AletheiAnveshana

Saturday, 20 September 2025

నీడ నిచ్చు పచ్చని ఆకుల నీతి సంపద ఆమో 8:4-7; 1 తిమోతి 2:1-8; లూకా 16:1-13 (25/ సి)

 

నీడ నిచ్చు పచ్చని ఆకుల నీతి సంపద

ఆమో 8:4-7; 1 తిమోతి 2:1-8; లూకా 16:1-13 (25/ సి)

క్రైస్తవులు నిత్యజీవం వైపు దూర దృష్టితో లౌకిక జీవిత వ్యవహారాలను నిర్వహించాలి.”

 

నేటి సువార్తలోని గృహనిర్వాహకుడికి ధనవంతునితో కలిగి ఉన్న సంబంధం దేవునితో మన సంబంధానికి అన్వయించాలని మాతృ శ్రీసభ కోరుతుంది. దేవుడు మనకు అప్పగించిన ప్రతిభలను ఉపయోగించడంలో ఈ సంబధం అద్దం పడుతుంది. ఈ సంబంధాన్ని సూచించడానికే “గృహనిర్వాహకుడు” అనే పదం ఇక్కడ వర్తించబడింది. మనలో ప్రతి ఒక్కరికి దేవుని ఆస్తిపై బాధ్యత ఉంది. అది మన మానవ శారీరక, మానసిక, నైతికత అనేది భౌతికంగా నిర్మాణం చేయబడిన ఒక ట్రస్ట్ లాంటిది. ప్రతిభ, డబ్బు, సంబంధాలు, సామాజిక గౌరవ స్థానాలు అనే మన ధనాలు రైతులకు కలిగిన పొలపు ఆస్తులు లాంటివి. రైతు తన పొలాన్ని ఎలా సాగు చేస్తాడో అలాగునే మనం మన మానవాకృత ఆస్తులను సరైన పద్దతిలో సరిదిద్దుకోవాలి. మన ఇష్టం వచ్చినట్లు మనం వాటిని ఉపయోగించుకోవచ్చు అనుకుంటే, అది మనలను సృష్టించిన సృష్టికర్తను వమ్ము చేసినట్లవుతుంది మరియు మనలను మనమే వంచన చేసుకున్నట్లవుతుంది. వాటిని సరైన మార్గంలో పరిపాలించడానికి దేవుడు మనకు ఆధిపత్య శక్తిని ఇచ్చాడు (కీర్తన 8:4). మనం దీనిని గ్రహిస్తున్నామా లేక విచారకరంగా “గృహనిర్వాహకత్వ” వాస్తవికతను మరచిపోతున్నామా? మనం అనేక విధాలుగా కొన్ని కొన్ని సార్లు కౌలుదారుననుని యజమానునిగానూ, గృహనిర్వాహకుడిని యజమానిగానూ మార్చేస్తుం టాము కదా?

క్రైస్తవ జీవితాన్ని నిర్వహించు కోవడం అంటే క్రైస్తవ విలువల జీవితపు నిర్వహణ అని అర్ధం. మనం కఠినమైన, నిరుత్సాహపు వ్యాపారం లేదా నిరాశా నిస్పృహలకు లోనైనపుడు, ప్రవక్త హగ్గయి ప్రవచనం, “కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది” (హగ్గయి 1:5-6) అని ప్రతిబింబిస్తుంది. పునీత అగుస్టీను , “మీకు పుష్కలంగా ఉన్నప్పటికీ, మీరు ఇంకా పేదవారే. మీరు తాత్కాలిక ఆస్తులలో సమృద్ధిగా ఉంటారు, కానీ మీకు శాశ్వతమైనవే అవసరం” (ప్రసంగం 56, 9) అని  అంటున్నాడు. క్రైస్తవ విలువల లక్ష్య సాధన విషయానికొస్తే, కార్పొరేటు సంస్థల ప్రవర్తనలో “గృహనిర్వాహకుని” వివేకం ఎలా ఉండాలి? కొన్ని పరిమిత ప్రాంతాలలో పోటీ దాని తత్త్వం ఆరోగ్యకరమైనదే! కాని దాని పిచ్చితనపు వ్యాప్తి అనారోగ్యానికి మాత్రమే కాకుండా ఒక అపవాదపు స్థితికి కారణంగా మారవచ్చు.

