AletheiAnveshana

Saturday, 28 June 2025

“Pillars of the Church” Acts 12:1-112 Tim 4:6-8,17-18; Mt 16:13-19 (13/ C)


“Pillars of the Church”

Acts 12:1-112 Tim 4:6-8,17-18; Mt 16:13-19 (13/ C)

Although they suffered on different days, they were as one. Peter went first, Paul followed” (St Augustine)

Today we celebrate the solemnity of St. Peter and St. Paul, who were foundational to the early Church and our Christian faith. The Apostles lived through the initial moments of the Church’s expansion and sealed their loyalty to Jesus with their blood. When we consider Sts. Peter and  Paul, we are often drawn into a reflection of their lives before they became committed apostles. We remember Simon, who tried to walk on water towards the Lord and then sank when he questioned his faith, or his denial of the Lord three times.  Or we remember Saul of Tarsus, who persecuted Christians and brought them to trial before the Jewish authorities. 

Yet each was committed to bringing the Gospel of the Lord to the center of the world, the very capital of the Roman Empire. It is shocking that St. Peter, a simple fisherman from Galilee, would travel to Rome. It was the Spirit of Christ, the Holy Spirit, who sent him there. He was the head of the other apostles, the Rock on which Jesus built his Church. He embraced death in Rome, nourishing the soil of the Church with his blood. St. Paul was a scholar and a determined missionary. He sought out places to proclaim the Gospel or to sustain the proclamation made by others. He suffered continual tortures and brushes with death for the sake of the Gospel (2 Cor 11:22-29).  He was eventually killed as a Roman citizen, beheaded, nourishing the Church in Rome.

What do we learn from these “pillars of the Church? The faith and strength for martyrdom do not come from human capacity. It was indeed God’s grace that revealed the revelation of his Father in heaven (cf. Mt 16:17) and made Saul recognize Jesus, the Lord, “as the one he was persecuting”. In both cases, human freedom, necessary for the act of faith, leans on the Holy Spirit's action. Celebrating these two leading apostles in a single feast is a vibrant reminder that the church needs both the formal, enduring, petrine, papal, and canonical leadership and the more charismatic, personal, and inspirational leadership provided by characters like Paul. Such leadership is ever ready to question old ways and seek newer forms of bringing Christ into people’s lives today.

In one of his first interventions addressing the Cardinals, Pope Francis told them that we must 'walk, build and confess'. That is, we must move forward in our way of life by building up our Church and by giving testimony of the Lord. But the Pope warned: “We can walk as much as we want, we can build many things, but if we do not profess Jesus Christ, things go wrong. We may become a charitable NGO, but not the Church, the Bride of the Lord.” We should also know how to be reliable witnesses of the love of God in the venomous situations. The best way to honor their memory is to treasure the faith that they taught and pass it on to others as best we can.

“Whose sins you forgive, they will be forgiven them; whose sins you retain, they will be retained.”

 

Saturday, 21 June 2025

మనిషిగా మారి మనుషులను దేవుళ్ళుగా చేయుటకు ... ఆది 14:18-20; 1 కొరింథీ 11:23-26; లూకా 9:11-17 (12 /C)

 

మనిషిగా మారి మనుషులను దేవుళ్ళుగా చేయుటకు ...

ఆది 14:18-20; 1 కొరింథీ 11:23-26; లూకా 9:11-17 (12 /C)

"మన ప్రభువు ఈ సంస్కారమును కడరాత్రి భోజనంలో స్థాపించాడు" (పునీత థామసు అక్వినాసు)

