పవిత్ర ఆదివారం
పవిత్ర శనివారం కొరకు
ఒక ప్రాచీన ప్రవచనం నుండి తీసుకొనబడినది
ప్రభువు పాతాళ లోకంలోకి దిగిరావడం
ఏదో వింత జరుగుతోంది – ఈ రోజు భూమిపై
గొప్ప నిశ్శబ్దం.
గొప్ప నిశ్శబ్దం
మరియు నిశ్చలత నెలకొని ఉంది. రాజు నిద్రపోతున్నందున భూమండలమంతా నిశ్శబ్దంగా ఉంది.
దేవుడు శరీరధారిగా నిద్రించినందున భూమి వణికి, నిశ్చలంగా
ఉంది. మరియు లోకం ఆరంభమైనప్పటి నుండి
నిద్రించిన వారందరినీ ఆయన లేవనెత్తాడు. దేవుడు శరీరధారిగా మరణించాడు. మరియు పాతాళం భయంతో వణికిపోతోంది.
తప్పిపోయిన గొఱ్ఱె పిల్లను వెదకినట్టుగా, ఆయన మన మొదటి తండ్రిని వెదకడానికి
వెళ్ళాడు. చీకటిలోను, మరణ ఛాయలోను నివసించే వారిని
పరామర్శించాలని ఎంతగానో కోరుకుంటూ,
దేవుడునూ, రెండవ హవ్వ
కుమారుడును అయిన ఆయన, చెరలో ఉన్న ఆదాము, హవ్వలను దుఃఖము నుండి విడిపించడానికి
వెళ్ళాడు. తనకు విజయాన్ని సాధించిపెట్టిన ఆయుధమైన శిలువను ధరించి ప్రభువు వారిని
సమీపించాడు. ఆయనను చూడగానే,
ఆయన సృష్టించిన మొదటి
మానవుడైన ఆదాము, భయంతో తన రొమ్ము కొట్టుకొని, అందరినీ ఉద్దేశించి, “నా ప్రభువు మీ అందరితో ఉండుగాక” అని కేక
వేశాడు. క్రీస్తు అతనికి,
“నీ ఆత్మతో కూడా
ఉండుగాక” అని జవాబిచ్చాడు. ఆయన అతని చేయి పట్టుకొని పైకి లేపి, “ఓ నిద్రపోతున్నవాడా, మేల్కొనుము, మృతులలో నుండి లేచి నిలబడుము, అప్పుడు క్రీస్తు నీకు వెలుగునిస్తాడు”
అని చెప్పాడు.
నేను మీ దేవుడను, మీ నిమిత్తము మీ కుమారుడనయ్యాను (మీ
వంటి వాడనయ్యాను). మీ మీదను,
మీ సంతతి మీదను ఉన్న
ప్రేమతో, ఇప్పుడు నా స్వంత అధికారంతో, బానిసత్వంలో ఉన్నవారందరూ బయటకు రావాలని, చీకటిలో ఉన్నవారందరూ జ్ఞానోదయం పొందాలని, నిద్రపోతున్నవారందరూ మేల్కొనాలని
ఆజ్ఞాపిస్తున్నాను. ఓ నిద్రపోతున్నవాడా!
మేల్కొనమని నేను
నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నిన్ను నరకంలో ఖైదీగా ఉంచడానికి నేను సృష్టించలేదు.
మృతులలో నుండి లే!!!
ఎందుకంటే నేను
మృతులకు జీవమును. నా చేతుల పనియైన నీవు,
నా స్వరూపంలో
సృష్టించబడినవాడా, లే..లెమ్ము!!, మనము ఈ స్థలాన్ని విడిచివెళ్దాం, ఎందుకంటే నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను. మనమిద్దరం కలిసి ఒకే వ్యక్తిగా ఒకరై ఉన్నాము. మనల్ని మనం వేరు చేసుకోలేము. మీ
నిమిత్తము, మీ దేవుడనైన నేను (మీ వంటి వాడనయ్యాను) మీ
కుమారుడనయ్యాను.