14 వ పోపు లియో గారు, ఇటీవల ఒక కాథలిక్ న్యూస్ సైటుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సమాజంలోని ధ్రువణతకు లేదా అనివార్య అసమాన వ్యాప్తి కొంతవరకు "కార్మిక వర్గపు ఆదాయ స్థాయిలు మరియు అత్యంత ధనవంతులు పొందే డబ్బు మధ్య విస్తృత అంతరమే కారణo” అని అన్నారు. మన గృహనిర్వాహకత్వo అనేది సాధించుకున్న లేదా దేవునినుండి పొందుకున్న సంపదను కాపాడే లేదా పరిరక్షించే  ఒక సాధనంగా ఉండాలి. సంపద అనేది “గృహనిర్వాహత్వ” లక్ష్య సాధనకు మాత్రమె వినియోగించాలి.   లోక విషయాలు లేదా అన్యాయపు సంపద తప్పుడు ఆస్తి. మనం రెండింటికి సమానమైన సేవ చేయలేమని క్రీస్తు నొక్కి చెబుతున్నాడు (లూకా 16: 13). లోకం ఒకరి స్వంత కోరికల విషయమై ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తుంటే, దేవుడు మనల్ని అవసరతలో ఉన్నవారి కోసం ఖర్చు చేయాలని కోరుతున్నాడు. ఈ రెండింటి సేవలను సమన్వయం చేయడం అసాధ్యం. అటువంటప్పుడు ఒకదానికి విశ్వాసంగా ఉండటం మరొకదానితో విడిపోవడమే సమంజసం. తన యజమాని వస్తువులతో గృహనిర్వాహకుడు శాశ్వత జీవిత సుఖాన్ని వారసత్వంగా పొందడానికి తన యజమాని ఋణస్తులను తన స్నేహితులుగా చేసుకున్నట్లు, అధర్మపు అన్యాయపు సంపదను మనకు మనమే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా?

లూకా – యేసు ఉపమానాన్ని ఒక ప్రశ్నగా, మన జీవితాలను నడిపించే యజమాని ఎవరు అని ముగిస్తాడు. మన ఆలోచనా జీవితాన్ని నియంత్రించేవాడు, మన ఆదర్శాలను రూపొందించేవాడు, హృదయ కోరికలను మరియు మనం జీవించడానికి ఎంచుకున్న విలువలను నియంత్రించేవాడే మన “యజమాని”. మనం, రైతులుగా, క్రీస్తు ఆత్మ-ఆధారిత విలువలను సాగుచేసుకోవాలి మరియు “గృహనిర్వాహకు”లుగా, మన పునరుత్థానంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలిసినప్పుడు వాటిని తిరిగి అప్పగించాలి. మన డబ్బు, సమయం, ఆస్తులు, విలువైన వనరులు, అందునా మన ఆరోగ్యం, అనేది భౌతికంగా నిర్మితమైన శారీరక, మానసిక, నైతికత దేవుని నుండి వచ్చిన బహుమతులు. “తమ భౌతిక సంపదలను నమ్ముకునేవారు పడిపోతారు, కానీ నీతిమంతులు నీడనిచ్చే పచ్చని ఆకులాగా వృద్ధి చెందుతారు (సామె 11:28) అనే దేవుని వాక్యం బట్టి మనం వాటిని మన కోసం మాత్రమే అసూయతో కాపాడుకోవచ్చా లేదా యేసు రాజ్యంలోని పేదవారి ప్రయోజనం కోసం వాటిని వినియోగించ వచ్చా అని నిర్ధారించుకొందాము.

చిన్న విషయాలలో నమ్మదగిన వారిని గొప్ప విషయాలలో కూడా నమ్మవచ్చు.”

 

Saturday, 13 September 2025

My Redemption in the Cross of Christ: Num 21:4b–9; Ph 2:6–11; Jn 3:13–17 (Sep. 14th/ C)

 

My Redemption in the Cross of Christ

Num 21:4b–9; Ph 2:6–11; Jn 3:13–17 (Sep. 14th/   C)

By your Holy Cross, You have redeemed the World.”

