AletheiAnveshana: అనివార్యమైన ప్రబోధన లక్ష్యం యెష 35:1-6,10; యోహా 5:7-10; మత్త 11:2-11

Friday, 12 December 2025

అనివార్యమైన ప్రబోధన లక్ష్యం యెష 35:1-6,10; యోహా 5:7-10; మత్త 11:2-11

 

అనివార్యమైన ప్రబోధన లక్ష్యం

యెష 35:1-6,10; యోహా 5:7-10; మత్త 11:2-11

యోహాను స్వరం మరియు క్రీస్తు వాక్కు 

ఆగమన కాలపు మూడవ ఆదివారం సాంప్రదాయకంగా “గౌదాతే” ఆదివారంగా  పిలువబడుతుంది. లతీను భాషా పదం “గౌదాతే” అంటే "ఆనందించండి" అని అర్థం. ఈ ఆదివారం గురువు సమర్పించే నేటి పూజా ప్రవేశ వచనంలోని (యాంటీఫోన్‌) మొదటి పదం "ఆనందించండి". కాబట్టి ఈ ఆదివారంను అలాంటి పేరున పిలువబడింది. సాధారణంగా పూజకు ముందు ప్రవేశ గీతమునకు బదులుగా ఇటువంటి ప్రవేశ వచనములను గురువు చెబుతారు. ప్రవేశ గీతములు సర్వ సాధారణమవ్వడం వల్ల ఇటువంటి మంచి వాక్యాలను మనం చాలా సమయాల్లో కోల్పో వలసివస్తుంది. ఈ ప్రవేశ వచనాలు వంద శాతం పరిశుద్ధ గ్రంధ వాక్యాలే!! నేటి “గౌదాతే” పదం కూడా పరిశుద్ద గ్రంధ వాక్యమే!! ఇది ఫిలిప్పీయులకు వ్రాయ బడిన పత్రిక 4:4-5 నుండి తీసుకోబడింది: "ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి; మళ్ళీ నేను చెప్తున్నాను, ఆనందించండి! ప్రభువు దగ్గరలో ఉన్నాడు" అని భక్త పౌలుడు తన ఫిలిప్పియ సంఘాన్ని ఉత్తేజ పరుస్తాడు. కొంతమంది ఈ ఆదివారం తమ ఆగమనకాలపు ఉట్టి (wreeth) లేదా ఆగమానపు పుష్ప గుచ్చమునకు పెట్టిన ఊదా రంగు కొవ్వొత్తికి బదులుగా గులాబీ రంగు కొవ్వొత్తితో గుర్తుంచుకుంటారు. ఇది కథోలిక కుటుంబ సంప్రదాయం. బహుశః మీ ఆలయాలలోనే మీరు ఈ తంతును చూసి వుంటారు. ఇళ్ళల్లోనికి చిన్నపాటి పశువుల పాక లేదా క్రిస్టమస్ Tree తప్ప ఈ wreeth సంప్రదాయ తంతు ఇంకా అంతగా చోటు చేసులోలేదు అనుకుంటాను. నేటి పఠనాలు  మనకు తెలియ చేస్తున్నట్లుగా దేవుని మహిమను సందర్శించడంలో మన రక్షణ కనుగొనబడుతుందని ఒక ఆనందకరమైన జ్ఞాపిక వుంటుంది ఈ ఆదివారం!

ఈరోజు గత ఆదివారం వలెనే తిరుసభ మనకు బాప్తిస్మ యోహాను మూర్తిని అందిస్తుంది. యోహాను తన జీవన విధానంలో మరియు సత్యం పట్ల తన విశ్వసనీయతలో దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అందు వలన అతనికి జైలు శిక్ష మరియు బలిదానం ఒక వరమయ్యాయి. జైలు నుండి కూడా, అతను హేరోదుతో ప్రభావవంతంగా మాట్లాడాడు. తప్పును మరియు అధర్మాన్నిఖండించాడు. యోహాను  స్వభావ దృఢత్వాన్ని వినయంతో ఎలా ఏకం చేయాలో : “నా వెనుక వచ్చువాడు, ఆయన చెప్పుల పట్టీని విప్పుటకైనా నేను అర్హుడిని కాదు” (యోహా 1:27); “ఆయన హెచ్చింప బడాలి; నేను తగ్గింపు బడాలి” (యోహా 3:30) అన్న వాక్యంతో మనకు బోధిస్తున్నాడు.  తనకంటే ఎక్కువ మందికి యేసు బాప్తిస్మం ఇస్తున్నందుకు అతను సంతోషించాడు. ఎందుకంటే అతను తనను తాను “పెండ్లి కుమార్తె గాన్నూ, యేసు “ఉన్నవాడు”, పెండ్లికుమారుడు మరియు ఉత్తమ పురుషుడు” (యోహా 3:26) అని భావించాడు.

 మన భూలోక ప్రయాణాన్ని తీవ్రతరం చేసుకోమని  యోహాను మనకు బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాలను గడపడంలో మనం త్రికరణంగా స్థిరమైన క్రైస్తవులుగా ఉండాలి. యోసేపు యేసుక్రీస్తు జననానికి ఎలా సిద్ధమై ఉండేవారు? యోహాను యేసు బోధనకు ఎలా సిద్ధం చేశాడు? వారి తయారీని పరిగణనలోకి మనం తీసుకుంటే, యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు ఆయన రెండవ రాకడను స్వాగతించడానికి మనం ఎంతగా సిద్ధం కావాలో అర్ధ మవుతుంది. జెరూసలేం పునీత సిరిల్ : “మేము క్రీస్తు రాకను మాత్రమే కాదు, రెండవ రాకను కూడా ప్రకటిస్తున్నాము. ఇది మునుపటి రాక కంటే చాలా మహిమాన్వితమైనది. ఎందుకంటే మొదటిది తన సహనాన్ని చూపిస్తుంది, కానీ తరువాతిది దానితో దైవిక రాజ్యపు కిరీటాన్ని తెస్తుంది” అని అంటున్నాడు.

“ ‘యోహాను బంధించబడిన తరువాత, యేసు గలిలయకు వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తూ, ‘సమయం పూర్తయింది, దేవుని రాజ్యం దగ్గరపడింది: పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి’ (మార్కు 1:14-15) అని  అన్నాడు. సువార్తికుడు మార్కు వచనాన్ని ఉటంకిస్తూ, కథోలిక సంఘం తన సత్యోపదేశ సంక్షేమ బోధన  (541), ‘తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మరియు భూమిపై పరలోక రాజ్యాన్ని క్రీస్తుప్రారంభించాలని’ బోధిస్తుంది. ఇప్పుడు తండ్రి తన చిత్తం ‘తన స్వంత దైవిక జీవితంలో పాలుపంచుకోవడానికి మనల్ని ఉత్తేజపరుస్తుంది’. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వైపు మనల్ని ఆకర్షించడం ద్వారా ఈ పనిని పరిపూర్తి చేస్తున్నాడు. సంఘంగా మరియు రక్షణ పొందుకున్న క్రైస్తావునిగా ఆ  సువార్తను ప్రకటించే ధైర్య లక్ష్యo మనకు  ఉందా???

 

ప్రభువు ఆలస్యం చేయకుండా వస్తాడు. చీకటి దాచిపెట్టిన దానిని ఆయన వెలుగులోకి తీసుకోస్తాడు.”

 

No comments:

Post a Comment