నజరేతు పవిత్ర కుటుంబ ఉదాహరణ
“....మీ
తల్లిదండ్రులకు విధేయత చూపడం మీ క్రైస్తవ విధి. ఎందుకంటే
అదే సరైన పని...” (A)
యేసు జీవితాన్ని మనం అర్థం
చేసుకోవడం ప్రారంభించడానికి నజరేతు ఇల్లు ఒక పాఠశాల. అది సువార్త పాఠశాల. ఇక్కడ
మనం నేర్చుకునే మొదటి పాఠం ఏమిటంటే, దేవుని కుమారుని
సరళమైన, వినయ పూర్వకమైన, అందమైన మరియు మర్మమైన అభివ్యక్తి అర్థాన్ని చాలా లోతూగా
ఒక సారి చూడటం, వినడం, ధ్యానం
చేయడం మరియు చొచ్చుకుపోవడమే! బహుశః మనం ఈ అనుకరణ పాఠాన్ని అస్పష్టంగానూ నేర్చుకొ గలము!!!
నేను మళ్ళీ
పిల్లవాడిని అయి, ఈ వినయపూర్వకమైన మరియు ఉన్నతమైన నజరేతు పాఠశాలకు
మళ్ళీ వెళ్లడగలిగితే ఎంత సంతోషంగా వుంటుంది. మరియకు దగ్గరగా, జీవితపు నిజమైన శాస్త్రాన్ని మరియు దైవిక సత్యాల ఉన్నత జ్ఞానాన్ని
నేర్చుకోవడంలో నేను కొత్తగా ప్రారంభించగలిగితే ఎంత బాగుంతుంది. కానీ నేను ఈ భూలోక తీర్ధ
యాత్రికుడిని మాత్రమేగా!! సువార్తను అర్థం చేసుకోవడంలో నా అసంపూర్ణమైన విద్యను ఈ ఇంట్లో కొనసాగించాలనే ఈ
కోరికను నేను ఇక త్యజించాలి. తప్పదు. ఎందుకంటే ఇక ఇప్పుడు నేను చేయలేను.
మొదటగా, నిశ్శబ్దం (మౌన ధ్యానం) దాని పాఠం. నిశ్శబ్దం పట్ల గౌరవం. ఆ ప్రశంసనీయమైన మరియు అనివార్యమైన మానసిక స్థితి మనలో పునరుజ్జీవింపబడాలి. మన ఉప్పొంగి పోయే లేదా అతిగా సున్నితత్వం చెందిన ఆధునిక జీవితంలో బాగానే
ఉద్ధరించే గందరగోళ స్వరాలు, సాధారణ శబ్ద కోలాహలాలలో మనం
చుట్టుముట్టబడి కమ్మివేయబడి ఉన్నాము. నజరేతు నిశ్శబ్దం మనకు జ్ఞాపకశక్తి, అంతర్గతత, మంచి ప్రేరణలను మరియు నిజమైన గురువుల
బోధనలను వినడానికి తగినంత వైఖరిని నేర్పుతుంది. ఇది ముందుచూపు గలిగిన తయారితనం,
అధ్యయనం, ధ్యానం, వ్యక్తిగత
అంతర్గత జీవితం, దేవుడు మాత్రమే రహస్యంగా చూసే ప్రార్థనా
విలువను మనకు నేర్పుతుంది.
తరువాత, కుటుంబ జీవితం గురించిన ఒక పాఠం ఉంది. కుటుంబ జీవితం అంటే ఏమిటో,
దాని ప్రేమ సహవాసం, దాని కఠినమైన, సరళమైన అందం, దాని
పవిత్రమైన మరియు అవ్యక్తమైన లక్షణాన్ని నజరేతు పవిత్ర కుతుమబం మనకు నేర్పుతుంది. వారి
ఇంట్లో పొందిన నిర్మాణం సున్నితమైనది మరియు భర్తీ చేయలేనిది అని నజరేతు నుండి
నేర్చుకుందాం. సామాజిక క్రమంలో కుటుంబం పాత్ర ప్రధాన ప్రాముఖ్యతగా నేర్చుకుందాం.
చివరగా, పని పాఠం ఉంది. 'వడ్రంగి కుమారుని' నివాసమైన
నజరేతును, నీలో చూస్తూ కఠినమైన మానవ పని, విమోచన
చట్టాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానినే ప్రకటించడానికి నేను ఇష్టపడు
తున్నాను. ఇక్కడ నేను పనిలో వున్న గొప్పతనం మరియు
దాని అవగాహనను పునరుద్ధరిస్తాను. మరియు ఆ పని దానికదే ఒక ముగింపు కాదనీ, దాని
స్వేచ్ఛ, దాని శ్రేష్ఠత దాని ఆర్థిక విలువ కంటే ఎక్కువగానూ, అది
ఎవరి కోసం చేపట్టబడుతుందో వారి విలువ నుండి ఉద్భవించిందని పునరుద్ఘాటిస్తాను. ముగింపుగా,
ఇక్కడ నజరేతులో, ప్రపంచంలో
వున్న ప్రతీ కార్మికుడిని నేను పలకరించాలనుకుంటున్నాను. వారి
గొప్ప నమూనా మరియు వారి సోదరుడు దేవుడే
అని వారికి నొక్కి చెబుతున్నాను. వారి
న్యాయమైన కారణాలన్నింటికీ ఆయనే ప్రవక్త, మన ప్రభువైన
క్రీస్తు.
"మీరు
ఏమి చేస్తున్నారో, మీ పూర్తి హృదయాన్ని దానిలో
పెట్టండి..."
పోప్
పాల్ VI నజరేతులో ఇచ్చిన ప్రసంగం నుండి...
No comments:
Post a Comment