 

Today we celebrate the Feast of the Triumph of the Cross. The recovery of the cross by St. Helena in 326 brought joy to celebrate it throughout the Church. The evangelist John’s account of the Old Testament story (Num 21:4-9) brings fulfillment of God’s saving plan in Jesus’ crucifixion. On their journey through the wilderness, the people of Israel bitterly complained against God. To punish them, God sent a plague of deadly serpents. The people repented and cried for mercy. God instructed Moses to make an image of a serpent and to hold it up on a pole. Those who looked upon the serpent were healed. In later times, the brazen serpent became an idol in the days of Hezekiah, and that was destroyed because people were worshipping it (2 Kgs 18:4). The Jews themselves were confused whether they were forbidden to make images. Thus, the rabbis explained it this way: “It was not the serpent that gave life. It was God who healed them.” The healing power lies not in the brazen serpent. It was only a symbol to indicate God.

The evangelist John uses this story to present Jesus lifted on the cross as the brazen serpent, and people should turn their thoughts and believe in him for eternal life. The Greek verb “hupsoun” means “to lift up” in English. It is used of Jesus in two senses: (1) being lifted upon the Cross (Jn 8:28; Jn 12:32) and being lifted into glory into heaven (Act 2:33; Act 5:31; Phil 2:9). These two are inextricably connected. It is inevitable to have glory without the cross. There is no victory without struggle. There is a phrase that speaks of “believing in Jesus” (Jn 3:16) in the Gospel. It means at least three things. Firstly, God loves and forgives all whom he created. Secondly, he sent his only son, Jesus, to give us everlasting life through his death and resurrection. Thirdly, whatever Jesus says is true, and we should believe it.

We need to understand the phrase “eternal life” (Jn 3:16). If we enter into eternal life, what does it give us? It gives us peace with God. It gives us peace with men.  It enables us to see men as God sees them. It gives us peace with life. God is working all things together for good. We may not understand life any better, but we will no longer resent it. It gives us peace with ourselves. We are more afraid of ourselves than of anything else. We know our own weakness. We know the force of our own temptations, tasks, and the demands of our lives. But now we know that we are facing it all with God. It is not we who live but Christ who lives in us. There is peace founded on Christ.

The deepest peace on earth is certainly a shadow of the ultimate peace which is to come. It gives us hope and a goal to travel. It provides a life of glorious wonder here and yet, at the same time, a life in which the best is yet to be. The Triumph of the Cross is the Triumph of Jesus Christ. The deeper meaning of the Cross is presented in Jesus’ “kenosis,” meaning “emptying” himself. The word “whosoever” in the phrase “whoever believes in him (3:16) employed here brings meaning that in the Divine compassion, there is no limitation, restriction, or condition prescribed by Divine wisdom, which can exclude the meanest or the vilest. God the Father always rejoices in searching out those who have strayed, and he welcomes them home with open arms. Every penitent believer enjoys the incomparable gift of salvation by looking to Jesus on the Cross. The intercessory prayers of Our Lady of Sorrows will surely be our support in our struggle for victory.


Through you the world is redeemed by the blood of the Lord” (Divine Office).

క్రీస్తు శిలువలో నా విమోచన: సంఖ్యా 21:4b–9; ఫిలి 2:6–11; యోహాను 3:13–17 (C / Sep 14)

 

క్రీస్తు శిలువలో నా విమోచన

సంఖ్యా 21:4b–9; ఫిలి 2:6–11; యోహాను 3:13–17 (C / Sep 14)

నీ పవిత్ర శిలువ ద్వారా, నీవు లోకాన్ని విమోచించావు (Divine Office) 

