మనుష్యులను పట్టుకొనే జాలరులుగా పిలువబడిన వారు...
యెష 8:23-9:3; 1 కొరింథీ 1:10-13, 17; మత్త 4:12-23 (A 3)
“...ప్రతి అర్చన వేడుక, ప్రధాన యాజకుడు క్రీస్తు
మరియు అతని శరీరమైన పవిత్ర సంఘ సంస్కారం (గా)...” (సాక్రోసాంక్తుం కొన్సీలియుం)
ఒకసారి, ఎస్కిన్స్
అనే ఒక సాధారణ వ్యక్తి సోక్రటీసు వద్దకు వచ్చి, “నేను
పేదవాడిని. నా దగ్గర ఇంకేమీ లేదు,
గురు
దక్షణగా నన్ను నేను నీకు అర్పించుకుంటాను” అని
అన్నాడు. అందుకు సోక్రటీసు,
“మీరు నాకు
అన్నిటికంటే విలువైనదానిని ఇస్తున్నారని మీరు చూడలేదా?” అని సమాధానమిచ్చాడు. యేసు అంతగా నేపథ్యం
లేని మత్స్యకారులను మనుషులను పట్టుకొనే జాలరులుగా మార్చాడు. యేసుకు కావలసింది తనకు
తాముగా ఇచ్చుకొనే సాధారణ జనులు. గతంలో,
“దైవ
పిలుపు” అనే
భావన గురుత్వ మరియు మఠవాస్య జీవితాన్ని ఉద్దేశించి మాత్రమె బోధించేది. ఇప్పుడు అది బాప్తిస్మం తీసుకున్న ప్రతి
ఒక్కరిని ఉద్దేశింప పునరుద్ధరించబడింది. దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ “నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను; నువ్వు నావాడివి” (యెష 43: 1) అని చెపుతూ ఎన్నుకున్నాడు. "మీరు నన్ను
ఎన్నుకొనలేదు గాని, నేను
మిమ్మును ఎన్నుకొంటిని; మీరు
ఫలించుటకును, మీ
ఫలము నిలిచియుండుటకును మిమ్మును నియమించితిని. వెళ్లి ఫలించండి. నిలిచి ఉండే ఫలాలను ఫలింప చేయమని నేను
నిన్ను నియమించాను" (యోహా 15:16) అని
నేటి సువార్త ద్వారా, మనం మళ్ళీ మనుషులను పట్టే జాలర్లుగా యేసుచే
పిలువబడుతున్నాము. మనం మంచి జాలరులమైతే.....
మంచి జాలరికి (i) చేప ఎరను పట్టే వరకు ఓపిక ఉండాలి. వారు అశాంతితో
ఉంటే, ఇక ఎన్నటికి జాలరిగా మారలేరు. (ii) ఏమీ ఫలించనప్పటికీ నిరుత్సాహపడకుండా
మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే పట్టుదల వారికి ఉండాలి. (iii) అలాంటి సమయంలో ప్రజలకు నిజం చెప్పడంలో ఎటువంటి ప్రమాదాన్నైనా
ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఆ జాలరులకు ఉండాలి. (iv) అటువంటి తరుణంలో
జాలరికి మాట్లాడాలన్నా
సరే సరైన క్షణం కోసం ఒక కన్ను వేసి ఉండాలి. చేప ఎరను కొరికే వరకు వేచి ఉండటానికి
మౌనంగా వుండడం చాలా వుత్తమమం. (v)
తెలివైన జాలరి తనను
తాను తన స్పృహలోనే వుంచుకుంటూ తన స్వంత ఉనికిని గానీ, కనీసం తన
స్వంత నీడను కూడా ఎరవైపు పదనివ్వకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే చేప ఖచ్చితంగా అ
ఏరను కాటు వేయదు. గేలానికి చిక్కదు. చివరగా,
క్రీస్తు కోసం జాలరి
ఎల్లప్పుడూ ప్రజలను తనవైపునకు ఆకర్షితులను చెసుకొనకుండా, యేసుక్రీస్తువైపు ప్రదర్శించడానికి లేదా
మళ్ళించడానికి ప్రయత్నించాలి. మనుషుల దృష్టిని తమ వైపు కాకుండా, క్రీస్తువైపు మాత్రమే ఉంచడానికి
లక్ష్యంగా పెట్టుకోవాలి. అలాకాక పొతే స్వరాజ్య పాలనలో క్రీస్తు పేరిట స్వంత
రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొనే శోధనలో పడిపోవచ్చు. ఆ తరువాత సర్వ నాశనానికి గురుకావచ్చు.
బాప్టిజం పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కోసం మనుష్యులను పట్టుకునే జాలరిగా
మారుతూ ఈ లక్ష్యాలను పాటించడం మంచిది.
బప్తిస్మపు వెలుగులో ఉన్నవారికి ప్రపంచం
చాలా అందంగా ఉంటుంది. యేసు వెలుగు లేకుండా చీకటిలో ఉన్నవారికి ప్రపంచం అతి భయంకరంగా
ఉంటుంది. మనం వెలుగులో ఉన్నాము. ఇతరులను మనం ఈ వెలుగులోనికి తీసుకురావాలి. సీమోను
పేతురు, ఆంద్రేయ, జేమ్స్
మరియు యోహానుల మాదిరిగానే,
ప్రపంచంలో సజీవంగా
మరియు చైతన్యంగా ఉన్న యేసుక్రీస్తు గురించి ప్రజలకు తెలియజేయడానికి మనం పిలువబడినావారము
(మత్త 18:20). ఆయన వారిని ప్రేమిస్తున్నాడని మరియు
వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడని మనం వారికి తెలియజేయాలి. యేసుక్రీస్తు మన కొరకు
మాత్రమె రాలేదు. ప్రభువు నామమున స్వార్థపూరిత ఉద్దేశాలను పొందుకోవడానికి మనం
పిలువబడలేదు. బదులుగా ఇతరులను క్రీస్తు వద్దకు
తీసుకురావడానికి క్రీస్తు ఆత్మ వరమున పొందుకున్న మన స్వంత ప్రత్యేకమైన ప్రతిభను
ఉపయోగించమని పిలువబడి నాము. పోపు ఫ్రాన్సీసు వారు, “లోతైన
నీటిలోకి వెళ్లి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి. మీరు కూడా ‘మనుష్యులను పట్టే
జాలర్లు’ కావాలని పిలువబడినారు. ముఖ్యంగా మీ తోటివారిలో, మీ సహచరులలో, సువార్తకు సంతోషంగా సాక్ష్యమివ్వడానికి...
మీ జీవితాన్ని అందించడానికి వెనుకాడకండి”
అని పిలుపు నివ్వడం మనం మర్చిపోకూడదు కదా!!!
“భూమిపై అర్చనా విధానం పరలోక ప్రార్థనా
విధానంలో పాలుపంచుకొనే అవకాశం మనకు ముందస్తు రుచిగా ఇవ్వబడింది...” (సాక్రోసాంక్తుం
కొన్సీలియుం)
No comments:
Post a Comment