యాత్ర మార్చడానికి రూపాంతరం చెందు...
ఆది 12:1-4a; 2 తిమో 1:8b-10; మత్త 17:1-9 (A – లెంట్ 2)
“ప్రభువు వారిని ఎడారిలో
నడిపించుటకు మేఘస్తంభ రూపములో వారికి ముందుగా వెళ్ళెను”
ఈ
తపస్సుకాల రెండవ ఆదివారం రోజున మాతృ శ్రీసభ మనల్ని యేసు రూపాంతరం చెందిన పర్వతానికి నడిపిస్తుంది. ఇది మొదటి సంగ్రహ (సినాప్టిక్)
సువార్తలలో వివరించబడింది. తన శిష్యులైన పేతురు, యాకోబు మరియు యోహానులను పర్వతం పైకి యేసు
తీసుకువెళతాడు. అక్కడ అతని ముఖం దైవిక మహిమతో ప్రకాశించింది. "ఈయన నా ప్రియమైన
కుమారుడు. ఈయన మాట వినండి" అన్న తన తండ్రి స్వరం వినబడింది. ఈ రహస్యం నేడు
మనతో నాలుగు ముఖ్యమైన విధానాల్లో మాట్లాడుతుంది.
మొదటగా, యేసు నిజంగా ఎవరు మనకు
ఏమౌతాడు అన్న విషయాన్ని ఈ రూపాంతరం వెల్లడిస్తుంది. ఆయన ఒక విశ్వ గురువు లేదా
ప్రవక్త మాత్రమే కాదు. ఆయన దేవుని ప్రియమైన కుమారుడు. మోషే మరియు ఏలీయా ఆయన పక్కన
కనిపిస్తారు. యేసు ధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తాడని ఆ
సన్నివేశం చూపిస్తుంది. మరియు ఆ ప్రత్యక్షత ఆయన శ్రమలకు ముందు సంభవించింది. మహిమ అనునది
శిలువ ద్వారా మాత్రమె వస్తుందన్న సందేశం స్పష్టంగా కన్పిస్తుంది. దేవుడు తన
శక్తిని ప్రాపంచిక విజయంలో కాదు,
త్యాగం, విధేయత మరియు ప్రేమలో వెల్లడిస్తాడని ఈ లెంట్ మనకు గుర్తు చేస్తుంది.
రెండవదిగా, యేసు రూపాంతర సన్నివేశం మనల్ని మన వ్యక్తిగత పరివర్తనకు పిలుస్తుంది.
ఈ దీక్షా కాలం రూపాంతరం చెందుతున్నామా? లేక కనీసం మనం అందుకు ప్రయిత్నిస్తున్నామా
అని ఈ కృపా కాలం మనలను అడుగుతుంది. తండ్రి దేవుడు "ఆయన మాట వినండి" అని పిలుపునిస్తున్నాడు.
క్రీస్తు మాట వినడం అంటే - మన జీవితాలను మార్చుకోవడం. పాపం నుండి దూరంగా ఉండటం. ఇతరులను
క్షమించడం. దాతృత్వంను పాటించడం. న్యాయంలో జీవించడం మరియు మన దైనందిన
చర్యలలో క్రీస్తు వెలుగును ప్రతిబింబింప చేయడం. మనం ఎలా జీవిస్తున్నామో దానిలో క్రిస్తుయందు
మన నిజమైన విశ్వాసం కనిపింపచేయడం అని అర్ధం.
మూడవదిగా, ఈ సంఘటన మనకు పవిత్ర
సంఘ జీవితాన్ని విశిదం చేస్తుంది. యేసు తన శిష్యులను పర్వతం పైకి తీసుకువెళ్ళాడు.
విశ్వాసం ఒంటరిగా జీవించదు. మనం సంఘంలో క్రీస్తును కలుస్తాము. పరిశుద్ధ గ్రంథ
వాక్యంలోనూ, యూకరిస్ట్‌లోనూ, ప్రార్థనలోనూ మరియు మన భక్త సమాజంలోనూ కలుసుకుంటాము. కానీ యేసు శిష్యుల
మాదిరిగానే, మనం పర్వతంపై ఎక్కలేము. అక్కడే వుండిపోలేము. సేవ చేయడానికి, ప్రేమించడానికి
మరియు క్రీస్తు వెలుగును సమాజంలోకి తీసుకువెళ్లడానికి మనం బలపడిన లోకానికి తిరిగి
వద్దాము.
చివరగా, యేసు రూపాంతరం మన
విధిని మనకు బోధిస్తుంది. ప్రతి మానవ వ్యక్తికి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దానిని
వెల్లడిస్తుంది. పరివర్తన మరియు సత్ర్పవర్తన దైవిక మహిమలో పాల్గొనడానికి
సహకరిస్తుంది. క్రీస్తు మన భవిష్యత్తును (destiny) మనకు చూపిస్తాడు. తనను నమ్మకంగా
అనుసరించేవారు తన మహిమలో పాలుపంచుకుంటారు. కాబట్టి ఈ తపస్సు కాలం అనేది కృపా సమయం. మన
విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. మన ఆశను పునరుద్ధరింప చేస్తుంది.
దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంపొందింప చేస్తుంది. మనం ఈ దీక్షాకాల
ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు,
ప్రార్థన ద్వారా మన అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాన్ని ఎక్కుదాం. పాత
ప్రయాణాన్ని మార్చు కోవడానికి యేసులో రూపాంతరం చెందుదాం. భక్త సంఘంలో క్రీస్తును
కలుసుకుందాం. రూపాంతరం చెందిన జీవితాలను అనుభూతి చెందుదా౦. అపుడు దేవుడు మన కోసం
సిద్ధం చేసిన మహిమా వెలుగు వైపు నమ్మకంగా అడుగులు వేయగలం.
“యూదా యెహోవా
ఆలయమాయెను. ఇశ్రాయేలు ఆయన రాజ్యమాయెను”.
No comments:
Post a Comment