నేడు మనం సిలువ విజయోత్సవ పండుగను జరుపుకుంటున్నాము. క్రీ. శ. 326 వ సంవత్సరములో – యేసు క్రీస్తు వారు భరించిన శిలువను పునీత హెలెనా వారు కనుగొనడంతో మాతృ శ్రీసభ దానిని పరిశీలించి నిర్ధారించిన తరువాతి నుండి విశ్వాసులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పాత నిబంధనలోని ఒక చారిత్రాత్మక సంఘటన (సంఖ్యా 21:4-9)  వృత్తాంతంను యేసయ్య శిలువలో దేవుని రక్షణ ప్రణాళిక పరిపూర్తి అయిన విధానాన్ని  సువార్తికుడు యోహాను నేటి సువార్తలో ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో  దేవునిపై తీవ్రంగా ఫిర్యాదు చేశారు. వారిని శిక్షించడానికి, దేవుడు ప్రాణాంతకమైన సర్పాల తెగులును పంపాడు. చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని దయ కోసం మొరపెట్టుకున్నారు. సర్ప కాటు విరుగుడు కోసం సర్పపు ప్రతిమను తయారు చేసి దానిని ఒక గెడపై వ్రేలాడదీయాలని దేవుడు మోషేను ఆదేశించాడు. వ్రేలాడదీయబడిన సర్పాన్ని వీక్షించిన వారు సర్ప విష విరుగుడుగా స్వస్థత పొందుకున్నారు. స్వస్థత తరువాతనూ అదే ప్రక్రియ ఇశ్రాయేలీయుల జీవితంలో కొనసాగింది. హిజ్కియా రాజు కాలంలో అది ఇత్తడి సర్పపు విగ్రహంగా మారి యూదుల విచిత్ర ఆరాధనా సంస్కృతిగా మారిపోయింది!!! ప్రజలు దానినే  ఆరాధించడం వలన అది నాశనం చేయబడింది (2 రాజులు 18:4). తమ విగ్రహాలను తయారు చేసుకోవడం నిషేధించబడిందా అని యూదులు అయోమయంలో పడ్డారు!! అందువల్ల, రబ్బీలు(బోధకులు) “జీవాన్ని ఇచ్చింది సర్పము కాదు. వారిని స్వస్థపరిచింది దేవుడే. స్వస్థపరిచే శక్తి ఇత్తడి సర్పంలో లేదు. అది దేవుణ్ణి సూచించడానికి ఒక చిహ్నం మాత్రమే” అని వివరించి హెచ్చరించారు.

శిలువపై ఎత్తబడిన యేసును, గెడపై ఎత్తబడిన కంచు సర్పముగా పోల్చి చూపించడానికి సువార్తికుడైన యోహానుకు కలిగిన ఆలోచన ఏమిటి? ఏదోను తోటలో తొలి ఆదిదంపతులను మోసగించిన సర్పపు శోధనాత్మక కాటును (ఆది 3) భగవంతుడు యూదులకు జ్ఞాపకపరిచాడు. అవిధేయత వల్ల పొందుకున్న శాపం నేటి శాపానికి మూల కారణం అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేతనే బాప్తిస్మ యోహాను యోర్ధనులో బప్తిస్మము ఒసగుతూ “ఓ సర్ప సంతానమా! (మత్త 3:7-9 = 12:34; 23:33) అని యూదులను సంభోదించాడు. సైతాను శోధన యేసు రాజ్యంలో ప్రతి ఒక్కరినీ ఇంకా వెంటాడుతూనే వుంది. ఇదే నేపథ్యంలో సువార్తికుడు యోహాను ఈ పోలికను చేస్తూ యేసుక్రీస్తు నందు రక్షణ పొందు కోవడానికి తన పాఠకులను ఆహ్వానిస్తున్నాడు.

ఈ చారిత్రాత్మక సంఘటనను ఉపయోగిస్తూ విశ్వాసులు తమ ఆలోచనలను మార్చుకుని నిత్యజీవం కోసం శిలువపై ఎత్తబడిన యేసు వైపు చూస్తూ విశ్వసించి చావు నుండి రక్షణ పొందుకోవాలి. గ్రీకు క్రియా పదం "హుప్సౌన్" అంటే ఆంగ్లంలో “లిఫ్ట్ అప్” – తెలుగునందు "పైకి ఎత్తడం" అని అర్థం. ఈ పద ప్రయోగమును యేసు ఎడల రెండు అర్థాలను చూపిస్తున్నాడు సువార్తికుడు. మొదటిగా,  సిలువపై “ఎత్త బడటం” (యోహా 8:28; 12:32). రెండవది, స్వర్గపు మహిమలోకి “ఎత్త బడటం” (అపొ 2:33; 5:31; ఫిలి 2:9). ఈ రెండు సంఘటనలు  విడదీయరాని అనుసంధానంగా ఉన్నాయి. శిలువ లేకుండా మహిమ అనేది అనివార్యం. శ్రమ వల్లనే విజయ ప్రాప్తి. "ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడు(యోహా 3:15, 16) అనే ఒక పదబంధం మనకు సువిశేషంలో కన్పిస్తుంది కదా! దీని అర్థం కనీసం మూడు విషయాలను తెలియ చేస్తుంది. అవి మొదటగా, దేవుడు తను సృష్టించిన మానవులందరినీ సరి సమానంగా ప్రేమిస్తున్నాడు మరియు క్షమిస్తున్నాడు. రెండవది, ఆయన తన ఏకైక కుమారుడైన యేసును తన మరణ పునరుత్థానాల ద్వారా మానవులకు నిత్యజీవం ఇవ్వడానికి పంపాడు. మూడవదిగా, యేసు చెప్పేది నిజం కాబట్టి మానవులందరూ దానిని నమ్మాలి.