ఈ రోజు యేసు క్రీస్తు పరమ పవిత్ర శరీరరక్తముల అద్భుతమును మాతృ శ్రీసభతో కొనియాడుతున్నాము. ఒకప్పుడు, ఈ రోజును “కార్పస్ క్రిస్తి” అని పిలిచేవారు. ఇది లతీను భాష మాట. దిని అర్ధం "క్రీస్తు శరీరం".  బెల్జియం దేశంలో లీజు అను గ్రామానికి చెందిన ఒక నోర్బర్టైన్ మఠకన్యకకు కలిగిన భక్తిని ప్రస్పుటం చేస్తుంది ఈ పండుగ. ఆమె ధన్య జూలియాన గారు. ఈ పండుగ ఆమెకు రుణపడి ఉంది. ఆమె 1230 సంవత్సరములో తొలిసారిగా దివ్య సత్ప్రసాద ఆరాధనా భక్తిని ప్రారంభించింది. ఆమె పట్టుదల ద్వారా 1264 వ సంవత్సరములో పోపు అర్బన్ 4, కథోలిక సమాజమంతా  ఈ భక్తిని పాటించాలని ఆదేశించాడు. ఈ సత్ప్రసాదవిందు మన విశ్వాసం గురించి మూడు కీలకమైన ఒప్పుదలలను సంగ్రహిస్తుంది. మొదటిగా, దేవుడు నిజమైన దేవుడు మరియు నిజమైన మనిషి. అయిన క్రీస్తు వ్యక్తిలో భౌతికంగా ఉన్నాడు (1 కొరింథీ 11:27). రెండవదిగా, దేవుడు క్రీస్తు ఆధ్యాత్మిక శరీరమైన తన జనుల సంఘంలో భాగమై అంత్య కాలం వరకు ఉంటాడు (మత్త 18:20). మూడవదిగా, రొట్టె ద్రాక్షారస రూపంలో దేవుని సాన్నిథ్యం మనకొరకు  బలిపీఠంపై సమర్పింపబడే దివ్య బలిపూజ ద్వారా మనందరికీ అందుబాటులో వున్నాడు.

భూమిపై తన పరిచర్య దినములలో, యేసు ఇలా అన్నాడు, “నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవపు ఆహారమును. ఈ ఆహారమును భుజించువాడు శాశ్వతంగా జీవిస్తాడు. మరియు లోక జీవం కోసం నేను ఇచ్చే ఆహారం  నా మాంసం” (యోహాను 6:51). ప్రతీ దివ్య సత్ప్రసాద/ పూజ వేడుకలో రొట్టె క్రీస్తు శరీరంగానూ, ద్రాక్షారసం క్రీస్తు రక్తంగానూ మారుతుంది. దీనిని “ట్రాన్స్-సబ్-స్టాన్సీ-ఏయేషన్”  అనే వేదాంత మరియు సిద్ధాంతపరమైన పదంగా ఇంగ్లిష్ భాషన పిలుస్తారు. బలి పూజలో ఒక అభిషిక్త గరువు పరిశుద్ధాత్మదేవుని ప్రార్ధించడం ద్వారా ఈ పవిత్ర క్రియ జరుగుతుంది. రంగు రుచి కొలత మరియు రూపము మార్పుచెందకున్ననూ వానియందు ఇమిడియున్న స్వభావము మాత్రము రూపాంతరం చెందుతుంది. ఇది విశ్వాస రహస్యం. ఇలా చాలా ప్రదేశాలలో జరగిన అద్భుతములను – డి ఎన్ ఏ  పరీక్షల ద్వారా అవి నిజంగానే యేసు రక్తమాంసములని వాటికను నిరూపించింది. ఇటలీలోని లాంచి యానోలో జరిగిన అద్భుతం సమయం (730-750) నుండి భారతదేశంలోని కేరళలో జరిగిన నేటి అద్భుతం వరకు (2013), సత్ప్రసాద స్వరూపుడు యేసు ప్రతిరోజూ తన భక్తులను కలుస్తున్నాడు. మాతృ తిరుసభ జరుపుకొనే ప్రతీ పూజా/ దివ్య సత్ప్రసాద ఆరాధనలలో యేసు లోక సంరక్షణ కొరకు  ఒక ప్రత్యేక అర్పణగా తండ్రిదేవునకు తనను తాను సమర్పించుకుంటున్నాడు.

ప్రతీ దివ్య పూజలో మనము దివ్య సత్ప్రసాదమును స్వీకరించే ముందు,  గురువు పవిత్ర అతిధేయుడిని (అప్పమును)ఎత్తి పట్టుకొని, ఇదిగో దేవుని గొర్రెపిల్ల! ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు" (యోహాను 1: 29) అని చెబుతూ విశ్వాస ప్రకటన చేయమని మనల్ని ఆహ్వానిస్తాడు. అపుడు మనం, "ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను అర్హుడిని కాదు, కానీ మీరు ఒక్క మాట మాత్రమే చెప్పండి, అప్పుడు నా ఆత్మ స్వస్థత పొందుతుంది" అని అంటాము. గురువు “ఇది దేవుని గొర్రెపిల్ల చిహ్నం” అని చెప్పడు. కానీ “ఇది దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. ఈ దేవుని గొర్రెపిల్ల మన భారాలను మరియు బాధలను భరిస్తుంది, మన ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా సాన్నిద్గ్యం చేసుకొని ఉంటుంది.

