ప్రభువు ఆరోహణము
అపొ 1:1-11; ఎఫె 1:17-23; మత్త 28:16-20 (ఎ)
“ఆయన శ్రమల తరువాత, యేసు నలభై రోజులపాటు తన శిష్యులకు
ప్రత్యక్షమై,
వారికి దేవుని రాజ్యమును గూర్చి
బోధించెను” (Divine Office)
ఈ క్రింది ధ్యానం పునీత అగస్టీను గారి ఒక ప్రసంగం నుండి
తీసుకొనబడింది
పరలోకం
నుండి దిగివచ్చినవాడు తప్ప మరెవరూ పరలోకానికి ఎక్కలేదు. ఈనాడు మన ప్రభువైన
యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యారు. మన హృదయాలు కూడా ఆయనతోపాటు ఆరోహణమగుగాక!
అపొస్తలుని మాటలు వినండి: మీరు క్రీస్తుతోపాటు లేచియున్న యెడల, పైనున్న వాటిమీద
మీ హృదయములను నిలపండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు. భూమిమీద
ఉన్నవాటిని కాక, పైనున్న వాటినే వెదకండి. ఆయన ఆరోహణమైన తరువాతనూ మనతో ఎలా
నిలిచియున్నాడో, అలాగే మన శరీరాలలో ఆయన వాగ్దానం ఇంకా నెరవేరకపోయినప్పటికీ, మనమునూ ఇప్పటికే
ఆయనతోపాటు పరలోకంలో ఉన్నాము.
క్రీస్తు
ఇప్పుడు పరలోకానికి ఆరోహణుడై ఉన్నాడు. కానీ ఆయన శరీర అవయవాలైన మనం భరించవలసిన
బాధలన్నింటినీ ఆయన ఇప్పటికి ఇంకా భూమి మీద అనుభవిస్తున్నాడు. ఆయన
పైనుండి:"సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు?" అని కేక వేసినప్పుడు ఇది స్పష్టమైంది. మరియు
"నేను ఆకలితో ఉన్నప్పుడు,
మీరు నాకు ఆహారం ఇచ్చారు" అని చెప్పినప్పుడు సహితం ఇది స్పష్ట
మైంది. ఆయనతో మనల్ని ఏకం చేసే విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమ ద్వారా, భూమి మీద ఉన్న మనం
ఇప్పటికీ పరలోకంలో ఆయనతో విశ్రాంతి పొందడానికి ఎందుకు ప్రయత్నించలేక పోతున్నాము? ఆయన పరలోకంలో
ఉన్నప్పుడునూ, ఆయన మనతోనే ఉంటున్నాడు. భూమి మీద ఉన్న మనం ఆయనతోనే ఉంటు న్నాము.
ఆయన తన దైవత్వం, తన శక్తి మరియు తన ప్రేమ ద్వారా ఇక్కడ మనతోనే ఉంటున్నాడు. ఆయన భూమి
మీద తన దైవత్వంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ ఉండలేము. పరలోక అనుభూతి చెందలేము. కానీఆయన
ప్రేమ ద్వారా, మరియు ఆయనలో మనం అక్కడ వుంటూనే ఆ అనుభూతిని పొందగలం.
ఆయన
మన దగ్గరకు దిగివచ్చినప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టలేదు. తిరిగి పరలోకానికి
ఆరోహణమైనప్పుడు మన నుండి ఆయన వైదొలగనూ లేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడే అదే సమయంలో పరలోకంలోనూ
ఉన్నాడన్న వాస్తవం ఆయన స్వయంగా చెప్పిన ఈ మాట ద్వారా ఋజువవుతోంది. పరలోకంలో ఉన్న
మనుష్యకుమారుడు పరలోకం నుండి దిగివచ్చి, మళ్ళి పరలోకమునకు ఆరోహణ మయినట్లుగా మరెవరూ
ఎన్నడునూ పరలోకానికి ఆరోహణ కాలేదు. ఈ
మాటలు క్రీస్తుతో మనకున్న ఏకత్వాన్ని వివరిస్తున్నాయి. ఎందుకంటే ఆయనే మన
శిరస్సు, మనము ఆయన శరీరము. క్రీస్తు తప్ప మరెవరూ పరలోకానికి ఆరోహణ కాలేదు. ఎందుకంటే
మనమునూ క్రీస్తే. మనతో ఆయనకున్న ఐక్యత ద్వారా ఆయన మనుష్యకుమారుడు మరియు
ఆయనతో మనకున్న ఐక్యత ద్వారా మనము దేవుని కుమారులము. కాబట్టి, అపొస్తలుడు “అనేక
అవయవాలు గల మానవ శరీరం, ఆ వేర్వేరు అవయవాలన్నీ కలిసి ఒకే శరీరంగా ఏకమై ఉన్నట్లే, క్రీస్తు విషయంలో
కూడా అలాగే ఉంది. ఆయనకు కూడా అనేక అవయవాలు ఉన్నాయి. కానీ శరీరం ఒక్కటే అని అంటున్నాడు.
మనపై
కరుణతో ఆయన పరలోకం నుండి దిగివచ్చాడు. మరియు ఆయన ఒంటరిగా ఆరోహణమైనప్పటికీ, మనము కూడా
ఆరోహణమవుతాము, ఎందుకంటే కృప ద్వారా మనము ఆయనలో ఉన్నాము. ఈ విధంగా, క్రీస్తు తప్ప
మరెవరూ దిగిరాలేదు. మరియు క్రీస్తు తప్ప మరెవరూ ఆరోహణమవ్వలేదు. శిరస్సుకు మరియు
శరీరానికి మధ్య భేదం లేదని కాదు. కానీ ఏకత్వమైన శరీరాన్ని శిరస్సు నుండి వేరు
చేయలేము కాబట్టే.
“క్రీస్తు ఉన్నత స్థలములకు ఆరోహణమైనప్పుడు, బందీ అయిన వారిని ఆకర్షించాడు” (Divine Office)
No comments:
Post a Comment