దేవుడు మరియు మానవుని
తల్లి
నిత్య రక్షణకు క్షయమైన ఈ శరీరం ఒక అక్షయమైన శరీరాన్ని ధరించుకోవాలి
(A)
నేడు కృతజ్ఞతగా, కన్యమరియ మాతృత్వాన్ని మాతృ శ్రీసభ
మనందరికీ ఒక నమూనాగా ప్రతిబింబి౦పచేస్తుంది. ఎఫెసుస్ కౌన్సిల్ (క్రీ.శ 451)లో, యేసు
తల్లి తన కుమారుడైన యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరిస్తూ ఆమె దేవుని తల్లి లేదా “థియోటోకోస్”
(గ్రీకు) అని గంభీర౦గా ప్రకటన చేసింది. ఈ
గొప్ప బిరుదుతో, ఆమెను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా
మంది క్రైస్తవులు గౌరవిస్తారు. 16 వ బెనెడిక్ట్ పోపు గారు, “యేసు దేవుని కుమారుడు, అదే సమయంలో ఆయన ఒక స్త్రీ మరియ కుమారుడు. ఆయన ఆమె నుండి ఉదయించాడు.
ఆయన దేవునికి మరియు మరియకు చెందినవాడు” అని అన్నారు. ఆమె దైవ కృపను విశ్వసించింది.
అందుచే దేవుని మంచితనంలో ఆమె శాశ్వితంగా
నిలబెట్టబడింది. నిజానికి,
ఆమె ప్రభువు “అనావిమ్”
(హిబ్రూ పదం – బీదవారు/సాత్వికులు).
విశ్వంలోని ప్రతీది దేవుని చేతిలోనే నియంత్రించబడి వుందని
విశ్వసించే వినయపూర్వకమైన హృదయాలుగా నిలిచే వాళ్ళే ఈ సాత్వికులు (లూమెన్ జెంత్సియుం
55). అయితే పునీత అగస్టీనుగారు కన్య మరియ గురించి
వ్రాస్తూ, “ఆమె యేసును తన గర్భంలో ధరింపచేయక ముందు
తన హృదయంలో గర్భం ధరించింది” అని చక్కటి ధ్యాన వాక్యాన్ని అందించాడు.
ఈనాటి దివ్యార్చన కొత్త సంవత్సరంలోని మన ఆశలను, ప్రణాళికలను కోసం
ఆ తల్లి సంరక్షణలో ఉంచమని మనల్ని మాతృ సంఘం ఆహ్వానిస్తుంది. మన వ్యక్తిగత
ఆందోళనలను, మన యుగంలోని ఆందోళనలను,
సంఘర్షణలను, నిర్దిష్టమైన అన్యాయాలను, అసమాన సంపదను, అవకాశాలను, యుద్ధాలను, మన ప్రపంచంలో శాంతి మరియు న్యాయాన్ని
ఇబ్బంది పెట్టే ప్రతిదాన్ని ఆమెకు అప్పగించవచ్చు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన కన్య
మరియ మనకు మార్గదర్శకంగానూ సలహాదారుగానూ ఉంటుంది. ఆమె మనలో విశ్వాసాన్ని
కలిగించాలని, మన తల్లిగా ఉండాలని కోరుకుంటుంది మాతృ
సంఘం. అందుకే, యోహాను సువార్తలో, క్రీస్తు ప్రజా జీవితం ప్రారంభంలో మరియు
చివరిలో ఆమె మనకు కన్పిస్తుంది.
కల్వరిలో మరియ ఉనికిని నమోదు చేసిన ఏకైక
వ్యక్తి సువార్తికుడు యోహాను మాత్రమె
- “యేసు సిలువ దగ్గర ఆయన తల్లి నిలబడింది” (యోహాను 19:25). ఇది నిర్ధారణ అని మనకు
అర్ధమౌతుంది. యేసు చేసిన అద్భుతాలన్నీ చాలా మందికి
భ్రమగా అనిపించినప్పటికీ,
ఆయన తల్లి ఆతని చివరి
శ్వాస వరకు ఆయనకు నమ్మకంగా నిలబడి,
దేవుని రక్షణ శక్తిని
నమ్మింది. సిమియోనుడు, “ఇశ్రాయేలులో అనేకుల పతనానికి, వారి పెరుగుదలకు ఆయన నియమితుడు, తిరస్కరించబడిన సూచనగా ఉండుటకు ఆయన
నియమితుడు” ( 2:34) అని
పలికిన మాటను జ్ఞాపకం చేసుకున్నది. ఆమెకు కలిగిన విశ్వాసానికి ఆశ్చర్యకరమైన
అద్భుతాలు మనకు అవసరం లేదు,
కానీ మన తండ్రి అయిన
దేవుని మర్మమైన మార్గాలపై చిన్నపిల్లల విశ్వాసంలాంటి వైఖరి మనం కలిగి ఉండడంపై
ఆధారపడి వున్నది. సువార్తికుడు యోహాను,
“ఇదిగో మీ తల్లి” అని
వ్రాసినట్లుగా, యేసు తల్లి ఇకనుండి ఆయన శిష్యులందరికీ
తల్లి అవుతుంది కదా!!
అందుకే తన బలమైన మరియు సరళమైన విశ్వాసాన్ని
మనతో పంచుకుంటుంది.
“నేడు రక్షకుడు మీకు జన్మించాడు. ఆయన ప్రభువైన క్రీస్తు" (లూకా
2:24) అని గొర్రెల కాపరులు తనతో చెప్పిన దానిని ఆమె ఎంతో విలువైనదిగా భావించి, ధ్యానించింది. ఈ రోజు, నూతన సంవత్సర దినోత్సవం. చాలామంది మంచి తీర్మానాలు చేసుకోవడానికి
ఆకర్షితులయ్యే రోజు. ఈ రోజు దేవుని కృప ముందు మరియ తల్లి వైఖరిని స్వీకరించడం కంటే
మనం ఏలాంటి మంచి నూతన సంవత్సర తీర్మానం చేసుకోగలం? తన
కుమారుడైన క్రీస్తులో మనకు తెలియజేయబడిన దేవుని దయగల ప్రేమ ముందు మరియమాత విస్మయం
మరియు ఆశ్చర్య భావనలో పాలుపంచుకోవడానికి నేటి అర్చన మనల్ని ఆహ్వానిస్తుంది. కళంకము
లేని నిత్య కన్య మరియ తల్లి చేసినట్లుగా
సువార్తను విలువైనదిగా పరిగణించడంలో సహాయం చేయమని మనం అడుగుదాము. తద్వారా క్రీస్తు తన మాతృ మూర్తి మరియ ద్వారా
మన వద్దకు వచ్చినట్లే మన ద్వారా ఇతరుల దరికి వస్తాడు.
“సమస్త జనులు ఆమె పిల్లలు అని
పిలువబడతారు. అందుకే సర్వోన్నతుడు స్వయంగా ఆమెను స్థాపించాడు”.
No comments:
Post a Comment