అలాగునే సువిశేషంలోని “నిత్యజీవము” (యోహా 3:16) అనే పదబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం నిత్యజీవంలోకి ప్రవేశిస్తే, అది మనకు ఏమి ఇస్తుంది? ఈ నిత్య జీవము మనకు దేవునితో శాంతిని ఇస్తుంది. తోటి మనుషులతో మనకు శాంతిని ఇస్తుంది. దేవుడు  సృష్టించిన మనుషులందరినీ తాను చూసే విధంగా చూడటానికి ఇది మనకు కనువిప్పు కల్పిస్తుంది. మన జీవితంలో శాంతిని ఇస్తుంది. ఇలా మన మంచి కోసం పరమోన్నతుడు అన్ని విషయాలను క్రోడికరించి మనకు అందిస్తున్నాడు. మనం మన జీవితాన్ని తగినంత విధంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఎన్నటికీ దానిపై మనం ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఆ “నిత్య జీవ(ము)” కృపను మాత్రం కలిగి ఉంటామన్నది తథ్యం. ఇది మనతో మనకు శాంతిని కలిగిస్తుంది. మరేదైనప్పటికీ – మనమంటే మనమే, మనకు మనమే ఎక్కువగా భయపడిపోతూoటాము ఒక్కొక్కసారి. మన బలా బలాలు, బల బలహీనతలు మనకు తెలుసు. మనకు కలిగే శోధనలు, పరాపజయలు, పరాభావాలు మరియు మన జీవితాల డిమాండ్ల బలం మనకు తెలుసు. కానీ  దేవుని కృపతో ఎల్లప్పుడూ మనం వాటినన్నింటినీ ఎదుర్కొనగలమని మనకు తెలుసు. మనలో జీవించేది మనం కాదు కదా! మనలో నివసించేది క్రీస్తు. క్రీస్తుపై ఆధారపడిన శాంతి మనలో ఉంది. అదే మనలను విజయవంతులను చేస్తుంది.

భూమిపై అందింపబడే కేవల లోక విధాన శాంతి ఖచ్చితంగా రాబోయే అంతిమ శాంతి కాంతులకు ఒక నీడలాంటిది మాత్రమె. అటువంటిది మనకు ఆశను మరియు దాని వైపు ప్రయాణించడానికి ఒక లక్ష్యాన్ని చూపిస్తుందని మర్చిపోకూడదు. అది ఈ లోకంలో అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది. అదే సమయంలో, ఇంకా ఉత్తమమైన రాబోయే జీవితాన్ని అందిస్తుంది. శిలువ విజయం యేసుక్రీస్తు విజయం. మరణంపై విజయం. శిలువ తత్వ లోతైన అర్థం యేసు "కెనోసిస్"లో ప్రదర్శించబడింది. గ్రీకు పదం “కెనోసిస్” అంటే  తనను తాను ఖాళీ చేసుకోవడం అని అర్ధం. సువార్తలో ఉపయోగించబడిన "ఆయనను విశ్వసించేవాడు ప్రతివాడును” (3:16) అనే పదబంధంలోని "ప్రతివాడును" అనే పదం దైవిక కరుణలో, ఎటువంటి పరిమితి లేదా పరిస్థితి లేదని దైవిక జ్ఞానం సూచిస్తున్నట్లు అర్థం ఇస్తుంది. ఇది నీచమైన వాటిని మినహాయించగలదు. తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ దారితప్పిన వారిని వెతకడంలో ఆనందిస్తాడు. అతను వారిని తన కౌగలిత  చేతులతో ఇంటికి స్వాగతిస్తున్నాడు. ప్రతి పశ్చాత్తాపపడిన విశ్వాసి శిలువపై ఉన్న యేసు వైపు చూడటం ద్వారా సాటిలేని మోక్ష బహుమతిని పొందుతాడు. మహిమా కిరీటం పొందుకున్న వ్యకులమాత మధ్యస్థ ప్రార్ధనా సహాయత మనకు ఎల్లప్పుడూ అందుకు తోడుగా వుంటుంది. తథాస్తు.