కార్మెలు పర్వతంపై బాలు ప్రవక్తలతో జరిగిన నాటకీయ ఘర్షణ తర్వాత, యేలియా ప్రవక్త శారీరకంగానూ, భావోద్వేగపరంగానూ, మరియు ఆధ్యాత్మికంగానూ  అలసిపోయాడు. భయం మరియు నిరాశతో అతను అరణ్యంలోకి పారిపోయాడు. చచ్చిపోదామనుకున్నాడు. ఈ దుర్బల స్థితిలో, దేవుడు యేలియాను  తిట్టడు. తక్షణ చర్య కొరకు సంసిద్దకామన్నాడు. అందుకు ఆయన అతనికి రెండుసార్లు స్వర్గపు రొట్టె మరియు నీటితో తృప్తి పరచి, ఆపై సున్నితంగా, "నువ్వు తినకపోతే ప్రయాణం నీకు చాలా కష్టం" అని చెబుతాడు (1 రాజులు 19:7). నీవు యేలీయా వలే అలసిపోయావా? ముందున్న మార్గం చాలా భారం గానూ, కష్ట తరంగానూ ఉందని నీవు భావిస్తున్నావా? అప్పుడు ఆగి, దేవుడు చెప్పేది వినుము: "తినండి. త్రాగండి. విశ్రాంతి తీసుకోండి. నేను నిన్ను ఆదుకుంటాను."

“మరే ఇతర సంస్కారమునకు ఇంతకంటే గొప్ప స్వస్థత శక్తి లేదు" (పునీత థామసు అక్వినాసు)

Becoming man, He makes men gods Gen 14:18-20; 1 Cor 11:23-26; Lk 9:11-17 (12 /C)

 

Becoming man, He makes men gods

 

Gen 14:18-20; 1 Cor 11:23-26; Lk 9:11-17 (12 /C)

“Our Lord instituted this sacrament at the Last Supper” (St Thomas Aquinas)

 

Today is the Solemnity of the Most Holy Body and Blood of Christ. At one time, this day was called Corpus Christi. It is a Latin expression meaning “the Body of Christ.” The Feast owes its existence to Blessed Juliana of Liege, Belgium, who began devotion to the Blessed Sacrament around 1230. Largely through her insistence, Pope Urban 1V commanded its observance by the universal Church in 1264. The Feast encapsulates three crucial confessions about our Faith. First, God became physically present in the person of Christ, who is both true God and true Man (1 Cor 11:27). Secondly, God continues to be present in his people as part of the mystical body of Christ in his Church until the end of time. And thirdly, the presence of God under the form of bread and wine is made available to us on the altar at Mass and preserved there for our nourishment and worship.

 

During his ministry on earth, Jesus said, “I am the living bread that came down from Heaven. Whoever eats of this bread will live forever, and the bread that I shall give is my flesh for the life of the world” (Jn 6:51). The bread into the flesh and the wine into the blood of Jesus in every celebration of the Eucharist. This is known by a theological and Doctrinal term called Transubstantiation. The substance of the species transforms while its components remain the same, as we see color, measure, and taste by the invocation of the Holy Spirit by an ordained priest. It is a mystery of faith. It happens in many places and has been proven by the Vatican. In every Eucharist celebrated by the Community, Jesus offers himself to the Father as a special offering for the reconciliation of the world. From the time of the miracle at Lantiano, Italy (730-750) to the miracle at Kerala, India (2013), the Eucharistic Savior meets his devotees every day.

 

At every Mass, immediately before we receive communion, the celebrant holds up the consecrated host and calls us to make a profession of faith that this is Jesus, saying, “Behold the Lamb of God!  Behold him who takes away the sins of the world. Blessed are those called to the supper of the Lamb” (Jn 1:29).  And we say, “Lord, I am not worthy that you should enter under my roof, but only say the word and my soul shall be healed” (Mt 8:8). The celebrant does not say that this is a symbol of the Lamb of God.  He says that this is the Lamb of God. This lamb of God bears our burdens and sufferings, being immanent in each of us.

