“నా యొద్దకు రండి…
నేను మీకు విశ్రాంతినిస్తాను”
జెకర్యా 9:9-10; రోమా 8:9-13; మత్తయి 11:25-30 (14/ A)
దేవుడు తాను
చేసినదంతయు చూచెను,
అది
మిక్కిలి మంచిదని చెప్పెను. హల్లెలూయా.
యేసు పలికిన అత్యంత
ఓదార్పునిచ్చే ఆహ్వానాలలో ఒకదానితో నేటి సువార్త ప్రారంభమవుతుంది: “ప్రయాసపడి
భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి నిచ్చెదను”
(మత్త 11:28).
మనం
జీవిస్తున్న ఈ లోకంలో చాలామంది శారీరకంగా అలసిపోయి, మానసికంగా
నిస్సత్తువగా,
మరియు
ఆత్మీయంగా అశాంతితో వుంటున్నారు. మనం శారీరక అలసట కన్నా మానసిక అలసటకే ముందుగా
గురి అవుతాము. కారణం కొందరు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, అనారోగ్యం, భవిష్యత్తు గురించిన
ఆందోళనలతో సతమతమవుతూ శారీరకంగా కన్నా మానసికంగా అలసట చెందుతున్నారు. యేసు ఈ
దాగివున్న భారాలను చూసి,
ప్రేమతో, “నా యొద్దకు రండి”
అని ఆహ్వానిస్తున్నారు. మన మెస్సీయ గాడిద మీద స్వారీ చేసే ఒక వినయశీలి అయిన రాజాధి
రాజు (జకర్యా 9:9-10).
అధికారం
మరియు హింసపై ఆధారపడే లౌకిక పాలకుల వలె కాకుండా, యేసు తన రాజ్యాన్ని
వినయం,
శాంతి
మరియు ప్రేమ ద్వారా స్థాపిస్తారు. అతని బలం ఆధిపత్యంలో కాదు, ఆత్మార్పణతో కూడిన
సేవలో ఉంది.
సువార్తలో, యేసు తన మర్మాలను “చిన్నవారికి”
బయలుపరిచినందుకు తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. గ్రీకు పదం νήπιοι (nēpioi)కు అక్షరాలా “చిన్న
పిల్లలు” అని లేదా దేవునిపై నమ్మకం ఉంచేంత వినయంగా ఉండేవారని అర్థం. దేవుని జ్ఞానం
గర్వం ద్వారా కాకుండా,
తెరిచి
ఉండి,
నేర్చుకోవడానికి
సిద్ధంగా ఉండే హృదయం ద్వారా లభిస్తుంది. అప్పుడు యేసు, “నా కాడిని మీ మీద
వేసుకోండి” అని అంటాడు. “కాడి” అని అర్థం వచ్చే గ్రీకు పదం ζυγός (zygos), శిష్యరికానికి
ప్రతీక. ఒక కాడి సాధారణంగా రెండు జంతువులను కలుపుతుంది కదా! అందులో బలమైనది
ఎక్కువ బరువును మోస్తుంది. యేసు మనపై మరో భారాన్ని మోపడు. బదులుగా, ఆయన మన ప్రక్కనే
నడుస్తూ,
జీవిత
భారాలను మోయడంలో మనకు సహాయం చేస్తాడు. అందుకే ఆయన, “మీరు విశ్రాంతి
పొందుతారు” అని వాగ్దానం చేస్తాడు—గ్రీకు పదం ἀνάπαυσις (anapausis)కు లోతైన అర్ధాన్ని
ఇచ్చే “సేదతీర్పు” మరియు “శాంతి” అనే మాటల
అర్థం.
ఇది
కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు. ఆత్మకు విశ్రాంతి.
ఈ సువార్త నైతికంగా
కూడా మనల్ని సవాలు చేస్తుంది. తరచుగా, అహంకారం, క్షమించకపోవడం, స్వార్థం లేదా
ఇతరులను తీర్పు తీర్చడం వంటి వాటి నుండే అత్యంత భారమైన భారాలు మనకు వస్తున్నాయి.
యేసు తన సౌమ్యతను,
వినయాన్ని
అనుకరించమని మనల్ని ఆహ్వానిస్తున్నారు. వినయమైన హృదయం కుటుంబాలలో, కార్యాలయాలలో మరియు
సమాజాలలో శాంతిని నెలకొల్పుతుంది. ఈ సందేశం కథోలిక సామాజిక బోధన సారాంశం కూడా. మన
భారాలను ఆయన వద్దకు తీసుకురావడమే కాకుండా, ఇతరుల భారాలను మోయడంలో సహాయపడమని
క్రీస్తు మనల్ని పిలుస్తున్నారు. కథోలిక చర్చి కేటకిజం, మనం ప్రతి
పొరుగువారిని "మనలో ఒకరిగా" చూడాలని బోధిస్తుంది (CCC 1931). పవిత్ర
తిరుసభ
సామాజిక సిద్ధాంతం,
మానవ
వ్యక్తి అనేది “ప్రతి సామాజిక సంస్థకు పునాది. అదే దానికి కారణం మరియు
అంతం" అని మనకు గుర్తుచేస్తుంది (CSDC 106). మనం ఒంటరివారిని
ఓదార్చినప్పుడు,
పేదలకు
అండగా నిలిచినప్పుడు,
మనల్ని
బాధపెట్టిన వారిని క్షమించినప్పుడు, లేదా ప్రతి వ్యక్తి గౌరవాన్ని
కాపాడినప్పుడు,
మనం
క్రీస్తు కరుణకు సజీవ చిహ్నాలుగా నిలుస్తాము. అదే మనం మోయలేని మన కాడిని శులువు
చేస్తుంది.
“నా పాపములు సముద్రపు
ఇసుక రేణువులకంటె అధికము. నా అతిక్రమములు విస్తారమైనవి....”