"మీ ద్వారా ప్రపంచం ప్రభువు రక్తం ద్వారా విమోచించబడింది" (Divine Office)

Friday, 5 September 2025

శిష్యరికానికి అయ్యే ఖర్చు జ్ఞాన 9:13-18b; ఫిలే 9-10, 12-17; లూకా 14:25-33 (24/C)

 

శిష్యరికానికి అయ్యే ఖర్చు

జ్ఞాన 9:13-18b; ఫిలే 9-10, 12-17; లూకా 14:25-33 (24/C)

నేడు, కన్య మరియ దావీదు  వంశం నుండి జన్మించింది(DO)

 

క్రీస్తు శిష్యులు అంటే ఆధ్యాత్మిక సైనికులులా ఉండడానికి పిలువబడినారని అర్ధం. అందుకు దానిలో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన ఇబ్బందులను (లూకా 14:31, 32) పరిగణనలోకి తీసుకోవాలని కోరుతుంది. అంకితభావంతో కూడిన జీవితంలో ప్రతి క్రీస్తు అనుచరుడు విశ్వాసపు పోటీలో పోరాడటానికి మరియు దానిని నిర్మించ దలచిన ఖరీదైన విశ్వాసపు గోపురాన్ని లేదా ఒక తటస్థ యుద్ధాన్నే కలిగి ఉంటాడు. అలాగునే సువార్తను వ్యాప్తి చేసే రంగంలోనూ, దానికి అవసరమయ్యే గణాంకాలు, అంచనాలు చాలానే అవసరం. ఈ కాలంలో మనం ఒక పెద్ద సామాజిక-సాంస్కృతిక మార్పులోనూ, కృత్రిమ మేథా సంస్కృతిలో జీవిస్తున్నాము. ప్రపంచంలోని ఈ కొత్త దశలో పెనవేసుకుపోయిన విశ్వాసాన్ని బాగా తెలుసుకోకుండా, దాని అంతర్గికతను అర్థం చేసుకోకుండా మనం విశ్వాసాన్ని ఏమాత్రం వ్యాప్తి చేయలేము. మన ప్రస్తుత కాలపు ఆలోచనా విధానాన్ని, భావాలను మరియు వాటి భాషా విధానాలను మనం తృణీకరించినా లేదా వాటిని విస్మరించినా మనం సువార్తకు ఎలాంటి ప్రాప్యతను అందించలేము కదా? అలాగని మారుతున్న వివిధ సామాజిక విలువల భాషను జతపరచి దేవుని ప్రణాళికతో నడవకుండా నేటి సవాళ్లకు మనం ప్రతిస్పందించలేమా! “వాక్కు శరీరమును దాల్చి” నట్లు (యోహా 1:14) నానాడు మార్పుచెందే నేటి సంస్కృతులలో వేదము శరీరాన్ని దాల్చుకోవాలా?

అబ్రాము తన స్వంత దేశాన్ని వీడి అబ్రహాముగా తెలియని దూరాలకు బయలుదేరాడు. మోషే దేవుణ్ణి సేవించడానికి ఫరో ఆస్థానాన్ని విడిచిపెట్టాడు. పౌలు తన సంపద మరియు ధర్మశాస్త్ర వృత్తిని విడిచిపెట్టి “వాక్కు” వ్యాప్తి కోసం బయలుదేరాడు. అపొస్తలులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు దానిని బాహాటం చేయడానికి బయలుదేరారు. వారు తమ ప్రేరేపితుని కోసం తప్ప లోక ప్రమాణాలను  ఎప్పుడూ లెక్కించలేదు. కానీ ఆ జాడ తప్పనిసరి! యోబు విచారణలో, యోబు తన ప్రాణాన్ని కోల్పోకుండా తనకున్నదంతా వదులుకుంటాడని సాతాను ఊహించాడు (యోబు 2:4). పిల్లలు మరియు ఆస్తిని కోల్పోయినప్పుడు దేవుణ్ణి శపించని పితృస్వామ్యుడు కనీసం దేవుడు తన ఎముకను లేదా శరీరాన్ని తాకితే విచ్ఛిన్నమవుతాడని సాతాను ఊహించాడు. కానీ యోబు చాలా ఆధ్యాత్మికంగా ఆలోచించాడు. లోక తీరుకు భిన్నంగా ఆలోచించాడు. చంపబడినా సరే దేవుణ్ణి విశ్వసించడానికి వెనుకాడలేదు (యోబు 13:15).