 

After his dramatic confrontation with the prophets of Baal on Mount Carmel, Elijah is exhausted—physically, emotionally, and spiritually. He flees into the wilderness, overwhelmed by fear and despair. In this vulnerable state, God does not scold Elijah, nor does he demand immediate action. Instead, he feeds him twice with heavenly bread and water, and then gently tells him, “The journey is too much for you, unless you eat” (1 Kgs 19:7). Are you tired, like Elijah? Do you feel the road ahead is too long? Then pause, and listen to God saying: “Eat. Drink. Rest. I will sustain you.”

 

“No other sacrament has greater healing power” (St Thomas Aquinas)

Friday, 20 June 2025

THE GOSPEL ACCORDING TO LUKE “The Urgency of Today” in the Parables of Luke (Lesson 10 – June 18, 2025)

 

THE GOSPEL ACCORDING TO LUKE

 

The Urgency of Today” in the Parables of Luke (Lesson 10 – June 18, 2025) 

Salt is good, but if salt itself loses its taste……whoever has ears to hear ought to hear” (Lk 14:34-35)

 

Opening Prayer: “Father, open our hearts to Your Word. Let me not harden my heart today, but listen, repent, and receive your grace with urgency and joy.  We ask this through Chris Our Lord, Amen.”

 

Unique and powerful parables that reflect its theological emphases: compassion, reversal of fortunes, inclusiveness, and God’s mercy:

 

1. The Parable of the Sower (Lk 8:4 -15)  Receptivity to God's Word. Faith and perseverance

2. The Lost Sheep (Lk 15:1- 7)

3. The Lost Coin (Lk 15:8 - 10)

4. The Prodigal Son (Lk 15:11- 32)

5. The Good Samaritan (Lk 10:25- 37)

6. The Rich Fool (Luke 12:13 - 21) The danger of greed and false security

7. The Barren Fig Tree (Lk 13:6 - 9) The urgency of repentance A call to act now and not delay

8. The Pharisee and the Tax Collector (Lk 18:9 - 14) Humility vs. self-righteousness

9. The Persistent Widow - the Unjust Judge (Lk 18:1-8) Perseverance in prayer without losing heart

10. The Dishonest Manager (Lk 16:1 - 13) “You cannot serve both God and money”

11. The Rich Man and Lazarus (Luke 16:19 - 31) Accountability to heed God’s Word now

12. The Workers Waiting for the Master (Lk 12:35 - 40) Watch and be ready for Christ's coming

13. The Great Banquet (Lk 14:15- 24) God's kingdom opened to the humble and excluded

14. The Ten Minas (Lk 19:11 - 27) Faithfulness with entrusted gifts with accountability

 

What Does “Today” Mean Theologically in Luke’s Parables?

 

Aspect                                                              Explanation

 

Salvation is now                          God’s kingdom is present; his grace is immediately available.

 

Response must be immediate     No time for delay or indifference; the present moment is decisive.

 

Judgment is real                           Postponing repentance risks missing out on God’s offer.

 

Grace is urgent but limited         God’s patience is great, but not endless; fruit is expected soon.

 

Reversal can happen now           The lowly can be lifted, and the secure brought low—right now

Reflection and Application

 

 

“Today, if you hear his voice, do not harden your hearts” (Ps 95:7, 8 / Heb 3:7). What is it that hardens me Today

 

 

Is there any area in my life where God is saying, “Respond today”?

 

 

 

What does it mean for me to act on God’s Word now, not later?

 

 

 

How does Jesus challenge my spiritual delay?

 

 

 

 A commitment I make today:

 

 

 

A truth from one parable that personally moved ME….

 

 

 

Closing Prayer: “Father, You call Me not to delay, not to make excuses, not to live in spiritual slumber. Wake me up. Let me hear your voice today, and respond with faith, repentance, and joy. We ask this to grant us through Christ Our Lord, in the Holy Spirit. Amen.”

