దివ్య కారుణ్య ఆదివారం
అపొ 2:42-47; 1 పేతురు 1:3-9; యోహాను 20:19-31 (A)
ఈ
రోజు, ఈస్టర్
రెండవ ఆదివారమైన నాడు, రెండవ వాటికను మహా సభ ద్వారా
పునరుద్ధరించబడిన దైవార్చన క్రమంలో ఉన్న రెండు అష్టమిలలో ఒకటైన ఈస్టర్ అష్టమిని
మనం పూర్తి చేస్తున్నాము. క్రిస్మస్‌తో పాటు ఇది రెండవది. ఎనిమిది రోజుల పాటు, మనం అదే మర్మాన్ని
ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మ వెలుగులో దానిపై మన అవగాహనను మరింత లోతుగా
పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
పోప్
సెయింట్ రెండవ జాన్ పాల్ గారి రూపకల్పన ప్రకారం, ఈ ఆదివారం దివ్యకారుణ్య ఆదివారం. ఇది ఒక
నిర్దిష్ట భక్తికి మించిన విషయం. పరిశుద్ధ తండ్రి గారు తన “డివైన్ మిసెరికోర్దియ”
(దైవ కరుణ) అనే ఎన్సికల్ లో - పాపంతో గాయపడిన చరిత్రలో దేవుని
ప్రేమపూర్వక అభివ్యక్తియే దైవ కరుణ అని ఈ పడుగకు వివరణ ఇచ్చారు. లాటిన్ పదం
“మిసెరికోర్డియా”కు “కరుణ” అని అర్థం. మరియు ఇది రెండు లాటిను పదములు “మిజర్” (“దుఃఖం”) మరియు “కోర్, కార్డిస్”
(“హృదయం”) నుండి జనించింది. పాపం కారణంగా
మనకు కలిగే దుఃఖకరమైన పరిస్థితిని తన తండ్రి దేవుడు తన హృదయంలో నిలిపాడు. అది
ఆయన ప్రణాళికలకు విశ్వసనీయంగా ఉంటుంది. మరణించి, తిరిగి లేచిన యేసు క్రీస్తు, దైవ కరుణ యొక్క
అత్యున్నత అభివ్యక్తి మరియు ప్రణాళిక ఇది. “దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి, తన ఏకైక
కుమారుడిని ఇచ్చాడు” (యోహాను 3:16)
మరియు మనం రక్షింపబడటానికి ఆయనను మరణానికి పంపాడు. “దాసుని
విమోచించడానికి, ఆయన కుమారుడిని బలిగా అర్పించాడు,” అని ఈస్టర్ జాగరణలో మనం ప్రకటించుకున్నాము.
మరియు పునరుత్థానం చెందిన తర్వాత,
ఆయనను విశ్వసించే వారందరికీ ఆయనను రక్షణకు మూలంగా చేశాడు. విశ్వాసం
మరియు పరివర్తన ద్వారా, మనం దైవ కరుణ అనే నిధిని పొందుకుంటున్నాము.
పవిత్ర
మాతృ సంఘం తన బిడ్డలు పునరుత్థానుని జీవితాన్ని జీవించాలని కోరుకుంటుంది మరియు
ఈస్టర్ కాలంలో పవిత్ర దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించమని మనకు ఆజ్ఞాపిస్తుంది.
నిజానికి, ఈస్టర్ కాలం పాస్కా నెరవేర్పునకు అనువైన సమయం. పునరుత్థానుడైన
ప్రభువు తన సంఘానికి ప్రసాదించిన అధికారాల ద్వారా మన పాపాలను ఒప్పుకోవడానికి మరియు
వాటి క్షమాపణను పొందడానికి ఇది మంచి సమయం. ఆయన అపొస్తలులతో మాత్రమే ఇలా అన్నారు:
“పరిశుద్ధాత్మను స్వీకరించండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో, అవి వారికి
క్షమించబడతాయి” (యోహాను 20:22-23).
ఈ విధంగా, మనం దైవ కరుణ మూలాల వద్దకు వెళ్ళగలం. మరియు మన స్నేహితులను ఈ జీవన
మూలాలైన దివ్య సత్ప్రసాదం మరియు పశ్చాత్తాపం వద్దకు తీసుకురావడానికి మనం
సంకోచించవద్దు. పునరుత్థానుడైన యేసు మన సాక్ష్యంపై ఆధారపడి ఉన్నారు.
తోమా
తన గురువును గుర్తించినప్పుడు,
యేసు నిజంగా ప్రభువు మరియు నిజంగా దేవుడు అని నమ్మి ప్రకటించాడు!
విశ్వాసం అనే వరం ద్వారా, మనం కూడా యేసు మన వ్యక్తిగత ప్రభువు మరియు మన దేవుడు అని ప్రకటించుదాము.
మనం కూడా ఆయనలో నూతన జీవితాన్ని పొందుట కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. మనం
ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొని,
ఆయన పునరుత్థాన శక్తి ద్వారా ఈ నూతన జీవన విధానంలో నడుచుకొనుట కొరకు, ప్రభువు తన
పరిశుద్ధాత్మలో మనలో ప్రతి ఒక్కరికీ నూతన జీవితాన్ని అందిస్తున్నాడు. మనకు నూతన
జీవితం, నిరీక్షణ
మరియు ఆనందాన్ని తీసుకురావడానికి సువార్త శుభవార్తను మరియు పరిశుద్ధాత్మ శక్తిని
మనం విశ్వసిస్తున్నామా?
No comments:
Post a Comment