AletheiAnveshana: పరిశుద్ధుడు మరియు సత్యవంతుడు వచ్చుచున్నాడు యేష 11:1-10; రోమా 15:4-9; మత్త 3:1-12

Friday, 5 December 2025

పరిశుద్ధుడు మరియు సత్యవంతుడు వచ్చుచున్నాడు యేష 11:1-10; రోమా 15:4-9; మత్త 3:1-12

 

పరిశుద్ధుడు మరియు సత్యవంతుడు వచ్చుచున్నాడు

యేష 11:1-10; రోమా 15:4-9; మత్త 3:1-12

గొప్ప రాజు వచ్చినప్పుడు, మనుష్యుల హృదయాలు పవిత్రం చేయబడతాయి.”

 

మన రక్షణ పట్ల ఆమెకున్న శ్రద్ధలో, మన ప్రేమగల మాతృ శ్రీసభ, మనం పొందుకున్న ఆశీర్వాదం నిమిత్తమై  కృతజ్ఞతతో ఉండటానికి మరియు క్రీస్తు రెండవ రాకడకు సిద్ధంగా ఉండు నిమిత్తం ఈ ఆగమన కాలాన్ని ఉపయోగిస్తూ మనకు పాఠాన్ని నేర్పిస్తుంది.

 

ప్రవక్త మలాకీ దేవుని రెండు రాకడల గురించి మాట్లాడుతాడు.  మొదటిగా “మనం (నీవు) వెతుకుతున్న ప్రభువు తన ఆలయానికి అకస్మాత్తుగా వస్తాడు” (మలా 3:1) అని మొదటి రాకడ గురించి మాట్లాడుతూ, “చూడు! సర్వశక్తిమంతుడైన ప్రభువు వస్తాడు, ఆయన ప్రవేశించే రోజును సహిస్తాడు... కానీ ఆయన దృష్టిలో ఎవరు నిలబడగలరు? (మలా 3:2) అని రెండవ రాకడ గురించి   హెచ్చరిస్తున్నాడు. ఆయన శుద్ధి చేసే అగ్నివలే, ప్రతి మరకను శుభ్రపరిచే ఒక దర్బలు వలె వస్తాడు. భక్త పౌలున్నూ  తీతుకు ఈ రెండు రాకడల గురించి జగురూకతో వుండమని వ్రాస్తాడు. అది – రక్షకుడైన దేవుని కృప (యేసు ప్రత్యక్షత) అందరికీ కనిపించిందనీ, ఈ ప్రస్తుత యుగంలో భక్తిహీనత మరియు లోక కోరికలను పక్కనపెట్టి, నిగ్రహంగా, నిజాయితీగా మరియు ఆధ్యాత్మికంగా జీవించమని అందరికీ సూచించిందనీ, (మరియు) ఆనందకరమైన ఆశ కోసం, మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఇంకా ఎదురు చూస్తున్నాము అని తీతుకు హెచ్చరిక చేశాడు (తీతు 2:11-14).

 

ఇటువంటి రెండు రాకడలు మన రక్షకునికి సంబంధించిన రెండు అంశాలను గురించి మాట్లాడుతున్నాయి. మొదటి రాకడలో, యుగాలకు ముందు దేవునితో ఉన్నవాడుగాన్నూ, కాలం పరి పూర్తి అయినప్పుడు కన్యక నుండి జన్మించి పశువుల తొట్టిలో పురుటి వస్త్రాలతో చుట్టబడి యున్నాడు. తన రెండవ రాకడలో,  వస్త్రంను ధరించుకున్నాట్లు  తేజో మయుడైన భానుడి వెలుగును అతను ధరించుకుంటాడు. మొదటి రాకడలో, అవమానాన్ని తృణీకరించి, ఆయన శిలువను భరించాడు; రెండవ రాకడలో, ఆయన దేవదూతల సైన్యంతో పాటు మహిమలో ఉంటాడు. మొదటి రాకడలో మనం, "ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు" అని దూతల గణములు శ్లాఘించగా, రెండవ రాకడలో, ఆయన తీర్పు తీర్చబడటానికి కాకుండా, మనల్ని తీర్పు తీర్చడానికి వస్తాడు.

"ఆ గడియ గురించి దేవదూతలకు గానీ, కుమారునికి గానీ తెలియదు" అని యేసు చెప్పాడు (మత్త 24:36). ఆ ఉగ్ర రాకడ సమయాలను లేదా క్షణాలను తెలుసుకోవడం మన పని కాదు. మనం జాగ్రత్తగా ఉండేలా ఆయన ఆ విషయాలను దాచిపెట్టాడు. ఆయన తన రాకడ సమయాన్ని వెల్లడించి ఉన్నట్లయితే, ఆయన రాకడలో దాగి యున్న మహిమోపేత కరుణా రహస్యాన్ని కోల్పోయేది.

 

జాగ్రత్తగా ఉండండి. దేహం నిద్రపోతున్నప్పుడు, ప్రకృతి మనపై నియంత్రణ తీసుకుంటుంది. లోతైన నిర్లక్ష్యం ఆత్మను స్వాధీనం చేసుకున్నప్పుడు, (ఉదాహరణకు మూర్ఖత్వం లేదా విచారం), శత్రువు అయిన సాతాను దానిని అధిగమించి, తాను చేయలేని దానిని చేయమని మనలను బలోపేతం చేస్తాడు. ప్రకృతి శక్తి, ఆత్మ శత్రువు అయిన సైతాను నియంత్రణలో ఉంటుంది. ప్రభువు మనల్ని అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించండలో, మన ఆత్మశరీరంలో అప్రమత్తంగా వుండమని జ్ఞాపకం చేయడమే! ఆ రెండింటిలోనూ మనం నిద్రపోయే ధోరణి లేకపోలేదు! ఆత్మలో పిరికితనానికి, శరీరంలో బద్ధకానికి వ్యతిరేకంగా వుంటూ  అప్రమత్తంగా ఉండాలని అర్థం. పితృ పాదులు పునీత ఎఫ్రాయిము, కీర్తన 138లోని, "నీవు న్యాయంగా మేల్కొనుము, నేను లేచాను, మరియు ఇంకా నీతోనే ఉన్నాను” అనే అభయ వాక్యాన్ని ఉటంకిస్తూ “ఇక నిరుత్సాహపడకు” (ప్రక 1:8) అన్న దర్నన గ్రంథ వాక్య ధైర్యాన్ని అందిస్తున్నాడు. కాబట్టి మెళకువతో వుంటూ ప్రభువు రాకడను కొనియడుదాము.

 

"...ఇదిగో! మీ రాజు మీ దగ్గరకు వస్తున్నాడు. సీయోనూ, భయపడకు: నీ రక్షణ సమీపించియున్నది.”

 

 

 

 

No comments:

Post a Comment