నూతన అర్చన సంవత్సర శుభాకాంక్షలు
యెష 2:1-5; రోమా 13:11-14;
మత్త 24:37-44
“ఇదిగో, పరలోక రాజు శక్తితోను గొప్ప మహిమతోను
జనములను రక్షించుటకు వచ్చును.” అల్లెలుయ.
ఈ రోజు ఆగమన కాలపు
మొదటి ఆదివారం. ఇది మాతృ శ్రీసభకు కొత్త అర్చనా
సంవత్సరపు మొదటి ఆదివారం. ఆగమన కాలములో క్రిస్టమస్ కు ముందు నాలుగు ఆదివారాలు
ఉన్నాయి. ఈ కాలం ప్రభువు రాకడకు సిద్ధపడే సమయం. ఈ కాలములో మన విశ్వాసం రెండు ప్రధాన అంశాలను గుర్తుచేస్తుoది. అవి ప్రభువు మహిమతో చివరిగా రావడం (రెండవ రాకడ) మరియు
యేసు జననంలోని ప్రభువు మనుష్యవతారం. ఆగమన కాలపు ముఖ్య ఇతివృత్తాలు – జాగరూకమైన
నిరీక్షణ, సంసిద్ధత మరియు న్యాయం. ఈ నూతన అర్చనా
సంవత్సరములో, మత్తయి సువార్త ఆదివారపు ప్రాధమిక
సువార్త అవుతుంది (సైకిల్ A). నేటి సువార్తలో, మనుష్యకుమారుని
రాకడ కోసం మేల్కొని ఉండటం, జాగరూకమైన నిరీక్షణ అవసరత గురించి యేసు
మాట్లాడటం మనం వింటున్నాము.
ఈ విషయమై మనం
జాగ్రత్తగా ఉండాలి. 16 వ బెనెడిక్టు పోపు గారు, "జాగ్రత్తగా
ఉన్నవారు మాత్రమే ఈ విషయమై ఆశ్చర్యపోరు." అని అంటారు. కారణం జ్ఞానవంతులైన
కన్యకల దీపంలా వారి హృదయాలలో యేసుని ప్రేమ ప్రజ్వరిల్లుతుంది. కాబట్టి అది వారికి
ఆశ్చర్యాన్ని కలిగించదు. "ఇదిగో, వరుడు! ఆయనను
కలవడానికి బయటకు రండి!" (మత్త 25:6) అని మనం వినే క్షణం వస్తుంది. అపుడు మనకు
ఆశ్చర్యాన్ని కలిగించదు కదా! యేసుక్రీస్తు రాక ఎల్లప్పుడూ మన హృదయంలో జ్యోతిని వెలిగించిన ఆనందాన్ని
కలిగిస్తుంది. అందుకే రాబోయే ప్రభువు కోసం శాంతి మరియు ప్రేమతో వేచి ఉండాలని ఆగమనం
మనకు నేర్పుతుంది. నేటి ప్రపంచ లక్షణం అనేది నిరాశ లేదా అసహనం అనేవి ఏమీలేకుండా
చేస్తుంది. పునీత అగస్టీను గారు "మీ మరణం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో
అలాగే మీ జీవితాన్ని గడపండి" అనే ఒక మంచి నియమాన్ని ఇస్తున్నాడు. మనం ప్రేమతో
వేచి ఉంటే, దేవుడు మన హృదయాలను మరియు మన ఆశను పరి
పూర్ణం చేస్తాడు.
మన ప్రభువు ఏ రోజు
వస్తాడో మనకు తెలియదు కాబట్టి మెళకువగా ఉందాము (మత్త 24:42). శుభ్రమైన ఇల్లు, స్వచ్ఛమైన హృదయం, యేసు
శైలిలో ఏర్పడిన ఆలోచనలు మరియు అనురాగాలుగా మార్పు చెందాలి. “జాగరూకత అంటే
ప్రభువును అనుసరించడం, ఆయన ఎంచుకున్నదాన్ని ఎంచుకోవడం, ఆయన ప్రేమించినదాన్ని ప్రేమించడం, ఒకరి
స్వంత జీవితాన్ని తన జీవితానికి అనుగుణంగా మార్చుకోవడం. అప్పుడే మనుష్యకుమారుడు వస్తాడు” అని 16 వ బెనెడిక్టు
గారు అంటారు. తండ్రి తన కుమారుడిని పోలి ఉన్నందున మరియు తన “వాక్కు”ను అనుసరించినందున
అంతిమ దినమున మనల్ని ప్రేమతో స్వాగతిస్తాడు.
“మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, నా కళ్ళ ముందు నుండి మీ చెడు పనులను
తొలగించుకోండి” (యెష 1:16)
No comments:
Post a Comment