 

 

 

“Today, salvation has come to this (MY) house…” (Lk 19:9)

Saturday, 14 June 2025

అందాన్ని సృష్టించిన అందాన్ని ప్రేమించండి సామె 8:22-31; రోమా 5:1-5; యోహాను 16:12-15 (సాధారణ 11/C)

 

 

అందాన్ని సృష్టించిన అందాన్ని ప్రేమించండి

సామె 8:22-31; రోమా 5:1-5; యోహాను 16:12-15 (సాధారణ 11/C)

తండ్రి వాక్కు ద్వారా మరియు పరిశుద్ధాత్మలో సమస్తమును చేయును” పునీత అథనాసియస్

 

ఈ రోజు మనం అత్యంత పవిత్ర త్రిమూర్తులు త్రిత్వైక దేవుని పండుగను జరుపుకుంటున్నాము. ఇది దేవుని అంతర్గత జీవిత రహస్యాన్ని వెల్లడిస్తుంది. మన దేవుడు వ్యక్తిగత దేవుడు మాత్రమే కాదు,  తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నవాడు. అదే సమయంలో ఒకే ఒక్క దేవుడై    ఉన్నాడని పవిత్ర గ్రంథం మనకు హామీ ఇస్తుంది. దీనికి మనం తార్కిక వివరణ ఇవ్వలేకపోయినా, కొంతవరకు దేవుని ఉనికిని అనుభవించడానికి మన విశ్వాసం మనకు వీలు కల్పిస్తుంది. 16 వ. బెనెడిక్టు  ఇలా అంటాడు, “ఆయన ఎవరో అని తెలుసుకోవడానికి దేవుడు చేసిన అద్భుతాల కోసం వెదకడం కాకుండా, ఆయన ఉనికి అందం, మంచితనం కోసం దేవుడిని స్తుతించమని నేటి అర్చనా విధానం మనల్ని ఆహ్వానిస్తుంది.” పునీత అగస్టీను తన “కన్ఫెషన్స్" అనే పుస్తకంలో ఈ రహస్యాన్ని ఇలా ప్రశ్నిస్తూ వివరిస్తాడు, నేను నా దేవుడిని ప్రేమించినప్పుడు నేను ఏమి ప్రేమిస్తాను? భౌతిక సౌందర్యం లేదా తాత్కాలిక క్రమం యొక్క అందం కాదు; భూసంబంధమైన కాంతి యొక్క ప్రకాశం కాదు; సామరస్యం మరియు సంగితపు మధురమైన శ్రావ్యత కాదు; పువ్వులు, పరిమళ ద్రవ్యాలు మరియు సుగంధ ద్రవ్యాల సువాసన కాదు; మన్నా లేదా తేనె కాదు; శరీరం ఆలింగనం చేసుకోవడానికి ఇష్టపడే అవయవాలు కూడా కాదు. నేను నా దేవుడిని ప్రేమించినప్పుడు నేను ప్రేమించేది వీటిని కాదు. అయినప్పటికీ, నేను ఆయనను ప్రేమించినప్పుడు, నా అంతరంగంలో కొలువైయున్న అందమైన ప్రేమ కాంతిని మాత్రమె  నేను ప్రేమిస్తాను అనేది సర్వనిజం”.


ఈ రోజు మనం జరుపుకునే పరమ పవిత్ర త్రిత్వం కాలానికి మరియు మానవ తార్కికతకు అతీతమైనది. ఇది మన విశ్వాస రహస్యం. కాంతి కిరణాల కోసం చీకటిలో మాత్రమే మనం తడబడగలం. "ఇద్దరు అంటే సహవాసం, ముగ్గురు అంటే ఒక సమూహం" అనేది ఒక ప్రసిద్ధ నానుడి. సువార్తలలోని అలంకారిక భాష “మూడు” అనే మాట పరిపూర్ణ సమరూపతను సూచిస్తుంది. క్రీస్తు జీవితం నిరంతర త్రిమూర్తులను ప్రతిబింబిస్తుంది. బెత్లెహేంలోని యేసు జనన దృశ్యంలో యేసు, మరియ యోసేపులు అనే పవిత్ర కుటుంబపు ముగ్గురు వ్యక్తులు. పశువుల పాక వద్ద ముగ్గురు జ్ఞానులు. యేసు ఎదుర్కొన్న సైతాను మూడు శోధనలు. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మూడు పాత్రలు. మంచి సమరయుని ఉపమానంలో ముగ్గురు బాటసారుల ప్రవర్తన. విత్తువాని ఉపమానాలలో మూడు వేర్వేరు రకాల భూములు మూడు వేర్వేరు స్థాయిల పంటలు. యేసును తిరస్కరించిన పేతురుని మూడు సమయాలు. కల్వరికి వెళ్ళే మార్గంలో యేసు మూడు పర్యాయాలు బోర్ల పడిపోవడాలు. మరియు యేసు సిలువ వేయబడిన దృశ్యంలో ఇద్దరు దొంగల మధ్య క్రీస్తుగా కన్పించే ముగ్గురు వ్యక్తులు. ఈ “మూడు” అనే  సంఖ్య అర్ధం తరచుగా దైవిక సంపూర్ణత, ఒడంబడిక నిర్ధారణ, ఆధ్యాత్మిక పరివర్తన మరియు పునరుత్థానం మరియు విముక్తిని సూచించే పరమార్ధం.


అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ (క్రీ.శ. 150-215) ఇలా వ్రాశాడు: “ఎంత ఆశ్చర్యకరమైన రహస్యం! విశ్వానికి ఒకే తండ్రి, విశ్వానికి ఒకే లోగోస్ (వాక్కు), మరియు ఒకే పరిశుద్ధాత్మ. ప్రతిచోటా అన్నింటి యందు అన్ని వేళలా ఒకేలా ఉన్నారు. జ్ఞానమందును, సత్యమందును, రక్షణ ప్రణాళిక యందును ఒకే చిత్తమై యున్నారు. మువ్వురు కలిసి ప్రేమ సంపూర్ణతను సూచిస్తున్నారు”. తండ్రి పంపిన పరిశుద్ధాత్మ కుమారుడి నుండి జనిస్తుంది. దేవుడు ప్రేమ”. తమ విశ్వాసుల పట్ల ఇది వారి మరువ రాని ప్రేమ. అదే ప్రేమలో మనం వారి త్రియేక దైవ స్వరూపంలో సృష్టించబడ్డాము. తండ్రి దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయన ఏకైక కుమారుడు మనల్ని రక్షించాడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. అలాగునే మన సాక్షిభూతమైన జీవితాలు ఈ లోకంలో ఈ త్రిమూర్తులను ప్రతిబింబించాలి.  ఎల్లప్పుడూ తండ్రిలా సృజనాత్మకంగా మనం ఉండాలి. ఆయన కుమారుడిలా కరుణామయులుగా ఉండాలి.  పరిశుద్ధాత్మలాగా ఇతరుల సేవలో మన ప్రతిభను ఉపయోగించాలి. దేవుని రహస్యాన్ని మనలో ఉంచుకోవడానికి మరియు భూమిపై మన స్వంత స్వర్గపు "పౌరసత్వం" (ఫిలి 3:20) జరుపుకోవడానికి, మనం పవిత్ర త్రిమూర్తుల వక్షస్థలంలో నివసించాలని లియో ది గ్రేట్ వ్రాశాడు.

 

పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్

Love the Beauty Beyond the Beauty Prov 8:22-31; Rom 5:1-5; Jn 16:12-15 (Ordinary 11/ C)

 

Love the Beauty Beyond the Beauty

 

Prov 8:22-31; Rom 5:1-5; Jn 16:12-15 (Ordinary 11/ C)

“Father makes all things through the Word and in the Holy Spirit” St Athanasius

 

Today we celebrate the Most Holy Trinity, the revelation of the mystery of God’s inner life. The Holy Scripture assures us that not only is our God a personal God, but God exists as three Persons, Father, Son, and Holy Spirit, while remaining one God. Although we cannot provide a logical explanation for this, our faith enables us, in some small measure, to experience the presence of God. Benedict XVI says, “The liturgy invites us to praise God not merely for the wonders that he has worked, but for who he is; for the beauty and goodness of his being.” St. Augustine, in his book “Confessions,” explains this mystery by questioning, “What do I love when I love my God? Not material beauty or beauty of a temporal order; not the brilliance of earthly light; not the sweet melody of harmony and song; not the fragrance of flowers, perfumes, and spices; not manna or honey; not limbs such as the body delights to embrace. It is not these that I love when I love my God. And yet, when I love him, it is true that I love the light of beautiful love in my inner self”.

