న్యాయో ధర్మ రక్షతి రక్షితః
యెష 58:7-10; 1 కొరింథీ 2:1-5; మత్త 5:13-16 (A 5)
"ప్రభువు
శిలువ మనకు జీవవృక్షముగా మారింది."
ప్రవక్త
యెషయా యూదా ప్రజల సజీవ
విశ్వాసాన్ని యెరూషలేములో పునరుజ్జీవింపజేస్తున్న రోజుల్లోనే (సుమారు క్రీ.పూ.742), తన
సమకాలీనుడైన ప్రవక్త ఆమోసు ఉత్తర
ఇజ్రాయెలు ప్రాంత న్యాయస్థానాలలో (సుమారు 760–755 క్రీ.పూ.), న్యాయం నిరాకరించబడుతున్న పేదల కొరకు, వారి
దుస్థితిని గురించి (ఆమో 5:7-15) మరియు వారి వస్తువులు సహితం జప్తు చేయబడుతున్నాయని (5:11) తన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. తన వంతుగా, సామాజిక న్యాయం కోసం ఉద్వేగభరితమైన గొంతుతో యెషయా దండోరా చేసాడు.
దేవుని సృజనాత్మకత మరియు తన మహిమ భూమినంతటిని నింపుతుందనే అతని లోతైన నమ్మకం నుండి తన
న్యాయమైన మరియు సమాకృత భావన పుట్టు కొచ్చింది (యెష 6:3). దైవిక
ఉనికి పవిత్ర ఆలయాన్ని మాత్రమే కాకుండా మొత్తం సృష్టినంతటిని నింపుతుందని నమ్మాడు. యెషయా మరియు ఆమోసు,
ఇరువురునూ పేదల దోపిడీ, నైతిక అవినీతి మరియు దైవిక తీర్పు అనివార్యతపై దృష్టి సారించారు.
మానవులకు భూమిపై తగు న్యాయం వర్ధిల్లాలని యెహోవా కోరుకుంటున్నట్లు తమ గగ్ధత గొంతును
వినిపించారు.
గడచిన
ఆదివార ధన్యవచనాల బోధననంతరం, శిష్యరిక జీవితాన్ని వివరించడానికి నేడు
“ఉప్పు” మరియు “వెలుగు” సుపరిచితమైన రూపకాలను యేసు ఉపయోగిస్తున్నట్లు నేటి సువార్త
పఠనంలో మనం వింటున్నాము. నేటి సమాజం ఉప్పు మరియు “దీప స్థంభము”ను తేలికగా
తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. నేటి ఆర్దికోన్నత
స్థితే దీనికి కారణమని మనం చెప్పుకోవాలి. కానీ మన పురాతన
సంస్కృతులలో, మనకు తెలిసినట్లుగా, ఈ వస్తువులు చాలా విలువైనవి. ఉప్పును రుచిని పెంచడానికి, సంరక్షణకారిగానూ మరియు వైద్యం చేసే ఏజెంట్‌గానూ ఉపయోగిస్తారు.
ఉప్పును చూడలేము కానీ గ్రహించవచ్చు ఆస్వాదించవచ్చు. "చిన్న చిన్న చీమల"
లాగా కష్టపడి పనిచేస్తూ, ఎల్లప్పుడూ మంచినే కాంక్షించి శ్రమిస్తూ సమాజంలో
"గుర్తించ బడని" వ్యక్తులు చాలా మందినే ఉన్నారు. వీరే యేసు ఉపమాన పాఠoలోని ధన్యులు.
వారిలో కొందరు "పర్వతం పైన" లేదా "దీప స్తంభం" (మత్త 5:14-15)
పై అర్హులయిన
దరిద్రులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు కదా!! మనమందరం ఉప్పు మరియు
వెలుగుగా ఉండటానికి పిలువబడ్డాము. నజరేతులో తన 30 సంవత్సరాలకు
పైగా, యేసు కూడా "ఉప్పు" లాంటివాడేనని మనం గ్రహించాలి!!
ఒకసారి, అలోషియస్ గొంజగా తన చిన్న తనంలో ఆడుకుంటున్నప్పుడు, ఎవరో ఒకరు తనను – కొన్ని నిమిషాల్లో తాను చనిపోతానని తెలిస్తే ఏమి
చేస్తావని అడిగారట! అందుకు, "నేను ఆడుతూనే ఉంటాను" అని ఆ పునీత అలోషియస్
గొంజగా సమాధానం ఇచ్చాడట! ఆయన తన సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండేవాడు.
సామాజిక న్యాయం పట్ల మన నిబద్ధత అనేది నేటి సువార్తలో యేసు మనకు ఇచ్చే తన ఉద్బోధ
నుండి ప్రవహిస్తుంది. ఈ నిబద్ధత మనల్ని నడిపించే కొన్ని కార్యకలాపాలకు శారీరక
మరియు ఆధ్యాత్మిక పనులుగా మరింత నిర్దిష్ట వ్యక్తీకరణగా ఇవ్వబడ్డాయి. మనం ఆకలితో ఉన్నవారికి ఆహారం
ఇచ్చినప్పుడు, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు
ధరించినప్పుడు, దుఃఖిస్తున్న వారిని ఓదార్చినప్పుడు,
మొదలైన వాటి ద్వారా, మనం భూమికి ఉప్పుగానూ మరియు ప్రపంచానికి వెలుగుగానూ నిలుస్తాము.
విశ్వాస సమాజంతో, పవిత్ర తిరుసభతో కలసి ఈ పనులను చేయ గలిగినప్పుడు, దాచబడలేని "పర్వతంపై నిలచి వెలిగే నగరం"గా మనము వ్యవహరిస్తున్నాము!
పోప్
ఫ్రాన్సీసు వారు కథోలిక్కులను "అంచుల
వరకు వెళ్లండి" అని పిలిపునందించాడు. అంటే "తన స్వంత భద్రతా సుఖానికి అతుక్కుపోయిన కార్పొరేటు విధి విధానాల వలయంలో చిక్కుకున్న సంఘం కంటే
"నలిగి, మురికిగా మార్చ బడి వివస్తగా మార్చబడిన” క్రీస్తు
సంఘాన్ని ఆలింగనం చ్చేసుకోవడాన్ని ఆయన
ఇష్టపడ్డాడు. నిష్క్రియాత్మక ఆశతో మన నిర్మాణాలలో మనం ఇక దాక్కుని ఉండలేము! “నిత్య
అవసరతలు” పొందుకోలేనంత ఉబిలో కూరుకు పోయిన వారిని కలిసే ప్రమాదాన్ని సహితం ఎదుర్కోవాలని
నేటి సువార్త మనల్ని ఆహ్వానిస్తుంది. ఇది పేదా బిక్కు వారికి తలోడ్డే సంస్కృతిని
ప్రోత్సహించాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు మన సంఘానికి అవసరమైనది రక్త
గాయాలను నయం చేసి, చలి హృదయాలను వేడి చేసి చైతన్య పరచే ధన్యులే కానీ భద్రతామయమైన
సఖాన ఉయాలలూగడం కాదు.
“క్రీస్తు వాక్కు
సమృద్ధి ధన్యులైన వారితోనే నివసిస్తుంది.”
No comments:
Post a Comment