అవిలాపురికి చెందిన థెరెసా తన జీవితమంతా శారీరక వ్యధతో బాధపడింది. తన కష్టాల వల్ల తాను ఎప్పుడూ బయటపడలేదు. తన  ఆధ్యాత్మిక సన్నిహిత సహచరుడు జాన్ అఫ్ ది క్రాస్, కార్మెలైట్ ఆర్డర్ నుండి లేచిన తిరుగుబాటుదారుడిగా జైలు పాలయ్యాడని మరియు శిక్షింపబడ్డాడని విన్నప్పుడు, ఆమె తనకు ఇలా వ్రాసింది, "దేవుడు తన స్నేహితులతో వ్యవహరించడానికి భయంకరమైన మార్గాన్ని కలిగి ఉన్నాడు మరియు వాస్తవానికి అతను వారికి ఎటువంటి తప్పు చేయడు. ఎందుకంటే అతను తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా అదేవిధంగా వ్యవహరించాడు." ఆటువంటప్పుడు, సర్వ పవిత్ర దేవుని కుమారుడైన క్రీస్తు – బాధ మరియు మరణానికి లోనైతే,  అతని సేవకులమైన మనం, మన గురువు నుండి భిన్నంగా వ్యవహరింపబడతామని ఆశించగలమా? భారతీయ జెస్యూట్ అయిన ఫాదర్ స్టాన్ స్వామి,  ఉత్తర భారత అటవి తెగలకు సామాజిక న్యాయం తీసుకురావడానికి కృషి చేసి పోరాడినందుకు బెయిలు రాకముందే కోవిడ్-19లో మరణించాడు. ఇందు నిమిత్తమే, "తన సిలువను మోసుకెళ్ళని మరియు నా తర్వాత రాని ఎవరైనా నా శిష్యుడు కాలేరని యేసు చాలా స్పష్టంగా పేర్కొన్నాడు." జీవితంలోని ప్రతి రంగంలో, ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ్యపు విలువ ఖర్చును లెక్కించమని మాతృశ్రీసభ మనలను ఆహ్వానిస్తుంది. బాప్తిస్మము, వివాహం, మఠవాస్యత మరియు ఆర్డినేషన్ వంటి దివ్య సంస్కారములను తేలికగా లేదా అనాలోచితంగా లెక్కించకూడదు. ఈ సంస్కారాల స్వికరణను ఆలోచనాత్మకంగా, భక్తితో మరియు దేవుని భయంతో పరిగణించాలి.

దేవుడు తన పిల్లలు బాధపడటం చూసి అపవిత్రంగా ఆనందించేవానిగా మనం ఊహించకూడదు. ఆదికాండము 1:31 లోని సృష్టి కథనం చివరలో, "దేవుడు తాను చేసినదంతా చూశాడు మరియు అది నిజంగా (తన) కంటికి ఇంపుగా ఉన్నది" అని మనకు చెపుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశ్యానికి ఉపయోగపడేంత వరకు ప్రతిదీ మంచిదే అని మనం చెప్పగలం. యేసు తన కోసమే బాధను కోరుకున్నాడని సువార్తలు ఎక్కడా సూచించలేదు. గెత్సేమనేలో, "తండ్రీ, సాధ్యమైతే, ఈ పాత్రను నా నుండి తొలగిపోనివ్వండి" (మత్త 26:39) అని ఆయన ప్రార్థన చేశాడు. ఇటువంటి యేసు ఉదాహరణ, అలాగే ఆతని పాపరహిత తల్లి మరియ ఉదాహరణ నీతిమంతులు, సద్గుణవంతులు తమ తమ బాధలను మరియు ప్రపంచంలోని పాప ప్రభావాలను నివారించడం అనేది అసాధ్యమని మనకు చూపిస్తుంది. పౌలు తన బాధలను నివృత్తి  చేయమని దేవుడిని వేడుకున్నప్పుడు, అతనికి లభించిన సమాధానం, "నా కృప నీకు చాలును" ​​(2 కొరింథీ 12:9). అందుకే పౌలు, “మీ కొరకు నేను సంతోషముగా బాధపడుచు, నా శరీరమందు క్రీస్తు ఇంకా అనుభవించవలసినదంతయు తన శరీరమైన సంఘము కొరకు తీర్చుకొనుటకు నేను చేయగలిగినదంతయు చేయుచున్నాను” (కొలొ 1:24) అని వ్రాశాడు. కాబట్టి మన సమస్తము ఆతని మహిమ కొరకే!