 

The Holy Trinity, whose feast we celebrate today, is beyond the reach of time and the grasp of human reasoning. It is a mystery of our faith. We can only fumble in the dark in search of glimmers of light. “Two is company, three is a crowd” is a popular expression. Figurative language three in the Gospels symbolizes completeness and perfect symmetry. The life of Christ itself constantly reflected the nature of the Trinity. Three figures at the nativity scene in Bethlehem — the Holy Family of Jesus, Mary, and Joseph. The three wise men at the manger. The three temptations of Jesus by the devil. The three Characters in the parable of the Prodigal Son. The parable speaks of the behavior of three passers-by in the parable of the Good Samaritan. The three different types of terrain yield three different levels of harvest in the parables of the Sower.  Peter’s denial of Jesus three times. Jesus falls three times on the way to Calvary. The crucifixion scene features three figures: Christ between two thieves. The number three often connotes the Divine fullness, Covenantal confirmation, Spiritual transformation, Resurrection, and redemption.

 

Clement of Alexandria (150-215 AD) wrote: “What an astonishing mystery! There is one Father of the universe, one Logos of the universe, and one Holy Spirit, everywhere the same. There is also one virgin who becomes mother, and I should like to call her 'Church'. Together, they represent the fullness of love”. The Holy Spirit sent by the Father proceeds from the Son is their love for each other for their believers. So, “God is love”. We are made in the image of the triune God. God the Father created us, his only begotten Son saved us, and the Holy Spirit continues to guide us. Our lives reflect the Trinity in our witness in this world. We should always be creative like the Father, compassionate like his Son, and dispose of our talents in the service of others like the Holy Spirit. Leo the Great wrote that to keep God’s mystery within us and celebrate here on Earth our own Heavenly “citizenship” (Phil 3:20), we need to abide in the Holy Trinity’s bosom.

 

In the name of the Father, and of the Son, and of the Holy Spirit

 

Saturday, 7 June 2025

రండి. ఓ! పరిశుద్ధాత్మ అపొ 2:1-11; 1 కొరింథీ 12:3b-7,12-13; యోహాను 20:19-23 (8 ఈస్టర్/ సి)

 

రండి. ఓ! పరిశుద్ధాత్మ

అపొ 2:1-11; 1 కొరింథీ 12:3b-7,12-13; యోహాను 20:19-23 (8 ఈస్టర్/ సి)

అపొస్తలులు వేర్వేరు భాషలలో మాట్లాడి దేవుని అద్భుతమైన కార్యాలను ప్రకటించారు. అల్లెలుయా (Divine Office).

పస్కా పండుగ కాలం నేటి పెంతుకోస్తు పండుగతో ముగుస్తుంది. “పెంతుకోస్తు” అనే పదం గ్రీకు పదం “పెంటెకోస్టే” అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం “యాభైవ”. అదేవిధంగా, “పెంటా” అంటే “ఐదు” అని అర్ధం. “పెంతుకోస్తు” అనే పదం యూదు మతంలో కోత పండుగ “షావూట్” ను ప్రతిబింబిస్తుంది. యూదుల దైవార్చన సంస్కృతిని అనుసరించి, క్రైస్తవ మతం ఈస్టరు “యాభైవ” రోజు వేడుకను కొనియాడుతుంది. జెరూసలేంలోని మేడ పైగదిలో సమావేశమైన అపోస్తలులపై పరిశుద్ధాత్మ దిగివచ్చి వారిని ధైర్య వంతులను చేసిన సందర్భాన్ని మాతృ శ్రీసభ జరుపుకుంటుంది. క్రీస్తు ఆత్మ అయిన  పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువల పంటను తిరుసభ జరుపుకుంటుంది. మన విశ్వంలోని అనేక విషయాలు మన కంటికి కనిపించకపోయినా అవి వాస్తవమైనవే! మన కళ్ళతో మనం చూసేది మన భౌతిక ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది. తనను  మన భౌతిక కళ్ళతో చూడలేము.

