపు ప్రాముఖ్యతను కుడా నొక్కి చెబుతుంది. పరస్పర గౌరవం, న్యాయమైన విధానాలు మరియు సామాజిక శ్రేయస్సు కోసం ఉమ్మడి నిబద్ధతపై నిర్మించిన సమాజాన్ని ఈ అధికారిక పత్రం సమర్థిస్తుంది (పోపు లియో 13). ప్రేమను అభ్యసించడంలో మరొక అంశం మనల్ని మరియు ఇతరులను స్వస్థపరిచే శక్తిని కలిగి ఉంది. ప్రేమించడం అంటే స్వీకరించేవారిని మరియు ఇచ్చేవారిని కూడా స్వస్థపరచడం. ప్రేమించాలని నిర్ణయించుకోవడం అంటే జీవితానికి పూర్తి అంగీకారంతో ఉండటం. ఇది ఒక ఎంపిక అంతేకాని  కేవలం ఒక భావన కాదు. మనం ప్రేమించే, శ్రద్ధ వహించే, స్వస్థపరిచే, సహాయం చేసే మరియు క్షమించే వ్యక్తులుగా ఉండాలని ఎంచుకున్నప్పుడు, మన జీవితం ఎలా ఉండాలో అని అనుకున్నప్పుడు అలాగునే మనం కూడా ఎదుగుతాము.  దానిలో వేరే మార్గం కన్పించదు. అందువల్లనే యేసు నొక్కి చెబుతున్నాడు, 'నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోనుడి”.

 

"నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను: నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకొనుడి"


No comments:

Post a Comment