ప్రభువునైన నేను
దాసుని రూపమును ధరించాను.
ఆకాశములకు పైన
నివసించు నేను, భూమి మీదకు మరియు భూమి క్రింద
పాతాళమునకు దిగివచ్చాను. మీ నిమిత్తము,
మానవుని నిమిత్తము, నేను సహాయం లేని మనిషిలా, మృతులలో స్వేచ్ఛగా మారాను. (ఏదోను) తోటను
విడిచిపెట్టిన నీ నిమిత్తమే,
నేను తోటలోనే యూదులకు
అప్పగించబడి, తోటలోనే శిలువ వేయబడ్డాను.
ఒకప్పుడు నేను నీలో ఊదిన ప్రాణాన్ని
నీకు తిరిగి ఇవ్వడానికి,
నా ముఖం మీద నేను
పొందిన ఉమ్మిని చూడు. నీ వక్ర స్వభావాన్ని నా స్వరూపంలోకి మార్చడానికి నేను పొందిన
దెబ్బల గుర్తులను అక్కడ చూడు. నీ వీపుపై ఉన్న పాపభారాన్ని తొలగించడానికి నేను
సహించిన కొరడా దెబ్బల గుర్తులను నా వీపుపై చూడు. ఒకప్పుడు దుర్మార్గంగా చెట్టు
వైపు చెయ్యి చాచిన నీ కోసం,
చెట్టుకు గట్టిగా
మేకులతో కొట్టబడిన నా చేతులను చూడు. పరలోకంలో నిద్రపోయి, నీ ప్రక్కటెముక నుండి హవ్వను కన్న నీ
కోసం, నేను శిలువపై నిద్రించాను. ఒక ఖడ్గం నా ప్రక్కను పొడిచింది. నా
ప్రక్క నీలోని నొప్పిని స్వస్థపరిచింది. నా నిద్ర నిన్ను నరక నిద్ర నుండి
మేల్కొలుపుతుంది. నన్ను పొడిచిన ఖడ్గమే,
నీకు విరోధంగా
తిప్పబడిన ఖడ్గాన్ని ఒరలో పెట్టింది.
లేవండి! మనం ఈ స్థలాన్ని విడిచి వెళ్దాం.
శత్రువు మిమ్మల్ని భూలోక పరదైసు నుండి బయటకు నడిపించాడు. నేను మిమ్మల్ని ఆ
పరదైసుకు తిరిగి తీసుకువెళ్ళను.
కానీ నేను మిమ్మల్ని
పరలోకంలో సింహాసనంపై కూర్చోబెడతాను. జీవానికి కేవలం ఒక చిహ్నమైన వృక్షాన్ని నేను
మీకు నిషేధించాను.
కానీ ఇదిగో! జీవ స్వరూపుడైన నేను ఇప్పుడు మీతో ఏకమై
ఉన్నాను. దాసులను కాపాడినట్లుగా మిమ్మల్ని కాపాడటానికి నేను కెరూబులను నియమించాను. కానీ ఇప్పుడు నేను వారిచేత మిమ్మల్ని
దేవునిగా ఆరాధించేలా చేస్తున్నాను. కెరూబులచే ఏర్పరచబడిన సింహాసనం మీ కోసం వేచి
ఉంది. దానిని మోసేవారు వేగవంతులు మరియు
ఆసక్తిగలవారు. పెండ్లికూటమి అలంకరించబడింది. విందు
సిద్ధంగా ఉంది.
శాశ్వత నివాస స్థలాలు
సిద్ధం చేయబడ్డాయి.
సకల మంచి వస్తువుల
నిధి గృహాలు తెరవబడి ఉన్నాయి. పరలోక రాజ్యం అనాది నుండి మీ కోసం సిద్ధం చేయబడింది.
“నేను మరణించి
ఉన్నాను.
ఇప్పు
డు నేను శాశ్వతంగా జీవించబోతున్నాను. మరణం మరియు నరకపు తాళాలు నా చేతిలో
ఉన్నాయి”.
No comments:
Post a Comment