పరిశుద్ధాత్మ ఫలం శిష్యులలో కొత్త మానవ స్థితిని సృష్టించింది. ఐక్యతను పెంపొందించింది. ప్రజల దురహంకారం బాబేలు గోపురాన్ని నిర్మించి  దేవుణ్ణి సవాలు చేయడానికి దారితీసినప్పుడు, దేవుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేని విధంగా వారి భాషలను తారుమారు చేశాడు (ఆది 11: 1-9). కానీ పెంతుకోస్తు నాడు, విభిన్న దేశాలు మరియు భాషలు గల ప్రజలందరూ అపోస్తలుల భాషను అర్థం చేసుకునేలా చేశాడు. శిష్యులు మేడ పైగదిలో కన్య మరియతో సమావేశమైనప్పుడు, “... అకస్మాత్తుగా ఆకాశం నుండి బలమైన గాలి వీచినట్లుగా ఒక శబ్దం వచ్చింది. అది వారు ఉన్న ఇంటినంతా నింపింది. అప్పుడు వారికి అగ్నిలాంటి నాలుకలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరిపై నిలిచాయి” (అపో 2:2-3). ఇది హీబ్రూ భాషలో “రువా” అనే పదానికి వివరణాత్మాక సంఘటన గానూ వున్నది.

అపోస్తలులందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి ధైర్యంగా ప్రకటించడం ప్రారంభించారు. ఒకప్పుడు అధికారులకు భయపడిన వీరు, జైలు శిక్ష, హింస, బలిదానానికి సయితం భయపడని ధైర్యవంతులైన ప్రబోధకులుగా రూపాంతరం చెందారు. "ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికత మరియు స్వీయ నియంత్రణ" (గలతీ 5:22) అనే సమాజాలను నిర్మించడానికి పరిశుద్ధాత్మ తోడుగా నడిపించెను. అలాగునే  మన బలహీనతలో మనకు సహాయపడుతూ (రోమా 8:26)  సందేహం, భయం మరియు మన వికృత కోరికల బానిసత్వం నుండి ఆధ్యాత్మిక స్వేచ్ఛలో ఎదగడానికి మనకు వీలు కల్పించడం (2 కొరింథీ 3:17; రోమా 8:21) తధ్యం. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించమని ఆత్మ మనకు నిర్దేశిస్తూ సత్యంలో మనల్ని ప్రతిష్టిoచి (యోహాను 17:17) మనల్ని అంతర్గతంగా రూపాంతరం చేయగలరు.

తిరుసభ పితృ పాదులు బేసిల్ ది గ్రేట్ (క్రీ.శ. 329-379) మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పాత్రను ఇలా వివరిస్తున్నాడు: “ఆత్మ మనకు స్వర్గాన్ని, స్వర్గానికి మార్గాన్ని మరియు దేవుని బిడ్డలుగా దత్తత తీసుకోవడాన్ని పునరుద్ధరించును. మనం దేవుణ్ణి నిజంగా తండ్రి అని పిలవగలమనే విశ్వాసాన్ని మనలో కలిగిస్తూ వెలుగు బిడ్డలుగా ఉండటానికి మరియు శాశ్వతమైన మహిమను ఆస్వాదించడానికి క్రీస్తు కృపను మనకు ప్రసాదించును. ఒక్క మాటలో చెప్పాలంటే, తను ఈ లోకంలో మరియు తదుపరి లోకంలో ఆశీర్వాదాల సంపూర్ణతను ప్రసాదించును”. పరిశుద్ధాత్మ మన ఆత్మకు ఆత్మ, మన జీవిత జీవితం, మన ఉనికికి ఉనికి. తాను మన పవిత్రకర్త. మన అంతరంగిక స్వభావానికి అతిథి. విశ్వాస జీవితంలో పరిణతి చెందడానికి, తనతో మన సంబంధం మరింత స్పృహతోనూ వ్యక్తిగతంగా మారాలి. కాబట్టి ఈ పెంతుకోస్తు వేడుకలో మన అంతర్గత ఉనికి తలుపులను తెరుద్దాం. రండి! ఓ! పరిశుద్ధాత్మమా! నాలోనికి రండి!!!

మీ ఆత్మను పంపండి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీరు భూ ముఖాన్ని పునరుద్ధరిస్తారు”. అల్లెలుయా (Divine Office).