వెలుగు రాకముందు చీకటి వచ్చును మరియు కృప చట్టబద్ధతను స్వేచ్ఛకు బదులుగా మారుస్తుంది” ( St Andrew of Crete)

 

 

The Cost of Discipleship Wis 9:13-18b; Phile 9-10, 12-17Lk 14:25-33 (24/ C)

 

The Cost of Discipleship

Wis 9:13-18b; Phile 9-10, 12-17Lk 14:25-33 (24/ C)

Today, the Virgin Mary was born of the race of David (DO)

 

The disciples of Christ are called to be like soldiers who go to war, must consider the hazards of it, and the difficulties that are to be encountered (Lk 14:31, 32). Each follower would have a costly tower to build in the devoted life and a war to wage in the contest for the faith. Even in the field of spreading the Gospel, it calls for calculation and estimation. In our times, we are living through a major socio-cultural change. We cannot spread faith in this new phase of our world without knowing it well and understanding it from within. What access to the Gospel can we offer if we despise or ignore the thinking, feelings, and language of our own times? We cannot respond to today’s challenges without walking with the divine plan of God.

 

Abraham departed from his own country. Moses departed Pharaoh’s court to serve God. Paul departed from his wealth and profession of Law. Apostles departed to different parts of the world to proclaim him. They never calculated the measures of the world except for their motivator. But the trail is inevitable. Satan, in the trial of Job, imagined that Job would give up all that he had rather than lose his life (Job 2:4). He fancied that the patriarch, who would not curse God under the loss of children and property, would break down if God touched his bone or his flesh. But Job was so spiritually minded as to be ready to trust God, even should he be slain (Job 13:15).

Teresa of Avila suffered all her days, never allowing herself to be overcome by her troubles. When she heard that her close associate, John of the Cross, was imprisoned and being punished as a renegade from the Carmelite Order, she wrote, “God has a terrible way of treating his friends, and in truth he does them no wrong, since that was the way he treated his own Son, Jesus Christ.” If Christ, then, the all-holy Son of God, submitted to suffering and death, then we, his servants, cannot expect to be treated any differently from our Master. Fr. Stan Swamy, an Indian Jesuit, struggled and died in prison for working towards bringing social justice to the Northern tribes. And thus, he states quite categorically. “Anyone who does not carry his cross and come after me, cannot be my disciple.” In every sphere of life, a Christian is called upon to count the cost. The sacraments like Baptism, Marriage, and Ordination are not to be entered upon lightly or unadvisedly, but thoughtfully, reverently, and in the fear of God.

We should not picture God as being one who takes an unholy delight in seeing his children suffer. At the end of the creation story in Genesis 1:31, we are told, “God saw all he had made and indeed it was good.” We can therefore say that everything is good insofar as it serves God’s purpose. Nowhere do the gospels suggest that Jesus wanted suffering for its own sake. His prayer in Gethsemane was, “Father, if it be possible, let this chalice pass from me” (Mt 26:39). But the example of Jesus, as well as that of his sinless mother, shows us that it is impossible, even for just and virtuous people, to avoid suffering and the effects of sin in the world. When Paul begged God to cure him of his ailments the answer he got was, “My grace is all you need.” (2 Cor 12:9). Later he would write: “I gladly suffer for you, and in my body do what I can to make up all that has still to be undergone by Christ for the sake of his body, the Church” (Col 1:24).

“Darkness yields before the coming of the light, and grace exchanges legalism for freedom” (St Andrew of Crete)